26.7 C
Hyderabad
Friday, April 4, 2025

ప్రియుడితో సోనాక్షి సిన్హా పెళ్లి.. ఈ హీరోయిన్ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?

Sonakshi Sinha Got Marriage With Zaheer Iqbal And Their Cars: బాలీవుడ్ బ్యూటీ ‘సోనాక్షి సిన్హా’ (Sonakshi Sinha).. అంటే తెలుగు వారికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ లింగ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన భారతి అంటే మాత్రం అందరికి ఇట్టే గుర్తొచ్చేస్తుంది. తన నటనతో అంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ఈ రోజు (జూన్ 23)న తాను ప్రేమించిన ‘జహీర్ ఇక్బాల్’ను పెళ్లి చేసుకుంది. పెళ్ళికి ముందు సోనాక్షి ఫ్యామిలీ నిర్వహించిన పూజలో ఈమె చాలా సింపుల్ డ్రెస్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ కథనంలో నటి ‘సోనాక్షి సిన్హా’ ఎలాంటి కార్లను ఉపయోగిస్తోంది.. వాటి ధర ఎంత? అనే ఆసక్తికరమైన వివరాలు వివరంగా తెలుసుకుందాం.

సినిమాల్లో నటిస్తూ అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్న సోనాక్షి సిన్హా.. 2010లో సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తరువాత ఎన్నెన్నో బ్లాక్ బ్లస్టర్ సినిమాల్లో నటిస్తూ బాగానే సంపాదించింది. ప్రస్తుతం ఈమె కార్ గ్యారేజిలో ‘మెర్సిడెస్ బెంజ్ ఎస్350, జీఎల్ఎస్ 350డీ మరియు బీఎండబ్ల్యూ 6 సిరీస్ జీటీ’ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్350 (Mercedes Benz S350)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఎస్350 కారు సోనాక్షి సిన్హా గ్యారేజిలో ఉంది. ఈ కారు ధర సుమారు రూ. 1.77 కోట్లు అని తెలుస్తోంది. ఈ లగ్జరీ కారు మంచి డిజైన్ కలిగి, అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 286 Bhp పవర్ మరియు 600 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం 6.0 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. ఇది 15.5 కిమీ మైలేజ్ అందిస్తుంది.

బీఎండబ్ల్యూ 6 సిరీస్ జీటీ (BMW 6 Series GT)

సోనాక్షి సిన్హా గారేజీలోని మరో ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారు.. బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 6 సిరీస్ జీటీ. రూ.75.90 లక్షల ఖరీదైన ఈ కారు అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే ఈ కారు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

బీఎండబ్ల్యూ 6 సిరీస్ జీటీ కారు 2.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 261.4 Bhp పవర్ మరియు 620 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు కేవలం 6.1 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంటుంది. ఈ లగ్జరీ కారు 17.19 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ (Mercedes Benz GLS 350D)

సోనాక్షి సిన్హా గ్యారేజిలోని మరో బెంజ్ కారు.. జీఎల్ఎస్ 350డీ. దేశీయ మార్కెట్లో ఈ లగ్జరీ కారు ధర కోటి రూపాయల కంటే ఎక్కువే. ఈ కారు వీ6 ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 255 Bhp పవర్ మరియు 620 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు కేవలం 4.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Don’t Miss: పెళ్ళికి ముందే కాబోయేవాడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – ఫోటోలు చూశారా?

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 222 కిమీ వరకు ఉంటుంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు యొక్క మైలేజ్ లీటరుకు 11.5 కిమీ వరకు ఉంటుంది. ఇది వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువ మంది సెలబ్రిటీలు ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

జహీర్ ఇక్బాల్ కార్స్ అండ్ బైక్స్

సోనాక్షి సిన్హా భర్త జహీర్ ఇక్బాల్ వద్ద కూడా ‘మెర్సిడెస్ బెంజ్ ఎం-క్లాస్’ మరియు ‘డుకాటీ స్క్రాంబ్లర్’ బైకు ఉంది. ఈ బైక్ ధర సుమారు రూ. 9 లక్షల వరకు ఉంది. ఈ బైక్ మంచి డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. లగ్జరీ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ రైడింగ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు