Hyundai Exter Knight Edition Launched in India: హ్యుందాయ్ కంపెనీకి దేశీయ మార్కెట్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రెటా వంటి కారును దేశీయ విఫణిలో లాంచ్ చేసి అత్యధిక అమ్మకాలతో దూసుకెళ్తోంది. అంతే కాకుండా గతేడాది ఈ కంపెనీ ఎక్స్‌టర్ కారును లాంచ్ చేసింది. ఇది కూడా ఆశించిన స్థాయిలో అమ్మకాలను పొందగలిగింది. కాగా ఇప్పుడు ‘ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్’ (Exter Knight Edition) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ ధర ఎంత? స్టాండర్డ్ మోడల్‌కు.. నైట్ ఎడిషన్‌కు మధ్య తేడాలు ఏంటి అనేవి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్
హ్యుందాయ్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ మొత్తం ఎనిమిది వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ డ్యూయెల్ టోన్, ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ మరియు ఎస్ఏసీ (ఓ) కనెక్ట్ డ్యూయెల్ టోన్ వేరియంట్స్.. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందుతాయి. మిగిలిన ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ డ్యూయెల్ టోన్, ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ మరియు ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ డ్యూయెల్ టోన్ అనేవి ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి.
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ ధరలు రూ. 8.38 లక్షల నుంచి రూ. 10.43 లక్షల (ధరలు ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఎక్స్‌టర్ మార్కెట్లో అడుగుపెట్టి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా కంపెనీ ఈ నైట్ ఎడిషన్ లాంచ్ చేసింది.
డిజైన్
కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఈ ఎడిషన్ కేవలం ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ వేరియంట్లకు మాత్రమే పరిమితమై ఉంది. ఇది బ్లాక్ పెయింటెడ్ సైడ్ గార్నిష్, ఫ్రంట్ బంపర్ మరియు టెయిల్‌గేట్ మీద రెడ్ యాక్సెంట్స్, రెడ్ బ్రేక్ కాలిపర్లు, బ్లాక్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్ వంటివి పొందుతుంది.
ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ వేరియంట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, హ్యుందాయ్ మరియు ఎక్స్‌టర్ బ్యాడ్జ్‌లు వంటివి పొందుతుంది. కాంట్రాస్టింగ్ రెడ్ యాక్సెంట్స్ అండ్ స్టిచ్చింగ్, రెడ్ ఫుట్‌వెల్ లైటింగ్, బ్లాక్ శాటిన్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, స్టీరింగ్ మెటల్ స్కప్ ప్లేట్, ప్లోర్ మ్యాట్ మీద రెడ్ స్టిచ్చింగ్ మరియు సీటు అంచులలో రెడ్ పైపింగ్ వంటివి చూడవచ్చు.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి అబిస్ బ్లాక్ మరియు షాడో గ్రే కలర్స్. ఇవి కాకూండా స్టార్రీ నైట్, అట్లాస్ వైట్ మరియు రేంజర్ ఖాకీ వంటి కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే షాడో గ్రే మరియు రేంజర్ ఖాకీ అనేవి బ్లాక్ రూప్ కలిగి డ్యూయెల్ టోన్‌లో లభిస్తాయి.
ఫీచర్స్
డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ హ్యుందాయ్ ఎక్స్‌టర్ స్టాండర్డ్ మోడల్ యొక్క అదే ఫీచర్స్ పొంది ఉంటుందని సమాచారం. కాబట్టి అదే టచ్ స్క్రీన్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇంజిన్
హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే.. ఈ స్పెషల్ ఎడిషన్ 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 హార్స్ పవర్ మరియు 114 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది ఉత్తమ [అనితీరునుఅందిస్తుందని తెలుస్తోంది.
Don’t Miss: భారతీయుడు 2: కమల్ హాసన్ కార్లు చూశారా? లోకనాయకుడంటే ఆ మాత్రం ఉంటది!
ప్రత్యర్థులు
దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న టాటా పంచ్, సిట్రోయెన్ సీ3, మారుతి ఫ్రాంక్స్, టయోటా టైసర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఉత్తమ అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.