1933 రోల్స్ రాయిస్‌లో కనిపించిన మహారాష్ట్ర సీఎం.. ఈ కారు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Interesting Facts About The 1933 Rolls Royce Car: జూన్ 11 (మంగళవారం) ధర్మవీర్ స్వరాజ్య రక్షక్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కోస్టల్ రోడ్ రెండో దశ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ మరియు అజిత్ పవార్ పాల్గొన్నారు. అయితే వీరందరూ కలిసి 1933 రోల్స్ రాయిస్ 20/25 సాన్వర్టిబుల్ కారులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ కారు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కథనంలో ఈ కారు ఓనర్ ఎవరు? ఈ కారు ప్రత్యేకత ఏమిటి అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.

నిజానికి ఇక్కడ కనిపిస్తున్న రోల్స్ రాయిస్ కారును దాదాపు ప్రత్యక్షంగా చూసి ఉండరు. ఒకవేలా చూసిన వారు బహుశా ఏ ఎగ్జిబిషన్‌లో చూసి ఉండవచ్చు. ఈ తరం పిల్లలు ఇది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కారు అంటే నమ్మకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు రోల్స్ రాయిస్ కార్లకు.. ఇక్కడ కనిపించే కారుకు చాలా తేడా ఉంది.. కాబట్టి.

1933 రోల్స్ రాయిస్ 20/25

ఇక్కడ కనిపించే 1933 రోల్స్ రాయిస్ కారు ప్రముఖ వ్యాపారవేత్త మరియు బిలినీయర్ గౌతమ్ సింఘానియాకు చెందినదని తెలుస్తోంది. ఈ కారును రోల్స్ రాయిస్ కంపెనీ 1929 – 1936 మధ్య నిర్మించినట్లు సమాచారం. సంస్థ ఈ మోడల్ కార్లను 3827 యూనిట్లను మాత్రమే నిర్మించినట్లు తెలుస్తోంది. అప్పట్లో విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ కారు.. క్రమంగా కాలగర్భంలో కలిసిపోయింది. కానీ ఇప్పటికి కూడా 70 శాతం కార్లు అక్కడక్కడా ఉన్నట్లు పలువురు చెబుతున్నారు.

1933 రోల్స్ రాయిస్ 20/25 మోడల్ ఇన్-లైన్ 6 సిలిండర్ 3966 సీసీ ఓవర్ హెడ్ పుష్‌రోడ్ ఆపరేటేడ్ వాల్వ్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 114 మిమీ స్ట్రోక్‌తో 82 మిమీ బోర్‌ను కలిగి ఉంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందింది. రైట్ హ్యాండ్ గేర్‌ఛేంజ్, సింగిల్ డ్రై ప్లేట్ క్లచ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ కారు వైబ్రేషన్ డంపర్‌తో 7 బేరింగ్ క్రాంక్ షాఫ్ట్ పొందింది. వీటితో పాటు రిలీఫ్ వాల్వ్ ఫీడింగ్ రాకర్ షాఫ్ట్ మరియు టైమింగ్ గేర్‌లతో ఫ్రెషర్ ఫెడ్ లూబ్రికేషన్ వంటివి ఉన్నాయి.

చూడటానికి కొత్తగా.. చాలా సింపుల్ డిజైన్ కలిగి ఉన్న ఈ పాతకాలపు కారు బ్రాండ్ లోగో, హెడ్‌లైట్, విశాలమైన బంపర్ వంటి వాటిని పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ మరియు రియర్ ప్రొఫైల్ వంటివి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్‌ను ఒక స్టెప్ కూడా ఉండటం చూడవచ్చు. అన్ని విధాలా ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

ప్రపంచ మార్కెట్లో ఇప్పటికి కూడా ఈ రోల్స్ రాయిస్ కార్లు అక్కడక్కగా ఉన్నాయి. పాతకాలపు క్లాసిక్ కార్ల మీద ఎక్కువ ఆసక్తి ఉన్నవారు మాత్రమే ఈ కార్లను ఇప్పటికీ తమ గ్యారేజీల్లో భద్రపడుచుకునికి అప్పుడప్పుడు వినియోగిస్తుంటారు. ఇలాంటి కోవకు చెందినవారిలో ప్రముఖ బిజినెస్ మ్యాన్, రేమండ్ వ్యవస్థాపకుడు గౌతమ్ సింఘానియా. ఈయనవద్ద ఈ కారు మాత్రమే కాకుండా అనేక స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి.

ధర్మవీర్ స్వరాజ్య రక్షక్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కోస్టల్ రోడ్

ఇక మహారాష్ట్రలో ప్రారంభించిన రెండోదశ శంభాజీ కోస్టల్ రోడ్ విషయానికి వస్తే.. ఇది హాలీ నుంచి అమర్సన్స్ వరకు విస్తరించి ఉన్న 6.25 కిమీ సొరంగం. ఇది జులై నాటికి వర్లీ వరకు విస్తరించబడి ఉంటుంది. దీనిని ఆధునిక టెక్నాలజీతో నిర్మించబడుతుంది. ఈ సొరంగమార్గం నిర్మాణం వల్ల 40 నిమిషాల నుంచి 50 నిముషాలు జరిగే ప్రయాణం 8 నిమిషాలకు తగ్గించబడుతుందని, ముఖ్యమంత్రి షిండే ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.

ఈ మార్గం వినియోగంలోకి వచ్చిన తరువాత ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. రాత్రి 11 తరువాత నుంచి ఉదయం 7 గంటల వరకు ఈ మార్గాన్ని మూసి ఉంచుతారు. ఇందులో ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించడం వల్ల భద్రతకు కూడా ఎటువంటి లోటు లేదు.

Don’t Miss: నితిన్ గడ్కరీ కార్ కలెక్షన్.. ఇలాంటి కార్లు మరెవ్వరి దగ్గరా లేదు!

ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్టు 10.58 కిమీ పొడవు ఉంటుంది. దీనిని ఎనిమిది కారిడార్లుగా విభజించారు. ఇది మూడు ఇంటర్‌ఛేంజ్‌లను కలిగి ఉంటుంది. ఇందులో సుమారు 1856 వాహనాలను పార్కింగ్ చేయవచ్చని సమాచారం. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ. 13983 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో నిర్మాణ వ్యయం రూ. 8429 కోట్లు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తవుతుంది. ఇది ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుంది.