27.2 C
Hyderabad
Thursday, March 20, 2025

భయపెడుతున్న బంగారం ధరలు: అమాంతం పెరిగిన గోల్డ్ రేటు

Gold and Silver Price in India Today March 19th: భారతదేశంలో బంగారం ధరలు చాపకింద నీరులా విస్తరిస్తూ.. నేటికీ (మార్చి 19) రూ. 90,000 దాటేసాయి. పరిస్థితులు చూస్తుంటే.. గోల్డ్ రేటు లక్ష రూపాయలకు చేరుకోవడానికి మరెంతో దూరం లేదని స్పష్టమవుతోంది. ఈ రోజు కూడా పసిడి ధరలు పెరుగుదల దిశగా అడుగులకు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ మరియు ముంబై నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ (హైదరాబాద్), అమరావతి (విజయవాడ) ప్రాంతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,900 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 90,440 వద్దకు చేరింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న గోల్డ్ రేటు వరుసగా రెండోరోజు పెరుగుదలను చవి చూసింది.

చెన్నై నగరంలో మాత్రమే కాకుండా ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఈ ప్రాంతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 400 పెరిగి.. రూ. 82900లకు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 440 పెరిగింది. దీంతో ప్యూర్ గోల్డ్ రేటు రూ. 90440కు చేరింది. 2024 డిసెంబర్ ధరలతో పోలిస్తే.. ప్రస్తుత ధరలు చాలా ఎక్కువని స్పష్టంగా అర్థమవుతోంది.

ఇక చివరగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 83050 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 90590 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400 మరియు రూ. 440 ఎక్కువ.

బంగారం ధరలు పెరగడానికి కారణం

నిజానికి బంగారం ధరలు 2024లో కంటే 2025లో భారీగా పెరిగాయి. దీనికి కారణం అమెరికా సుంకాల ప్రభావం కావొచ్చు. ఎక్కువ మంది బంగారం మీద పెట్టుబడి పెట్టడం కావచ్చు. ఏదైతే ఏం.. గోల్డ్ రేటు మాత్రం జీవితకాల గరిష్టాలను తాకింది. భారతదేశంలో డిమాండుకు తగిన సరఫరా లేకపోవడం కూడా గోల్డ్ రేటు పెరగడానికి ఓ ప్రధాన కారణం అని తెలుస్తోంది.

Also Read: సామాన్యులకు దూరమవుతున్న బంగారం!: భారీగా పెరిగిన గోల్డ్ రేటు

ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో బంగారం కొనేవారి సంఖ్య చాలా ఎక్కువ. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, పేరంటాలు, సీమంతాలు.. ఇతరత్రా శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే.. బంగారం కొనుగోలు మరింత పెరిగిపోతుంది. ఇలాంటి కారణాల వల్ల బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇంకా పెరిగే సూచనలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

బంగారం మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. 2024 చివరలో రూ. లక్ష రూపాయలను తాకిన వెండి.. ప్రస్తుతం రూ. 1,05,000లకు (కేజీ ధర) చేరింది. అంటే ఒక గ్రాము వెండి ధర 105 రూపాయలని స్పష్టంగా తెలుస్తోంది. బంగారం ధరలు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నప్పటికీ.. వెండి మాత్రం కొంత తక్కువే అని తెలుస్తోంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు