16.7 C
Hyderabad
Wednesday, January 29, 2025

మొన్న రూ. 5.8 కోట్లు.. నేడు రూ. 3.3 కోట్లు – ఖరీదైన కార్లు కొంటున్న పొలిటికల్ లీడర్!

Indian Politician Pramod Madhwaraj Buys Expensive BMW XM Video Viral: ఒకప్పుడు రాజకీయ నాయకులు నిరాడంబరంగా.. ప్రజాసేవలోనే తరించేవారు. కానీ రోజులు మారాయి, వారి జీవన విధానం కూడా మారిపోయింది. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఖరీదైన కార్లు, బంగళాలు వీరి జీవితంలో సర్వ సాధారణం అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల ఓ రాజకీయ నాయకుడు రూ. కోట్లు విలువచేసే ఓ కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం కర్ణాటకకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త ‘ప్రమోద్ మధ్వరాజ్’ (Pramod Madhwaraj) ఇటీవల రూ. 3.3 కోట్లు విలువైన జర్మన్ బ్రాండ్ ‘బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్’ (BMW XM) కొనుగోలు చేసారు. దీనికి సంబంధించిన వీడియోను అతడు తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

వీడియోలో గమనించినట్లయితే.. బీఎండబ్ల్యూ కారుని డీలర్‌షిప్ సిబ్బంది డెలివరీ చేయడం చూడవచ్చు. ఈ కారు డెలివరీని డీలర్‌షిప్ సిబ్బంది ఆయన నివాసంలోనే డెలివరీ చేశారు. నిజానికి చాలామంది సెలబ్రిటీలు, సినీ తారలు ఈ కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ధర ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి కార్ల కొనుగోలు సాధారణ ప్రజలకు సాధ్యం కాదనే చెప్పాలి.

ప్రమోద్ మధ్వరాజ్‌కి డెలివరీ చేసిన కారు నిజానికి చాలా ప్రత్యేకమైన వాహనం. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు. ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉన్న బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎమ్ మోడల్. కంపెనీ గత ఏడాది అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది.

డిజైన్

చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు పెద్ద కిడ్నీ గ్రిల్‌తో ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్ కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఉన్న కిడ్నీ గ్రిల్ నిజానికి ఇతర బీఎండబ్ల్యూ మోడళ్లలో మనం చూస్తున్నట్లుగానే ఒక ఇల్యూమినేషన్ ఫంక్షన్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ బంపర్ షార్ప్ మరియు ఎడ్జీగా కనిపిస్తుంది, ఇది చాలా స్పోర్టీ లుక్‌ని ఇస్తుంది.

ముందు భాగంలో పెద్ద ఎయిర్ ఇంటేక్ ఈ కారుకి మంచి డిజైన్ అందించడంలో సహాయపడుతుంది. సైడ్ ప్రొఫైల్ ఐఎక్స్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి 22 ఇంచెస్ వీల్స్ లభిస్తాయి, కస్టమర్లు 23 ఇంచెస్ అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది.

వెనుక భాగంలో ఎల్ ఆకారంలో ఉన్న ఆల్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, నిలువుగా పేర్చబడిన ఎగ్జాస్ట్ టిప్స్ వంటి వాటితో పాటు వాటి చుట్టూ బ్లాక్ కలర్ ఇన్‌సర్ట్‌లతో కూడిన ఎలిమెంట్‌లతో ఆకర్షణీయంగా మరియు స్పోర్టీగా కనిపిస్తుంది.

ఫీచర్స్

కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెడ్ కలర్ ఎమ్ మోడ్ బటన్‌లు, యాంబియంట్ లైట్లు, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, ADAS మొదలైన ఫీచర్స్ ఉంటాయి.

ప‌వ‌ర్‌ట్రైన్

బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది ఎలక్ట్రిక్ మోటారుతో పాటు 653 పీఎస్ పవర్ మరియు 800 న్యూటన్ మీటర్ తారక్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

Don’t Miss: విడుదలకు సిద్దమవుతున్న కొత్త కార్లు – ఇవే!

ఈ కారు ఈవీ మోడ్‌లో 88 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇది కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీనిని 2 వీల్ డ్రైవ్ లేదా 4 వీల్ డ్రైవ్ మోడ్‌లలో ఉపయోగించవచ్చు. ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనం కాబట్టి, కారు సుమారు 62 kmpl అందిస్తుంది.

రోల్స్ రాయిస్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయ రాజకీయ నాయకుడు

ప్రమోద్ మధ్వరాజ్ ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో రూ. 5.8 కోట్లు ఖరీదైన ‘రోల్స్ రాయిస్‌’ (Rolls Royce) కారుని కొనుగోలు చేశారు. నిజానికి రోల్స్ రాయిస్‌ను కలిగి ఉన్న భారతదేశంలో మొదటి రాజకీయ నాయకుడు ఇతడే అని తెలుస్తోంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles