Hero Splendor Plus XTEC 2.0 Launched In India: భారతదేశంలో లక్షల విలువైన బైకులు విడుదలవుతున్న సమయంలో లక్ష రూపాయలకంటే తక్కువ ధరలో ‘హీరో మోటోకార్ప్’ (Hero MotoCorp) ఓ అద్భుతమైన బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కొత్త బైక్ ధర ఎంత? డిజైన్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.
ధర
దేశీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన బైక్ ‘స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0’ (Splendor+ XTECH 2.0). దీని ధర రూ. 82911 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఎవర్‌గ్రీన్ కమ్యూటర్ యొక్క 30వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బైకును లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత ప్రత్యేకంగా కనిపిస్తుంది.
కలర్ ఆప్షన్స్
ఇండియన్ మార్కెట్లో హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 బైక్.. మాట్ గ్రే అనే రంగులో మాత్రమే కాకుండా గ్లోస్ బ్లాక్ మరియు గ్లోస్ రెడ్ అనే డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో కూడా లభిస్తుంది. కాబట్టి ఈ బైకులో అక్కడక్కడా రెడ్ కలర్ గ్రాఫిక్స్ చూడవచ్చు. ఇది చూడటానికి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది తప్పకుండా వాహన వినియోదాగదారులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.
డిజైన్
కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్, రివైజ్డ్ గ్రాఫిక్స్ వంటివి పొందుతుంది. సైడ్ హుక్స్, ట్యూబ్యులర్ గ్రాబ్ రైల్ మరియు చిన్న టెయిల్ ర్యాక్ వంటివి కూడా ఉన్నాయి. క్రోమ్‌తో ఫినిష్ చేయబడిన ఇంజిన్ క్రాష్ గార్డ్ కూడా ఇక్కడ చూడవచ్చు. మొత్తం మీద ఈ బైక్ డిజైన్ చాలా వరకు సింపుల్‌గా ఉండటం చూడవచ్చు. డిజైన్ పరంగా పెద్దగా అప్డేట్స్ లేదని తెలుస్తోంది.
ఫీచర్స్
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 బైక్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ కన్సోల్ పొందుతుంది. దీని ద్వారా కాల్స్ మరియు ఎస్ఎమ్ఎస్ అలర్ట్ నోటిఫికెషన్స్ వంటివాటిని పొందవచ్చు. ఈ బైకులో USB ఛార్జర్ కూడా ఉంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ లేటెస్ట్ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ పోర్క్, డ్యూయెల్ రియర్ స్ప్రింగ్ మరియు రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇంజిన్
కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 బైక్ ఎయిర్ కూల్డ్ 97.2 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 8.02 హార్స్ పవర్ మరియు 6000 rpm వద్ద 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. ఇది ఒక లీటరుకు 73 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ మైలేజ్ అందించడానికి కంపెనీ ఐ3ఎస్ స్టార్ట్ – స్టాప్ సిస్టం ఉపయోగపడుతుంది.
ప్రత్యర్థులు
లేటెస్ట్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 దాని స్టాండర్డ్ ఎక్స్‌టెక్ కంటే రూ. 3000 ఎక్కువ. ధరకు తగిన విధంగానే ఈ బైక్ కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో అద్భుతమైన అమ్మకాలు పొందుతున్న హోండా షైన్ 100 (రూ. 64900) మరియు బజాజ్ ప్లాటినా 100 (రూ. 67808) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఇది కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Don’t Miss: బ్రిటిష్ బ్రాండ్ కారుతో కనిపించిన ‘రిషబ్ పంత్’.. దీని రేటెంతో తెలిస్తే షాకవుతారు!
మంచి మైలేజ్ అందించే బైకుల కోసం ఎదురు చూస్తున్నవారికి హీరో మోటోకార్ప్ యొక్క కొత్త స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 ఉత్తమ ఎంపిక అవుతుంది. అయితే ఈ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ మరియు డెలివరీలకు సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. బహుశా ఈ బైక్ కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా అధీకృత డీలర్షిప్ వద్ద బుక్ చేసుకోవచ్చని భావిస్తున్నాము.