Honda Two Wheelers Sales 50 Lakh in Karnataka: భారతదేశంలో ప్రస్తుతం సరసమైన స్కూటర్లు, ఖరీదైన స్కూటర్లు లాంచ్ చేస్తున్న వాహన తయారీ సంస్థలు లెక్కకు మించి ఉన్నాయి. ఎన్ని కంపెనీలున్నా.. ప్రజలు మాత్రమే కొన్ని బ్రాండ్స్ మాత్రమే కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కోవకు చెందిన బ్రాండ్లలో చెప్పుకోదగ్గది ‘హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ (HMSI). ఈ కంపెనీ ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే 50 లక్షల ద్విచక్రవాహనాలను విక్రయించి.. అమ్మకాల్లోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు కూడా ఎక్కువగా హోండా టూ వీలర్స్ కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కారణంగానే కంపెనీ భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలను విక్రయించగలిగింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో హోండా బైకులకు మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.
2001 నుంచి..
జూన్ 2001లో ప్రారంభమైనప్పటి నుంచి హోండా మోటార్‌సైకిల్ కంపెనీ వాహనాలను లాంచ్ చేస్తూ, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ.. కస్టమర్లకు చేరువవుతూనే ఉంది. కన్నడ నాట హోండా యాక్టివా మరియు షైన్ వంటి టూ వీలర్ గొప్ప అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లాయి. ఒకే బ్రాండ్ వాహనాలను 50 లక్షల మంది కొనుగోలు చేసారు అంటే.. అది అనన్య సామాన్యమనే చెప్పాలి.
కంపెనీ కర్ణాటకలో గొప్ప అమ్మకాలను పొందిన సందర్భంగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ.. కంపెనీ మీద ప్రజలు ఉంచిన విశ్వాసమే 50 లక్షల వాహనాల అమ్మకాలు సాధించేలా చేసింది. ఇంత పెద్ద రికార్డ్ సొంతం చేసుకోవడానికి సహకరించిన కర్ణాటక కస్టమర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
బ్రాండ్ బైకులు
హోండా మోటార్‌సైకిల్ కంపెనీ మార్కెట్లో 125 సీసీ, 110 సీసీ విభాగాల్లో స్కూటర్లను లాంచ్ చేసి విక్రయిస్తోంది. ఇందులో హోండా డియో, యాక్టివా, షైన్, ఎస్పీ, యూనికార్న్, హార్నెట్, లివో, సీబీ350ఆర్ఎస్, హైనెస్, సీబీ300ఎఫ్, సీబీ200ఎక్స్, ఎన్ఎక్స్500 మరియు ఆఫ్రికా ట్విన్ మొదలైనవి ఉన్నాయి.
అత్యధిక అమ్మకాలు పొందిన స్కూటర్
ఒక్క కర్ణాటకలో మాత్రమే కాకుండా హోండా మోటార్‌సైకిల్ యొక్క యాక్టివా భారతదేశం మొత్తం మీద ఏకంగా మూడు కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది. అంటే దేశంలో యాక్టివా స్కూటర్ వినియోగిస్తున్న ప్రజలు 3 కోట్లకంటే ఎక్కువే అన్న మాట. రూ. 64వేల ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభిస్తున్న యాక్టివా మంచి డిజైన్ కలిగి, రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ 45 కిమీ/లీ నుంచి 50 కిమీ/లీ మధ్య మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ స్కూటర్‌ను ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.
అత్యధిక ఖరీదైన హోండా బైకులు
భారతీయ మార్కెట్లోహోండా మోటార్‌సైకిల్ సరసమైన బైకులు, స్కూటర్లను మాత్రమే కాకుండా.. రూ. 39.16 లక్షల విలువైన గోల్డ్ వింగ్ వంటి బైకులను కూడా లాంచ్ చేసింది. హోండా గోల్డ్ వింగ్ అనేది బ్రాండ్ యొక్క అత్యంత ఖరీదైన మోడల్. ధర ఎక్కువైనా ఈ బైకుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే ఈ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే అన్నీ అమ్ముడైపోతున్నాయి. ఈ బైక్ అత్యుత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది.
Don’t Miss: రూ.2.30 లక్షల డిస్కౌంట్: తక్కువ ధరలో థార్ ప్రత్యర్థిని పట్టుకెళ్లండి
త్వరలో ఎలక్ట్రిక్ టూ-వీలర్స్
ఇప్పటి వరకు ద్విచక్ర వాహన విభాగంలో గొప్ప అమ్మకాలను పొందుతున్న హోండా మోటార్‌సైకిల్ ఇండియా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన యాక్టివా స్కూటర్‌ను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. హోండా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2025లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీని ధర రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. హోండా తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేస్తే.. మార్కెట్లో మరింత గొప్ప అమ్మకాలను పొందే అవకాశం ఉంది. ఇది మార్కెట్లో తన ప్రత్యర్థులకు గట్టి పోటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది.