Daily Horoscope in Telugu 12th April 2025 Saturday: పాఠకులకు ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. శనివారం (12 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:00 నుంచి 7:36 వరకు.
మేషం
చేపట్టిన వ్యవహారాలు విజయవంతమవుతాయి. అవసరానికి కావలసిన ధనం అందుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యా సంబంధ విషయాల్లో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది.
వృషభం
ఇంటాబయట అనుకూల వాతావరణం, ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. నిరుద్యోగులకు శుభయోగం, ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
మిథునం
దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు, ఆర్ధిక పరిస్థితి కొంత దిగజారుతోంది. సన్నిహితులతో చిన్న చిన్న వివాదాలు. కీలక విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు ఉన్నాయి. ఖర్చుల విషయంలో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కర్కాటకం
ఉద్యోగ, వ్యాపారంలో సమస్యలు అధికమవుతాయి. శ్రమకు తగిన ఫలితం శూన్యం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యం కోల్పోకూడదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
సింహం
ఈ రాశివారికి అనుకూల వాతావరణం నడుస్తోంది. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆధాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
కన్య
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిసారిస్తారు.
తుల
కీలక వ్యవహారాలు అనుకున్న విధంగా ముందుకుసాగవు. ఆర్ధిక సమస్యలు వెంటాడుతాయి. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఋణప్రయత్నాలు అంతగా కలిసి రావు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో స్వల్ప లాభాలు ఉన్నాయి. దైవ చింతన పెరుగుతుంది.
వృశ్చికం
ముఖ్యమైన పనులలో శ్రమ అధికమవుతుంది, కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సన్నిహితులతో వివాదాలు, కుటుంబంలో గందరగోళ వాతావరణం. ఉద్యోగులకు అదనపు పనిభారం పెరుగుతుంది. కొత్తవారిని గుడ్డిగా నమ్మకూడదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ధనుస్సు
ఆర్ధిక సమస్యలు తీరిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో కూడా ఊహకందని పురోగతి కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో శ్రమ అధికమవుతుంది. దీర్ఘకాలిక ఋణ సమస్యలు తొలగిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
మకరం
ఇంటాబయట ప్రతికూల ప్రభావం. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అలోచించి తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తును కాపాడతాయి.
కుంభం
సంఘంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు శుభయోగం, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఋణబాధలు తీరిపోతాయి. దైవ చింతన పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మీనం
కొందరి ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన రీతిలో ఉండవు. ఉద్యోగం విషయంలో పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశను కలిగిస్తుంది.
గమనించండి: గ్రహాల స్థితిగతుల ఆధారంగా.. రాశిఫలాలు నిర్ణయించబడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలే ఉంటాయని చెప్పడం అసాధ్యమే. కాబట్టి రాశిఫలాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. హనుమాన్ ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం.