Honda New Logo And Previews Flagship EV Sedan: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ కార్ల తయారీ సంస్థ ‘హోండా’ (Honda) ఎప్పటికప్పుడు దేశీయ విఫణిలో ఆధునిక వాహనాలను విడుదల చేస్తోంది. ఎప్పుడూ కొత్త కార్లను లాంచ్ చేస్తున్న హోండా ఈ సారి ఏకంగా ‘లోగో’ (Logo)ను మార్చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హోండా కంపెనీ భవిష్యత్తులో లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కార్లలో కొత్త లోగోను ప్రవేశపెట్టనుంది. 1981 నుంచి ఉనికిలో ఉన్న కంపెనీ యొక్క ఐకానిక్ లోగోను ఇప్పుడు అప్డేట్ చేసింది. దీనిని చూడగానే అప్డేట్ అయినట్లు అనిపించదు, కానీ లోగోలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది.
కొత్త లోగోను చూస్తే.. మనిషి రెండు చేతులు చాచినట్లు అనిపిస్తుంది. బ్రాండ్ యొక్క ‘H’ లోగో అనేది సన్నగా సన్నగా మినిమలిస్ట్ వెర్షన్, ట్రాపెజాయిడ్ సరిహద్దును మైనస్ చేస్తుంది. ఇది 1963లో మొదట్లో వచ్చిన లోగో మాదిరిగా ఉంటుంది. ఆ తరువాత 1996లో దీన్ని ఇంకొంచెం డిజైన్ చేసి ఫిక్స్ చేశారు. అది ఇప్పుడు వస్తున్న లోగో కంటే కొంచెం సన్నగా.. పొడవుగా ఉంది.
లాస్ వేగాస్ వేదికగా జరుగుతున్న ‘సీఈఎస్ 2024’ (CES 2024) హోండా సెలూన్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. 2026 నాటికి ఈ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తి పూర్తవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు బ్రాండ్ యొక్క ఇప్పటి వరకు ఉన్న ఇతర కార్ల కంటే కూడా చాలా భిన్నంగా మరియు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారులో ఈ కొత్త లోగోను చూడవచ్చు.
హోండా కొత్త లోగో మార్కెట్లో రాబోయే రోజుల్లో ఎలివేట్ బేస్డ్ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ కారు భారతదేశంలో విడుదలవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
హోండా ఫ్లాగ్‌షిప్ ఈవీ సెడాన్ ప్రివ్యూ..
లాస్ వెగాస్‌లో జరుగుతున్న 2024 CES వేదికగా హోండా ప్రదర్శించిన కారు ‘సెలూన్’ కాన్సెప్ట్. ఈ కొత్త కాన్సెప్ట్ 0 సిరీస్‌గా పిలువబడే సరి కొత్త ఈవీ అని తెలుస్తోంది. 2026 చివరి నాటికి ఉత్పత్తి సిద్దమైనప్పటికీ.. 2025లో అమెరికాలోని హోండా ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించబడే అవకాశం ఉందని సమాచారం.
డిజైన్ (Design)
కొత్త హోండా కాన్సెప్ట్ కారు చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కారు SUV మరియు MPV అంశాలను కలిగి చూడచక్కగా ఉంటుంది. లోపలి భాగంలో హై-డెఫినిషన్ డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. అయితే లోపలి భాగంలో ఏ భాగాలు ఉండనున్నాయని రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
Don’t Miss: భారత్‌లో మహీంద్రా XUV400 EV లేటెస్ట్ మోడల్స్ లాంచ్ – ధరలు ఎలా ఉన్నాయంటే?
బ్యాటరీ (Battery)
హోండా యొక్క రాబోయే ఎలక్ట్రిక్ కారు పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంటుంది. రాబోయే ఎలక్ట్రిక్ కారు పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది కాబట్టి, ఎక్కువ రేంజ్ అందించేలా కంపెనీ ప్లాన్ చేస్తోంది. కావున రేంజ్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 483 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతే కాకుండా ఇది కేవలం 10 నుంచి 15 నిమిషాల సమయంలో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగల కెపాసిటీని కలిగి ఉండనున్నట్లు సమాచారం.
రాబోయే రోజుల్లో మార్కెట్లో విడుదలకానున్న కొత్త హోండా ఎలక్ట్రిక్ కార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నలాజి కూడా పొందనున్నట్లు సమాచారం. హోండా విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ కార్లు తప్పకుండా చాలా ఆధునికంగా ఉంటాయని తెలుస్తోంది. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి.