Gold and Silver Price Today in India: బ్రేకుల్లేని బైకు మాదిరిగా.. బంగారం (Gold) ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే గోల్డ్ రేటు లక్షకు చేరుకుంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏప్రిల్ నెల ప్రారంభంలో కూడా పసిడి ధర గరిష్టంగా రూ. 930 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు ఏకంగా రూ. 92000 (10 గ్రా) దాటేసింది. నేడు హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు మరియు ఢిల్లీ, చెన్నైలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
22 క్యారెట్ గోల్డ్ రేటు తెలంగాణ (హైదరాబాద్)లో రూ. 85100 (10 గ్రా). విజయవాడ, ముంబై, బెంగళూరు మరియు చెన్నైలలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి రేటు రూ. 85100 దగ్గరే ఉంది. ఢిల్లీలో మాత్రం రూ. 85250 వద్దకు చేరింది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు రూ. 850 (22 క్యారెట్స్ 10 గ్రా) ఎక్కువ.
24 క్యారెట్స్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో మాత్రమే కాకుండా ముంబై, బెంగళూరు, చెన్నై వంటి దేశంలోని ప్రధాన నగరాల్లో రూ. 92840 (10 గ్రా) వద్ద ఉంది. ఢిల్లీలో మాత్రమే ఈ ధర రూ. 92990 (10 గ్రా) వద్ద ఉంది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 930 (10 గ్రా) ఎక్కువ.
నిజానికి గత ఏడు రోజుల నుంచి బంగారం ధరలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. మార్చి 26 నుంచి ఏప్రిల్ 1 వరకు 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు ఏకంగా 3200 రూపాయలు దాటేసింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 3400 దాటేసింది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే.. గోల్డ్ రేటు రూ. లక్షకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టదు. ఇది పసిడి ప్రియులకు పెద్ద షాకింగ్ అనే చెప్పాలి.
బంగారం ధరలు పెరగడానికి కారణం
ఓ వైపు ఉగాది.. మరోవైపు రంజాన్ ఇలా పండుగలు రావడం, ఇంకోవైపు పసిడి ప్రియులు ఎక్కువ గోల్డ్ కొనుగోలు చేయడం కూడా కారణమవుతోంది. ఇది మాత్రమే కాకుండా అమెరికా విధిస్తున్న సుంకాల కారణంగా గోల్డ్ రేటుకు రెక్కలొచ్చినట్టయింది. పెట్టుబడిదారులు గోల్డ్ మీదనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం కూడా బంగారం ధరలు పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
Also Read: సామాన్యులకు దూరమవుతున్న బంగారం!.. ఎందుకంటే?
వెండి ధరలు ఇలా..
అన్నబాటలో పయనిస్తున్న తమ్ముడు అన్న చందాన.. బంగారం బాటలోనే వెండి (Silver Price) అడుగులు వేస్తోంది. కేజీ వెండి రేటు ఈ రోజు రూ. 114000 వద్దకు చేరింది. ఇదే ధరలు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు మరియు చెన్నై ప్రాంతాల్లో ఉన్నాయి. దేశ రాజధానిలో మాత్రమే వెండి ధర ఇతర ప్రముఖ నగరాల కంటే కొంత తక్కువే అని తెలుస్తోంది. ఢిల్లీలో కూడా వెండి ధర రూ. 1000 పెరిగినప్పటికీ.. కేజీ వెండి రేటు రూ. 105000 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీలో కేజీ వెండి ధర ఇతర ప్రాంతలలో కంటే రూ. 9000 తక్కువ. బంగారం ధర మాత్రం ఢిల్లీలో కొంత ఎక్కువే అని తెలుస్తోంది.