36.7 C
Hyderabad
Saturday, April 12, 2025

రిటైర్‌మెంట్‌ ప్రకటించిన టీమిండియా కెప్టెన్‌.. ‘రోహిత్‌ శర్మ’ వాడే కార్లు ఇవే​!

Indian Cricketer Rohit Sharma Car Collection: సుమారు 13సంవత్సరాల నిరీక్షిణ తరువాత భారత్ టీ20 ప్రపంచ కప్ ముద్దాడి జెగజ్జేతగా నిలిచింది. యావత్ భారతదేశం మొత్తం ఈ రోజు కోసమే వేయి కళ్ళతో ఎదురు చూసింది. ఎట్టకేలకు టీమిండియా ఈ కలను నెరవేర్చింది. ఈ సమయంలో ప్రముఖ క్రికెటర్ మరియు స్టార్ ఓపెనర్ ‘రోహిత్ శర్మ’ (Rohit Sharma) రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ టీ 20 క్రికెట్ కెరీర్‌లో 159 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. సుమారు 4231 పరుగులు సాధించారు. ఇందులో ఇది సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు సాధించిన తన ఖాతాలో అరుదైన రికార్డ్ సాధించారు.

రోహిత్ శర్మ గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. ప్రముఖ ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. బహుశా ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. మనం ఈ కథనంలో రోహిత్ శర్మ గ్యారేజిలోని లేదా ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం..

క్రికెటర్ రోహిత్ శర్మ ఉపయోగించే కార్ల జాబితాలో లంబోర్ఘిని ఉరుస్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్, బీఎండబ్ల్యూ ఎక్స్5, టయోటా ఫార్చ్యూనర్, బీఎండబ్ల్యూ ఎమ్5, స్కోడా లారా మరియు రేంజ్ రోవర్ కార్లు ఉన్నట్లు సమాచారం..

లంబోర్ఘిని ఉరుస్

భారతదేశంలో ఎక్కువమందికి ఇష్టమైన ఇటాలియన్ సూపర్ కార్ బ్రాండ్ లంబోర్ఘిని. ఇందులో కూడా ఉరుస్ కారుకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ కారును ప్రముఖ సినీ తారలు మాత్రమే కాకుండా క్రికెటర్లు కూడా ఇష్టపడి కొనుగోలు చేశారు. ఇందులో ఒకరు రోహిత్ శర్మ. ఈయన గ్యారేజిలోని లంబోర్ఘిని ఉరుస్ కారు ధర సుమారు రూ. 4.18 కోట్లు. ఈ కారు అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

లంబోర్ఘిని ఉరుస్ కారు 4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 657 Bhp పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన ఈ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. రోహిత్ శర్మ ముంబై – పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో వేగంగా వెళ్తున్న సమయంలో చలాన్ కూడా అందుకున్నట్లు గతంలో ఓసారి వార్తల్లో నిలిచారు.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్

భారతదేశంలో ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసిన లగ్జరీ కార్లలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జీఎల్ఎస్ కూడా ఒకటి. ఈ కారు క్రికెటర్ రోహిత్ శర్మ గ్యారేజిలో కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 1.32 కోట్ల నుంచి రూ. 1.37 కోట్ల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ డీజిల్ మరియు పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 375 Bhp పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇక 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 362 Bhp పవర్ మరియు 750 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ ఉత్తమ పనితీరును అందిస్తాయి.

టయోటా ఫార్చ్యూనర్

ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా ఈ టయోటా ఫార్చ్యూనర్ కార్లను ఉపయోగిస్తున్నారు. రోహిత్ శర్మ కూడా ఈ కారును కలిగి ఉన్నారు. దీని ధర రూ. 32.5 లక్షలు. చూడచక్కని డిజైన్ కలిగిన ఈ కారు, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారును ఇప్పటికి కూడా చాలామంది సెలబ్రిటీలు ఉపయోగిస్తున్నారు.

స్కోడా లారా

రోహిత్ శర్మ గ్యారేజిలోని కార్ల జాబితాలో స్కోడా కంపెనీకి చెందిన లారా కూడా ఒకటి. దీని ధర రూ. 12.5 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని సమాచారం. ఈ కారును కంపెనీ 2009లో భారతదేశంలో ప్రారంభించింది. బహుశా ఇప్పుడు ఈ కారు ఉత్పత్తి దశలో లేదని తెలుస్తోంది. ఇది 2.0 లీటర్ టీడీఐ టర్బో డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 138 Bhp పవర్ మరియు 302 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

బీఎండబ్ల్యూ ఎక్స్3

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎక్స్3 కారు కూడా రోహిత్ శర్మ గ్యారేజిలో ఉంది. సుమారు రూ. 68 లక్షల ఖరీదైన ఈ కారు దేశీయ విఫణిలో 2017లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ కారు మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతోంది. పలువురు సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు కూడా ఈ కారును తమ గ్యారేజిలో కలిగి ఉన్నారు. అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు పనితీరుపరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. రోహిత్ శర్మ ఎక్కువగా ఈ కారునే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

Don’t Miss: లాంచ్‌కు సిద్దమవుతున్న సీఎన్‌జీ కార్లు ఇవే!.. ఎక్కువ మైలేజ్ కోసం బెస్ట్ ఆప్షన్

బీఎండబ్ల్యూ ఎం5

రోహిత్ శర్మ గ్యారేజిలో మరో ఖరీదైన బీఎండబ్ల్యూ కారు ఎం5. దీనిని భారతదేశంలోని చాలా తక్కువమంది ధనవంతులు మరియు ప్రముఖ వ్యక్తులు మాత్రమే కలిగి ఉన్నట్లు సమాచారం. దీని ధర రూ. 1.74 కోట్ల నుంచి రూ. 1.79 కోట్ల మధ్యలో ఉంటుంది. ఈ కారు 4.4 లీటర్ వీ8 ట్విన్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 560 పీఎస్ పవర్ మరియు 680 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు రోహిత్ శర్మకు చాలా ఇష్టమైన కారు అని కూడా తెలుస్తోంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు