Game Changer Actress Kiara Advani Car Collection: ‘భరత్ అనే నేను’ సినిమాలో తెలుసు చిత్ర సీమకు పరిచయమైన ‘కియారా అద్వానీ’ (Kiara Advani) ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తోంది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈ అమ్మడు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. సినిమాల్లో నటించడమే కాకుండా ఈమెకు ఖరీదైన కార్లపై కూడా మక్కువ ఎక్కువే. ఈ కారణంగానే ఈమె ఖరీదైన అన్యదేశ్య కార్లను ఉపయోగిస్తోంది.
కియారా అద్వానీ ఉపయోగించే కార్లు
ఆడి ఏ8ఎల్
నటి కియారా అద్వానీ ఉపయోగించే కార్లలో చెప్పుకోదగ్గ మోడల్ ఆడి కంపెనీకి చెందిన ఏ8ఎల్ (Audi A8L). ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 1.34 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారు 2995 సీసీ ఇంజిన్ కలిగి 500 Nm టార్క్, 344 Bhp పవర్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారు 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 270 కిమీ కావడం గమనార్హం.
మంచి డిజైన్ కలిగిన ఈ కారు హీట్ ఫంక్షనాలిటీ, యాంబియంట్ లైటింగ్, కూల్ బాక్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంమ్ సిస్టమ్ సిస్టం, డ్రైవర్ ఇన్ఫర్మేషన్స్ డిస్‌ప్లే, ఏసీ వెంట్స్, క్లైమేట్ కంట్రోల్స్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
మెర్సిడెస్ బెంజ్ ఈ220డీ
కియారా అద్వానీ గ్యారేజిలోని మరో కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ‘ఈ220డీ’ (Mercedes Benz E220D). రూ. 71.79 లక్షల ఖరీదైన ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 1993 సీసీ ఇంజిన్ 3800 rpm వద్ద 192 Bhp పవర్ మరియు 1600 rpm వద్ద 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 7.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 240 కిమీ.
బీఎండబ్ల్యూ ఎక్స్5
కియారా అద్వానీ ఉపయోగించే కార్లలో మరో ఖరీదైన కారు ‘బీఎండబ్ల్యూ ఎక్స్5’ (BMW X5). దీని ధర రూ. 77.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 2993 సీసీ డీజిల్ ఇంజిన్ మరియు 2998 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 282 Bhp పవర్, 520 Nm టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 375 Bhp పవర్ మరియు 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
బీఎండబ్ల్యూ 530డీ
జర్మన్ బ్రాండ్ కంపెనీ అయిన బీఎండబ్ల్యూ యొక్క మరో కారు 530డీ కూడా కియారా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 74.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 4000 rpm వద్ద 261 Bhp పవర్, 2000 rpm వద్ద 620 Nm టార్క్ అందిస్తుంది. భారతదేశంలోని చాలామంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఇది మంచి డిజైన్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
సాధారణ ప్రజల మాదిరిగానే సెలబ్రిటీలకు కూడా కార్లు, బైకులపైన మక్కువ ఎక్కువ. అయితే సాధారణ ప్రజల మాదిరిగా కాకుండా వీరు కొంత ఖరీదైన మరియు విలాసవంతమైన వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. ఇందులో ఆడి, బెంజ్, బీఎండబ్ల్యూ వంటివి మాత్రమే కాకుండా రోల్స్ రాయిస్, బెంట్లీ, మసెరటి వంటి మరెన్నో అన్యదేశ్య బ్రాండ్స్ ఉన్నాయి. వీటిని సాధారణ ప్రజల కంటే కూడా సెలబ్రిటీలే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం వీటి ధర భారీగా ఉండటమే అని తెలుస్తోంది.
Don’t Miss: ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ వాడిన కారు ఇదే.. దీని గురించి తెలుసా?
ఇటీవల కాలంలో చాలామంది సినీ నటులు, బుల్లితెర నటులు కూడా వారిని రేంజ్‌కు తగ్గట్టుగా కార్లను కొనుగోలు చేశారు. అయితే రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన కార్లు తెలుసు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ మాత్రమే కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. లంబోర్ఘిని కార్లు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ మొదలైనవారు కలిగి వున్నారు.