209 Posts in CSIR CRRI Intermediate Qualification: కౌన్సిల్ ఆఫ్ సైటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసర్చ్ – సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CRRI), ఢిల్లీ.. 209 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 వ తరగతి (ఇంటర్మీడియట్) పూర్తి చేసిన యువతీ యువకులు ఎవరైనా.. ఈ ఉద్యోగం కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎక్కడ అప్లై చేయాలి?. లాస్ట్ డేట్ ఎప్పుడు అనే వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నోటిఫికేషన్ వివరాలు & అప్లై లాస్ట్ డేట్
2025 మార్చి 20న సీఎస్ఐఆర్ సీఆర్ఆర్ఐ ఢిల్లీ.. తన అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేవారు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 2025 మార్చి 22 నుంచి ఏప్రిల్ 21 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
వయసు పరిమితి (ఏజ్ లిమిట్)
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 28ఏళ్ల లోపు, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లై చేసుకునే వారి వయసు 27ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యంగులకు పదేళ్ళు వయసు సడలింపు ఉంది.
వేతనం & ఎంపిక విధానం
రాత పరీక్ష, స్టెనోగ్రఫీ మరియు టైపింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి వేతనం రూ. 19900 నుంచి రూ. 63200 వరకు ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వేతనం రూ. 25500 నుంచి రూ. 81100 వరకు ఉంటుంది.
నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి లేదా 2025 మార్చి 22 ఉదయం 10 గంటల నుంచి 2025 ఏప్రిల్ 21 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష మే లేదా జూన్ నెలలో ఉంటుంది. ఖచ్చితమైన తేదీల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూస్తూ ఉండాలి.
Also Read: మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్: నోటిఫికేషన్ & పోస్ట్ వివరాలు
ఫీజు వివరాలు
సీఎస్ఐఆర్ సీఆర్ఆర్ఐ జాబ్స్ కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు.. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే సమయంలోనే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ లేనివారు, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్లై చేసే విధానం
➤సీఎస్ఐఆర్ సీఆర్ఆర్ఐ జాబ్స్ కోసం అప్లై చేయాలనుకునేవారు.. అధికారికం వెబ్‌సైట్ ఓపెన్ చేసి, రిక్రూట్‌మెంట్ విభాగం సెలక్ట్ చేసుకోవాలి.
➤తరువాత సీఎస్ఐఆర్ సీఆర్ఆర్ఐ జేఎస్ఏ / స్టెనోగ్రాఫర్ 2025 నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి.
➤రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన అన్ని వివరాలను ఎంటర్ చేయండి.
➤వివరాలను ఎంటర్ చేసిన తరువాత డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేయాలి.
➤ఇవన్నీ పూర్తయిన తరువాత అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
➤చివరగా మీ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. అయితే అప్లై చేసేటప్పుడు అన్ని వివరాలను జాగ్రత్తగా పూరించాలి.