తండ్రీకొడుకుల అరుదైన దృశ్యం.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Dulquer Salmaan and Mammootty In Maybach GLS: సినిమాల్లో నటించడం అంటే ఎంత ఇష్టమో.. కార్లు, బైకులన్నా కూడా కొంతమంది సెలబ్రిటీలకు చాలా ఇష్టం. ఈ జాబితాలో మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి మరియు ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ ముందు వరుసలో ఉంటారు. వీటి గ్యారేజిలో అన్యదేశ్య మరియు ఖరీదైన కార్లు లెక్కకు మించి ఉంటాయి. గతంలో చాలా సార్లు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ ఖరీదైన కార్లను డ్రైవ్ చేస్తూ కనిపించారు. కానీ వీరిరువురు కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇటీవల ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో దుల్కర్ సల్మాన్ కారు డ్రైవ్ చేస్తుంటే.. మమ్ముట్టి ప్యాసింజర్ సీటులో కూర్చుని ఉండటం చూడవచ్చు. వీరు ప్రయాణిస్తూ కనిపించిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జీఎల్ఎస్600 (GLS600) అని తెలుస్తోంది. ఈ కారు చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో కూడా స్థానం సంపాదించుకుంది. దీన్ని బట్టి చూస్తే ఈ కారు అంటే సెలబ్రిటీలకు ఎంత ఇష్టమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

బ్లాక్ కలర్ జీఎల్ఎస్600 కారును మమ్ముట్టి గత ఏడాది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది మొహమ్మద్ కుట్టి అనే పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడి ఉన్నట్లు తెలుస్తోంది. మమ్ముట్టి అసలు పేరు ”మొహమ్మద్ కుట్టి”. నిజానికి ఇది జర్మన్ బ్రాండ్ కారు. వీరి గ్యారేజిలోని దాదాపు అన్ని కార్ల రిజిస్ట్రేషన్ నెంబర్ 369.

ఫీచర్స్

మెర్సిడెస్ బెంజ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన కారక జాబితాలో మేబ్యాచ్ జీఎల్ఎస్600 ఒకటి. దీనికి చాలా రోజులకు ముందే కంపెనీ దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. లాంగ్ స్టైల్ సీటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్, కాంపాక్ట్ రిఫ్రిజిరేటర్, బర్మెస్టర్ ఆడియో సిస్టం మరియు వర్చువల్ అసిస్టెంట్ వంటి మరెన్నో ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల చాలామంది సంపన్నులు లేదా ప్రముఖులు ఈ కారును కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఇందులో భాగంగానే మమ్ముట్టి కూడా ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేశారు.

డిజైన్

సాధారణ జీఎల్ఎస్ కారుతో పోలిస్తే.. మేబ్యాచ్ జీఎల్ఎస్600 ఓ ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ప్రీమియంగా కనిపిస్తుంది. బయటి వైపు అడిషినల్ క్రోమ్ యాక్సెంట్స్ ఉన్నాయి. జీఎల్ఎస్600 కారులోని గ్రిల్ దాని సాధారణ వెర్షన్ నుంచి భిన్నంగా కనిపించేలా చేస్తుంది. ఈ కారు డ్యూయెల్ ఫంక్షన్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటివి పొందుతుంది. బంపర్ దిగువన క్రోమ్ వెంట్స్ మరియు స్కిడ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి.

ఇంజిన్

మోనో టోన్ మరియు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్స్ కలిగిన ఈ మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ జీఎల్ఎస్600 కారు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ కారులో 4.0 లీటర్ వీ8 ఇంజిన్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం కూడా ఉంటుంది. ఇంజిన్ గరిష్టంగా 557 పీఎస్ పవర్ మరియు 730 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. హైబ్రిడ్ సిస్టం ద్వారా అదనంగా 22 పీఎస్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ అవుతుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి పనితీరు చాలా అద్భుతంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.

369 రిజిస్ట్రేషన్ నెంబర్

మమ్ముట్టి గ్యారేజిలో కేవలం మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్600 మాత్రమే కాకుండా.. బీఎండబ్ల్యూ ఈ 46 ఎమ్3, టయోటా ల్యాండ్ క్రూయిజర్, ఆడి ఏ7, మినీ కూపర్ ఎస్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్ మరియు జాగ్వార్ ఎక్స్‌జే వంటి మరెన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే.. ఈ కార్ల నెంబర్స్ అన్నీ కూడా 369 అని ఉండటం గమనార్హం.

Don’t Miss: దేవర భామ ‘జాన్వీ కపూర్’ కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే షాకవుతారు

జీఎల్ఎస్600 కారు కలిగిన సెలబ్రిటీలు

బెంజ్ జీఎల్ఎస్600 కారు కలిగిన సెలబ్రిటీల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, అజయ్ దేవగన్, ఆయుష్మాన్ ఖురానా, ఆదిత్యరాయ్ కపూర్. అర్జున్ కపూర్, కృతి సనన్, రణవీర్ సింగ్, శిల్ప శెట్టి, కంగనా రనౌత్, నయనతార మరియు రామ్ చరణ్ వంటి ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 3.35 కోట్లు (ఎక్స్ షోరూమ్) అని సమాచారం.