Celebrities Who Bought New Expensive Cars This Festive Season: దసరా మరియు దీపావళి వచ్చిందంటే చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇందులో సాధార ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఉంటారు. ఈ పండుగ సీజన్‌లో ఇటీవల ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన సెలబ్రిటీలు ఎవరు? వారు కొనుగోలు చేసిన కార్లు ఏవి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సోనమ్ కపూర్ ల్యాండ్ రోవర్ (Sonam Kapoor Land Rover)
ప్రముఖ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇటీవల ఓ ఖరీదైన ల్యాండ్ రోవర్ కారుని కొనుగోలు చేసింది. ఈ కారు ధర సుమారు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. ఈమె 5 డోర్స్ కలిగిం 110 వేరియంట్ కొనుగోలు చేసింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.
అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 300 Bhp పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ ల్యాండ్ రోవర్ కారు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది.
అనిల్ కపూర్ మెర్సిడెస్ బెంజ్ (Anil Kapoor Mercedes Benz)
నటుడు అనిల్ కపూర్ కొనుగోలు ఇటీవల ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz) కంపెనీకి చెందిన ‘ఎస్ 580 4మ్యాటిక్’ (S 580 4Matic) కొనుగోలు చేసాడు. దీని ధర రూ. 2.69 కోట్లు (ఎక్స్ – షోరూమ్). దీనిని ముంబైకి చెందిన మెర్సిడెస్ బెంజ్ డీలర్‌షిప్ నుంచి డెలివరీ తీసుకున్నట్లు తెలుస్తోంది. డెలివరీ తీసుకునే సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2022 ప్రారంభంలో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ కారు 4.0 లీటర్ బై టర్బో వి8 మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 496 Bhp పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి.. ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది.
శ్రద్దా కపూర్ లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా (Shraddha Kapoor Lamborghini Huracan Tecnica)
నటి శ్రద్ధా కపూర్ కొనుగోలు పండుగ సీజన్‌లో కొనుగోలు చేసిన కొత్త కారు ‘లంబోర్ఘిని’ (Lamborghini) కంపెనీకి చెందిన ‘హురాకాన్ టెక్నికా’ (Huracan Tecnica). దీని ధర రూ. 4.04 కోట్లు. ఈ కారుకి సంబంధించిన ఫోటోలను పూజ చౌదరి తన ఇన్స్టా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
హురాకాన్ టెక్నికా 5.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 పెట్రోల్ ఇంజిన్ కలిగి 8000 rpm వద్ద 631 Bhp పవర్ మరియు 6500 వద్ద 565 న్యూటన్ మీటర్ టార్క్ చేస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ మరియు 9.1 సెకన్లలో గంటకు 0 నుంచి 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 325 కిమీ వరకు ఉంది.
Don’t Miss: తాప్సీ గ్యారేజీలో ఖరీదైన కార్లు.. బాలీవుడ్‌కు వెళ్లి బాగానే సంపాదించిందే!
నీతా అంబానీ రోల్స్ రాయిస్ కల్లినాన్ బ్లాక్ బ్యాడ్జ్ (Nita Ambani Rolls Royce Cullinan Black Badge)
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఇటీవల రూ. 8.2 కోట్ల (ఎక్స్ షోరూమ్) ఖరీదైన రోల్స్ రాయిస్ కల్లినాన్ బ్లాక్ బ్యాడ్జ్ కారులో కనిపించింది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ కారుని ముఖేష్ అంబానీ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారు 6.75 లీటర్ ట్విన్ టర్బో వి12 ఇంజిన్ కలిగి 600 Bhp పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
పూజ హెగ్డే ల్యాండ్ రోవర్ (Pooja Hegde Land Rover)
ఒక లైలా కోసం సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన పూజ హెగ్డే.. ఆ తరువాత ముకుంద, మహర్షి, అల వైకుంఠపురంలో వంటి సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్శించింది. ప్రస్తుతం టాలీవుడ్ రంగంలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినీ రంగంలో కూడా తనదైన రీతిలో దూసుకెళ్తున్న ఈ అమ్మడు ఇటీవల రూ. 4 కోట్లు ఖరీదైన ‘ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్’ (Land Rover Range Rover) కొనుగోలు చేసింది.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది. పూజ హెగ్డే ఏ ఇంజిన్ ఆప్షన్ కారును కొనుగోలు చేసిందో తెలియదు, కానీ 3.0 లీటర్ పెట్రోల్ వెర్షన్ మరియు 3.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ యూనిట్. ఈ రెండు ఇంజిన్లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి.