ఇలాంటి ల్యాండ్ రోవర్ ఎప్పుడైనా చూసారా? ఫోటోలు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..

Green Colour Land Rover Defender 110: ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో వాహనాల వినియోగం బాగా ఎక్కువగా ఉంది. ప్రతి వ్యక్తి సొంత వాహనం కలిగి ఉండాలనుకోవడంతో వెహికల్స్ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అయితే కొంతమంది సంపన్ను లేదా సాధారణ వ్యక్తులు కొంత భిన్నంగా లేదా ప్రత్యేకంగా ఉండే కార్లను ఉపయోగించడానికి అమితాసక్తి చూపుతారు. అలాంటి వారు కొన్ని స్పెషల్ కార్లను కొనుగోలు చేయడానికి పూనుకుంటారు. గతంలో మనం అంబానీ రంగులు మార్చే కారును చూసాము. పింక్ కలర్ ల్యాండ్ రోవర్ కార్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఓ కేరళ బిజినెస్ మ్యాన్ గ్రీన్ కలర్ ల్యాండ్ రోవర్ కారు కొనుగోలు చేసే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

గ్రీన్ కలర్ కారు

నిజానికి ల్యాండ్ రోవర్ కార్లు బ్లాక్, వైట్, గ్రే వంటి రంగులలో లభిస్తాయని అందరికి తెలుసు. కొన్ని స్పెషల్ కలర్స్.. ఎల్లో (పసుపు), ఆకుపచ్చ, పింక్ మొదలైన రంగులు చాలా అరుదు, బహుశా ఇలాంటివి చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు. కానీ ఓ కేరళ వ్యాపారవేత్త ప్రత్యేకంగా ఉండటానికి ”గ్రీన్ కలర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 హెచ్ఎస్ఈ” (Green Colour Land Rover Defender HSE) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో గమనించినట్లయితే.. ప్రేమ్షా అనే వ్యక్తి తన ల్యాండ్ క్రూయిజర్ కారులో రావడం చూడవచ్చు. ఈయన ఫ్యామిలీ కూడా కారు డెలివరీకి డీలర్‌షిప్‌కు వచ్చింది. డీలర్షిప్ యాజమాన్యం వాళ్ళను సాదరంగా ఆహ్వానించారు. కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పూర్తి చేసిన తరువాత.. కారు మీద ఉన్న గుడ్డను తొలగిస్తారు. ఆ తరువాత కొనుగోలుదారు కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ప్రేమ్షా కొనుగోలు చేసిన కారు గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్ పొందినట్లు కనిపిస్తుంది. మొత్తం మీద కారు చూడటానికి కొత్తగా మాత్రమే కాదు, చాలా అద్భుతంగా ఉంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 హెచ్ఎస్ఈ

కేరళ వ్యాపారవేత్త ప్రేమ్షా ఎంచుకున్న ల్యాండ్ రోవర్ ఎడిషన్ 110 హెచ్ఎస్ఈ. దీని ధర రూ. కోటి కంటే ఎక్కువగానే ఉంటుంది. దేశీయ మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90, 110 మరియు 130 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ మూడు వేరియంట్లు చూడతనికి ఒకే మాదిరిగా అనిపించినప్పటికీ.. ఫీచర్స్ మరియు పరిమాణం పరంగా కొంత వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ధరల్లో కూడా మార్పులు ఉంటాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది.. ఒకటి 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్, మరొకటి 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ 5500 rpm వద్ద 296 Bhp పవర్ మరియు 1500 rpm వద్ద 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు ఫోర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్ పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. తద్వారా మంచి పనితీరును అందిస్తుంది. ఇది కేవలం 7.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 191 కిమీ కావడం గమనార్హం. డీజిల్ ఇంజిన్ కూడా ఉత్తమ పవర్ మరియు టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Don’t Miss: హీరోయిన్ ‘శృతి హాసన్’ కొన్న కొత్త కారు ఇదే.. ధర తెలిస్తే షాకవుతారు!

డిఫెండర్ అనేది పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు పొడవు 5018 మిమీ, వెడల్పు 2105 మిమీ, ఎత్తు 1967 మిమీ, వీల్‌బేస్ 3022 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 218 మిమీ వరకు ఉంటుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

బ్రిటీష్ బ్రాండ్ అయినప్పటికీ భారతదేశంలో ల్యాండ్ రోవర్ కార్లు బాగా ప్రజాదరణ పొందాయి. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు ఈ బ్రాండ్ కార్లను ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇది కేవలం రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా దీనికిదే సాటి అని చెప్పాలి.