ఫోర్డ్ మస్టాంగ్ కొత్త ఎడిషన్.. కేవలం 1965 మందికి మాత్రమే – ఎందుకో తెలుసా?

Ford Mustang Celebrates 60th Anniversary Edition Revealed: భారతదేశంలో మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఫోర్డ్’ (Ford) కంపెనీ యొక్క ‘మస్టాంగ్’ కారు గురించి అందరికి తెలుసు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరి హృదయాలను దోచుకున్న ఈ కారు ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఫోర్డ్ మస్టాంగ్ మార్కెట్లో 60 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ దీనిని కొత్తగా 60వ యానివెర్సరీ పేరుతో ఆవిష్కరించింది. కంపెనీ ఆవిష్కరించిన ‘ఫోర్డ్ మస్టాంగ్ 60వ యానివెర్సరీ ఎడిషన్’ (Ford Mustang 60th Anniversary Edition) చాలా అద్భుతంగా ఉంటుంది.

1965 యూనిట్లు మాత్రమే..

కొత్త ఫోర్డ్ మస్టాంగ్ 60వ యానివెర్సరీ ఎడిషన్ రెట్రో డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. కంపెనీ ఈ ఎడిషన్‌ను కేవలం 1965 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే (1965) కంపెనీ ఈ కారు ఉత్పత్తిని ప్రారంభించింది. దీనికి నిదర్శనంగానే అన్ని యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంతే ఈ కొత్త కారును కేవలం 1965 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి అర్హులు.

కలర్ ఆప్షన్స్ (Colour Options)

కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు అమ్మకాలు ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమవుతాయి. ఫోర్డ్ మస్టాంగ్ యానివెర్సరీ ఎడిషన్ ఆధునిక కాస్మొటిక్ డిజైన్స్ పొందుతుంది. ఇందులో ప్రధానంగా గుర్తించదగినది 20 ఇంచెస్ ముదురు బూడిదరంగు అల్లాయ్ వీల్స్‌. ఫ్రంట్ పెండర్ మీద బ్యాడ్జ్‌లు, బూట్ మీద GT బ్యాడ్జ్ 60, ఇయర్స్ బ్యాడ్జ్ వంటి వాటిని చూడవచ్చు.

డిజైన్ మరియు ఫీచర్స్ (Design and Features)

ఫోర్డ్ మస్టాంగ్ 60వ యానివెర్సరీ ఎడిషన్ (Ford Mustang 60th Anniversary Edition) హెడ్‌ల్యాంప్‌ల కోసం స్మోక్డ్ అవుట్ ఎఫెక్ట్ మరియు గ్రిల్ కోసం కొన్ని కాంట్రాస్టింగ్ సిల్వర్ యాక్సెంట్‌లతో కొత్త రిట్రో మెష్ డిజైన్ పొందుతాయి. వింగ్ మిర్రర్స్ క్యాప్స్ సిల్వర్‌తో పూర్తి చేయబడి ఉండటం చూడవచ్చు. ఈ యానివెర్సరీ ఎడిషన్ మూడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. అవి తెలుపు, రేస్ రెడ్ లేదా వేపర్ బ్లూ మరియు రెడ్ లేదా సిల్వర్ కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లోపలి డ్యాష్‌బోర్డ్‌పై 60వ యానివెర్సరీ అని ఉండటం చూడవచ్చు. అపోల్స్ట్రే గ్రే, బ్లాక్ లేదా రెడ్ కలర్ ఆప్షన్స్ పొందుతుంది. అంతే కాకుండా డ్రైవర్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇంజిన్ (Engine)

ఫోర్డ్ మస్టాంగ్ యానివెర్సరీ ఎడిషన్ 5.0 లీటర్ కొయెట్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 480 హార్స్ పవర్ మరియు 560 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. పనితీరు పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఇది కన్వర్టిబుల్ మరియు కూపే అనే రెండు వెర్షన్లలో లభిస్తుంది.

నిజానికి ఫోర్డ్ (Ford) కంపెనీ ఇప్పటికే భారతదేశంలో తన ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. అయితే రాబోయే రోజుల్లో కొన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టి.. మళ్ళీ దేశీయ చేయడానికి సన్నద్ధమవుతోంది. బహుశా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి ఫోర్డ్ మళ్ళీ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎప్పుడు దేశీయ మార్కెట్లో ప్రవేశిస్తుంది? ఏ కారును మొదట ప్రవేశపెట్టనుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Don’t Miss: 19 ఏళ్లలో సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తి.. అక్షరాలా ఎన్ని వాహనాలంటే?

ఒకప్పుడు భారతీయ మార్కెట్లో అత్యద్భుతమైన అమ్మకాలు పొందిన అమెరికన్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కాలక్రమంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమైంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ కూడా ప్రవేశపెట్టలేకపోయింది. దీంతో కంపెనీ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోయింది. క్రమంగా కంపెనీ యొక్క అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఇక చేసేదేమి లేక దేశీయ విఫణిలో ఉత్పత్తిని నిలిపివేయడానికి సంకల్పించింది. ఇందులో భాగంగానే ఫోర్డ్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.