నటి ‘త్రిష’ గ్యారేజిలో ఇన్ని కార్లు ఉన్నాయా?.. అన్నీ లగ్జరీ బ్రాండ్స్ గురూ!

Famous Actress Trisha Krishnan Car Collection: తెలుగు చిత్ర సీమలో.. అగ్ర కథానాయకిల (హీరోయిన్) జాబితాలో పరిచయమే అవసరం లేని పేర్లలో ఒకటి నటి ‘త్రిష’ (త్రిష కృష్ణన్). అటు తెలుగు, ఇటు తమిళ భాషల సినిమాల్లో నటిస్తూ తనదైన రీతిలో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ‘వర్షం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత బుజ్జిగాడు, స్టాలిన్ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు తాజాగా విడుదలైన.. నటుడు విజయ్ నటించిన గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమాలో కూడా త్రిష ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు.

సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. నటి త్రిషకు లగ్జరీ కార్లను వినియోగించడం పట్ల కూడా ఎక్కువ మక్కువ ఉంది. ఈ కారణంగానే ఈమె మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, రేంజ్ రోవర్ ఎవోక్ మరియు బీఎండబ్ల్యూ రీగల్ వంటి కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం.

బీఎండబ్ల్యూ ఎస్ క్లాస్ (BMW S Class)

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ (BMW)కు చెందిన ‘ఎస్ క్లాస్’ కారు నటి త్రిష గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 1.77 కోట్ల నుంచి రూ. 1.88 కోట్ల మధ్య ఉంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది.

నిజానికి ఈ కారు 350 డీ మరియు 450 4 మ్యాటిక్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని 2925 డీజిల్ ఇంజిన్ 282 Bhp పవర్, 500 Nm టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిమీ. ఇది 6.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది. ఇందులో ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

బీఎండబ్ల్యూ 5 సిరీస్ (BMW 5 Series)

నటి త్రిష కృష్ణన్ గ్యారేజిలోని మరి జర్మన్ బ్రాండ్ కారు బీఎండబ్ల్యూ 5 సిరీస్. ఈ మోడల్ ధర దేశీయ విఫణిలో రూ. 72.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). త్రిష వద్ద ఉన్న ఈ బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు నలుపు రంగులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువమంది ఇష్టపడే రంగులలో ఇది ఒకటి. ఈ రంగు అంటే త్రిషకు చాలా ఇష్టం. ఈ కారణంగానే ఈ కలర్ కారును కొనుగోలు చేసి ఉండొచ్చని భావిస్తున్నాము.

చోట చక్కని డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు 1998 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 255 బ్రేక్ హార్స్ పవర్ (Bhp) మరియు 400 న్యూటన్ మీటర్ (Nm) టార్క్ అందిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 6.5 సెకన్లలో గంటకు 0 – 100 కిమీ వేగవంతం అవుతుంది. డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా ఈ లగ్జరీ కారు అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది.

రేంజ్ రోవర్ ఎవోక్ (Range Rover Evoque)

ఎక్కువ మంది సెలబ్రిటీలకు ఇష్టమైన మరియు ఖరీదైన కార్ల జాబితాలో ఒకటి రేంజ్ రోవర్ ఎవోక్. దీని ధర సుమారు రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఈ కారు నటి త్రిష గ్యారేజిలో కూడా ఉన్నట్లు సమాచారం. ఇది సాధారణంగా రోడ్డు ప్రయాణానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడింగ్ కారుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ కారణంగానే చాలా మంది ప్రముఖులు ఈ కారును ఎగబడిమరీ కొనుగోలు చేస్తుంటారు.

రేంజ్ రోవర్ ఎవోక్ 1997 సీసీ పెట్రోల్ మరియు 1998 సీసీ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందింది. త్రిష కొనుగోలు చేసిన మోడల్ ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉంది అనేది స్పష్టంగా తెలియడం లేదు. పెట్రోల్ ఇంజిన్ 201 Bhp, 365 Nm టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 247 Bhp పవర్, 430 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Don’t Miss: ఇప్పటికే 5000 మంది కొనేశారు!.. మైలేజ్ చూస్తే మీరూ కొనేస్తారు
బీఎండబ్ల్యూ రీగల్ (BMW Regal)

నటి త్రిష గ్యారేజిలోని మరో బీఎండబ్ల్యూ కారు రీగల్. బహుశా ఈ మోడల్ గురించి చాలా మందికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఇది మార్కెట్లో పాపులర్ మోడల్. ఈ కారు కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా మరియు ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొత్త డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు అత్యుత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. బీఎండబ్ల్యూ రీగల్ కారు ధర కూడా ఎక్కువనే తెలుస్తోంది.