Health Benefits Of Drinking Water From Earthen Pots in Summer: అసలే ఎండాకాలం.. కాలు బయటపెడితే చెమట ధారలుగా కారిపోతుంది. ఇంట్లో కాసిన్ని చల్లని నీళ్లు తాగితేగానీ మనసు కుదుటపడదు. చల్లని నీరు కావాలంటే.. అందరికీ గుర్తొచ్చేది ఫ్రిజ్ నీరే. ఈ ఫ్రిజ్ నీరు అప్పటికి బాగానే ఉన్నప్పటికీ.. తరువాత సమస్యలను తెస్తుంది. అలా అని చల్లని నీరు తాగకుండా ఉండలేము. దానికి చక్కని పరిష్కారమే కుండ నీరు. నిజంగా కుండా నీరు తాగితే ఆ సంతృప్తే వేరు. జీర్ణక్రియ మాత్రమే కాకుండా.. జీవనక్రియ కూడా మెరుగుపడుతుంది. కుండ నీటి వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
సహజ చల్లదనం
మట్టికుండ స్వభావమే చల్లబరచడం. ఎందుకంటే అందులోని రంధ్రాలు నీటిని చల్లబరుస్తాయి. బాష్పీభవన శీతలీకరణ అనే ప్రక్రియ ద్వారా కుండలోని నీరు చల్లగా మారుతాయి. దీనివల్ల నీటికి ఓ మంచి రుచి కూడా వస్తుంది. రుచి అంటే.. ప్రిజ్ నీటికి.. కుండలోని నీటికి తేడా తెలుస్తుందన్న మాట. వాతావరణంలోని ఉష్ణోగ్రతను తగిన విధంగా కుండలోనో నీరు స్వచ్ఛమవుతుంది.
సరికొత్త రుచి
ఎక్కడైనా నీటికి రుచి ఉంటుందా? అనే అనుమానం మీకు రావొచ్చు. కానీ ప్లాస్టిక్, ఇతర మెటల్‌లో ఉంచినీ నీటిని తాగేటప్పుడు మీరు పొందే అనుభూతి, కుండలోని నీరు తాగేటప్పుడు పొందే అనుభూతి వేరుగా ఉంటుంది. ఎంతసేపూ ప్రిజ్ నీటిని మాత్రమే తాగకుండా ఒక్కసారైనా కుండలోని నీరు తాగితే దాని రుచి ఎలా ఉంటుంది మీకే అర్థమైపోతుంది.
కెమికల్ ఫ్రీ
ప్లాస్టివ్ బాటిల్స్ లేదా ఇతర మెటల్‌లో నీటిని నింపి.. వాటిని తాగితే అందులో తప్పకుండా కొంత శాతం రసాయనాలు విడుదలయ్యే ఉంటాయి. మట్టి కుండ దీనికి పూర్తిగా విరుద్ధం. నీటిలోని మలినాలను కూడా కుండ పీల్చుకుని, మీకు స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. కెమికల్స్ ఉన్న నీరు తాగితే.. ఆరోగ్యం చెడిపోతుంది. మట్టికుండ మీ ఆరోగ్యానికి కొండంత అండగా నిలుస్తుంది.
పీహెచ్ బ్యాలెన్స్
నీటిలో కూడా పీహెచ్ లెవెల్స్ సరిగ్గా ఉండాలి. లేకుంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కుండను బంకమట్టితో చేస్తారు. బంకమట్టికి సహజంగానే క్షార స్వభావం ఉంటుంది. కాబట్టి మట్టి కుండలో నీటిని నింపినప్పుడు.. మట్టిలోని ఖనిజాలతో సంకలనం జరిగి.. పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. దీని ద్వారా మెరుగైన జీర్ణక్రియ సాధ్యమవుతుంది.
Also Read: సమ్మర్‌లో పెసలు.. ఆరోగ్యానికి ఎంతో స్పెషల్: ఎలా తినాలంటే?
పర్యావరణ హితం
మట్టికుండ పర్యావణహితం. ప్లాస్టిక్, మెటల్ వంటివి పర్యావరణానికి హాని చేస్తాయి. ప్లాస్టిక్ వంటివి మట్టిలో కలిసిపోవడానికి సంవత్సరాల సమయం పడుతుంది. అయితే మట్టికుండ బయోడిగ్రేడబుల్. కాబట్టి ఇది చాలా వేగంగా మట్టిలో కలిసిపోతుంది. ఇంకో విషయం ఏమిటంటే మట్టికుండలు ఎక్కువగా ఉపయోగించడం వద్ద.. మనం చేతి వృత్తుల వారికి కూడా ఆర్థికంగా సహాయం చేసినట్లు అవుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
నిజం చెప్పాలంటే.. మట్టికుండలో నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బంకమట్టిలోని ఖనిజ లవణాలు జీర్ణక్రియ సజావుగా జరిగడానికి ఉపయోగపడే పోషకాలను నీటిలోకి పంపుతుంది. శరీరంలోని ఆమ్ల గుణాన్ని కూడా తగ్గిస్తుంది. ఉబ్బరం వంటి సమస్యలను కూడా మట్టికుండలోని నీరు తాగేతే తగ్గుతుందని పెద్దవారు చెబుతారు.
గమనించండి: నీటి కుండలోని నీరు తాగడం మంచిదే. కానీ కొంతమంది ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బహుశా కుండ నీరు వారికి పడకపోవువచ్చు. ప్రతికూల ప్రభావం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే అని గమనించండి.