Five Exercises For Good Health: ఉరుకులు పరుగులతో సాగుతున్న జీవితాల్లో.. ఆరోగ్యం గురించి పెట్టించుకోవడానికి కూడా సమయం లేకుండా పోయింది. జీవితం ఓ పరుగు పందెం మాదిరిగా సాగుతున్న సమయంలో.. ఆరోగ్యంపైన శ్రద్ద తీసుకోవడం చాలా ముఖ్యం. 24 గంటల్లో.. కనీసం రోజుకు ఒక గంట సేపు అయినా వ్యాయామం చేయడం తప్పనిసరి. లేకుంటే.. లెక్కకు మించిన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కథనంలో.. ప్రతి ఒక్కరూ.. ప్రతి రోజూ చేయాల్సిన ఐదు వ్యాయామాల గురించి తెలుసుకుందాం.
వ్యాయామాల గురించి తెలుసుకోవడానికి ముందు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు?, ఎందుకు ఏర్పాటైంది అనే విషయాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 1948 ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ఏర్పాటైంది. దీని గుర్తుగానే ఆ రోజును ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. డబ్ల్యుహెచ్ఓ ఏర్పడటానికి ప్రధాన ఉద్దేశ్యం.. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడమే.
ఐదు వ్యాయామాలు
1. ఎక్స్‌సర్‌సైజ్
ప్రతి రోజూ ఎక్స్‌సర్‌సైజ్ చేయడం వల్ల సరైన సమయానికి ఆకలి వేస్తుంది. నిద్రలేమి సమస్యలు కూడా దూరమవుతాయి. గుండెకు సంబంధించిన రోగాలు కూడా తగ్గుతాయని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. డిఫ్రెషన్, డయాబెటిస్ వంటి రోగాలు కూడా దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. శరీరం ఆరోగ్యాంగా ఉండాలంటే తప్పనిసరిగా ఎక్స్‌సర్‌సైజ్ అవసరం అని అందరూ ముక్తకంఠంతో చెబుతారు.
2. ఏరోబిక్
హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం.. రోజు ఏరోబిక్ చేయడం వల్ల కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల.. శరీరం మరింత ధృడంగా మారుతుందని కూడా తెలుస్తోంది. ఏరోబిక్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా తొలగిపోతాయి. బీపీ తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ ముప్పు కూడా తగ్గుతుంది. ఎక్స్‌సర్‌సైజ్ వల్ల బాడీ స్టామినా పెరుగుతుంది.
3. కార్డియో ఎక్స్‌సర్‌సైజ్
శరీరంలో గుండె చాలా ప్రధానం. కాబట్టి గుండె పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి రోజూ కార్డియో ఎక్స్‌సర్‌సైజ్ చేయాల్సిందే. ఈ ఎక్స్‌సర్‌సైజ్ చేయడం వల్ల.. గుండె మాత్రమే కాకుండా ఊపిరితిత్తులు కూడా చాలా యాక్టివ్‌గా పనిచేస్తాయి. తద్వారా.. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. జాగింగ్, సైక్లింగ్ మరియు స్విమ్మింగ్ వంటివి చేయడం వల్ల కూడా గుండె ఆరోగ్యం పెరుగుతుంది.
కార్డియా ఎక్స్‌సర్‌సైజ్ చేయాలకునేవారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ఎక్స్‌సర్‌సైజ్ చేసేముందు డాక్టర్లు లేదా ఆరోగ్య నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇష్టమొచ్చినట్లు ఎక్స్‌సర్‌సైజ్ చేస్తే.. గుండెకే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనిని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి.
మెడిటేషన్ (ధ్యానం)
ధ్యానం వాళ్ళ శరీరాన్ని మొత్తం నీ అధీనంలో ఉందుకోవచ్చు. ఇది నేను చెప్పిన మాట కాదు. ఎంతోమంది మునులు, ఋషులు చేసి చూపించారు. గ్రంధాలు కూడా ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయి. మెడిటేషన్ వల్ల ఒత్తిడి నుంచి బయటపడతారు, ప్రతికూల ఆలోచనలు కూడా తగ్గుతాయి. మనిషి ప్రశాంతంగా గడపడానికి ఉన్న ఉత్తమమైన మార్గం ధ్యానమే.
Also Read: ఎండాకాలంలో అందమైన ముఖం కోసం.. అద్భుతమైన టిప్స్: మొటిమలు సైతం మాయం!
ధ్యానం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒక వ్యక్తి తన వయసు ఎన్ని సంవత్సరాలో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే తప్పకుండా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ధ్యానం కూడా వివిధ రకాలుగా చేయవచ్చు. పద్మాసనంలో ధ్యానం చేయవచ్చు, సుఖాసనంలో ధ్యానం చేయవచ్చు. చిన్ ముద్ర, ధ్యాన ముద్ర వంటివి కూడా ఉన్నాయి. అయితే ఎలా చేసెనా ధ్యానం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయనేది సత్యం.
నడక (వాకింగ్)
ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం వంటివి కష్టమైన వారికి సులభమైన మార్గం వాకింగ్. నడిస్తే కూడా ఆరోగ్యంగా ఉంటామని చాలామందికి తెలిసినా.. పట్టించుకోని పరిస్థితిలో మనం ఉన్నామనే కొందరు ఒప్పుకోలేని నిజం. ఉదయం పూత జాగింగ్ చేస్తే.. రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు. రోజు ఒక గంటసేపు నడవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కూడా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి కూడా వాకింగ్ ఉత్తమ మార్గం.
గమనించండి: వ్యాయామం చేయడం మంచిదే. అయితే.. కొంతమంది ఆరోగ్య సమస్యల దృష్ట్యా తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. కాబట్టి ఏదైనా ఎక్స్‌సర్‌సైజ్ చేసేటప్పుడు.. ఆరోగ్య నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. లేకుంటే.. ఏదైనా సమస్యలు ఎదురవుతాయి. పాఠకులు గుర్తుంచుకోవాలి.