Hyderabad Police to Cancel Vehicle RC in Minor Driving Cases: ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. దేశంలో రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడానికి అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక చర్యలు చేపడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆశించిన రీతిలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించలేకపోతున్నాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఓ కీలక ప్రకటన చేసింది. మైనర్ డ్రైవ్ చేస్తూ కనిపిస్తే.. ఆ వాహనం యొక్క ఆర్సీ (RC)ని 12 నెలల పాటు రద్దు చేయనున్నట్లు వెల్లడించింది.
18 ఏళ్ళు నిండితేగానీ.. డ్రైవింగ్ లైసెన్స్ లభించదు. మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదని తల్లిదండ్రులకు తెలుసు. అయినప్పటికీ.. వారిని వాహనం నడపడానికి అనుమతిస్తారు. ట్రాఫిక్ రూల్స్ కూడా తెలియని మైనర్లు.. వాళ్లకు ఇష్టమొచ్చినట్లు పబ్లిక్ రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తూ.. ప్రమాదాలు జరగడానికి కారణం అవుతున్నారు.
మైనర్ల డ్రైవింగ్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా కోకొల్లలుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ చీఫ్ ‘జోయల్ డెవిస్’ కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనర్లు వాహన డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారో?.. ఆ వెహికల్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నట్లు స్పష్టం చేశారు. దీనికోసం స్పెషల్ డ్రైవ్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
మోటార్ వెహికల్ యాక్ట్
అమలులో ఉన్న మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి అనర్హులు. డ్రైవింగ్ లైసెన్స్ పొందని వారు ప్రజా రహదారిలో.. వెహికల్ డ్రైవ్ చేయకూడదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా.. మైనర్లు విచ్చలవిడిగా వాహనాలతో రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు.
పాశ్చాత్య దేశాల్లో.. కఠినమైన మోటార్ వెహికల్ చట్టాలు అమలులో ఉన్నాయి. రూల్స్ అతిక్రమించినవారు ఎంతటివారైనా.. శిక్షార్హులు. అలంటి నియమాలను మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందనే ఉద్దేశ్యంతో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: టాక్ ఆఫ్ ద టౌన్‌గా లేడీ అఘోరి.. ఆమె వాడే కారేంటో తెలుసా?
జరిమానాలు భారీ స్థాయిలో ఉంటే, కఠినమైన చర్యలు తీసుకుంటే.. తప్పకుండా ప్రజల్లో భయం పుడుతుంది. ఆ భయంతో తప్పకుండా నియమాలను తూచ తప్పకుండా పాటిస్తారు. కాబట్టి తెలంగాణాలో మైనర్ల డ్రైవింగ్ పూర్తిగా నిర్మూలించాలి అంటే.. తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే.
రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడం కారణాలు
దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేయడం వంటి వాటితో పాటు.. సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం అని తెలుస్తోంది. ప్రస్తుతం రోడ్డు వ్యవస్థను బాగుచేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఇప్పుడు మారాల్సింది వాహనదారులే.. కాబట్టి రోడ్డుపై జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే ప్రమాదం భారి నుంచి మీరు తప్పించుకోవడం మాత్రమే కాకుండా.. ఇతరులకు కీడు తలపెట్టని వారు అవుతారు.
𝐇𝐲𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝 𝐓𝐫𝐚𝐟𝐟𝐢𝐜 𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐈𝐧𝐢𝐭𝐢𝐚𝐭𝐞𝐬 𝐂𝐚𝐧𝐜𝐞𝐥𝐥𝐚𝐭𝐢𝐨𝐧 𝐎𝐟 𝐕𝐞𝐡𝐢𝐜𝐥𝐞 𝐑𝐞𝐠𝐢𝐬𝐭𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐅𝐨𝐫 𝐓𝐡𝐞 𝐎𝐟𝐟𝐞𝐧𝐜𝐞 𝐎𝐟 𝐌𝐢𝐧𝐨𝐫 𝐃𝐫𝐢𝐯𝐢𝐧𝐠.
In light of the rising incidents of minor driving leading to fatal road accidents,…
— Hyderabad City Police (@hydcitypolice) April 5, 2025