జాన్వీ కపూర్ కంటే ఖరీదైన కారు కొన్న ప్రియుడు: ఇలాంటిది మరెవ్వరి దగ్గరా లేదు!

Janhvi Kapoor BoyFriend Shikhar Pahariya New Land Rover: అతి తక్కువ కాలంలోనే.. బాగా పాపులర్ అయిన యువ సినీతారలలో ఒకరు అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు ‘జాన్వీ కపూర్’ (Janhvi Kapoor). బాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ.. ఓ ప్రత్యేకత సంపాదించుకున్న ఈ అమ్మడు, దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి.. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక పోతే రామ్ చరణ్ సరసన కూడా ఈమె నటించే అవకాశం ఉంది.

సినీ రంగంలో దినదినాభివృద్ధి చెందితున్న జాన్వీ.. గత కొన్ని రోజులకు ముందు రూ. 3.5 కోట్ల ఖరీదైన ‘లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్’ (Lexus LM 350h) కొనుగోలు చేసింది. కాగా ఇప్పుడు ఆమె ప్రియుడు శిఖర్ పహరియా రూ. 5.76 కోట్ల ‘రేంజ్ రోవర్ ఎస్‌వీ సెరినిటీ ఎడిషన్’ (Range Rover SV Serenity Edition) కొనుగోలు చేసాడు. ఈ కారు గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

శిఖర్ పహారియా కొనుగోలు చేసిన కొత్త కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇతడు కారులో నుంచి దిగి.. విమానాశ్రయానికి వెళ్లడం చూడవచ్చు. అదే సమయంలో ఫోటోలకు పోజులిస్తూ.. శిఖర్ ముందుకు వెళ్లిపోవడం కనిపిస్తుంది.

రేంజ్ రోవర్ ఎస్‌వీ సెరినిటీ ఎడిషన్

భారతదేశంలోని అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ కార్లలో ‘ఎస్‌వీ సెరినిటీ ఎడిషన్’ చెప్పుకోదగ్గ మోడల్. దీని ధర రూ. 5.76 కోట్లు అని తెలుస్తోంది. దీనిని శిఖర్ పహారియా కొనుగోలు చేసాడు. ఇది తెలుపు రంగులో.. గోల్డెన్ యాక్సెంట్స్ కలిగిన వీల్స్ పొందుతుంది. ఇది బ్రాండ్ యొక్క ఇతర మోడల్స్ మాదిరిగా కాకుండా.. చాలా హుందాగా ఉంటుంది. ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.

ఎస్‌వీ సెరినిటీ ఎడిషన్.. ఇతర రేంజ్ రోవర్ కార్ల మాదిరిగా కాకుండా, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వెనుక భాగంలో కెప్టెన్ సీట్లు ఉండటం కూడా చూడవచ్చు. లోపలి భాగంలో 13.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 13.1 ఇంచెస్ రియర్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా మెరిడియన్ 3డీ సరౌండ్ సిస్టం ఉంటుంది. ఇవన్నీ ప్రయాణికులకు.. ఉత్తమ ప్రయాణ అనుభూతిని అందిస్తాయి.

రేంజ్ రోవర్ ఎస్‌వీ సేరినిటీ ఎడిషన్ 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 523 Bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. దీనికి హైబ్రిడ్ అసిస్ట్ కూడా లభిస్తుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది.

జాన్వీ కపూర్ లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్

నటి జాన్వీ కపూర్ కొనుగోలు చేసిన లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 3.5 కోట్లు. ఇది ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. క్రోమ్ బిట్స్.. దీనిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. శిఖర్ పహారియా యొక్క కొత్త రేంజ్ రోవర్ మాదిరిగానే.. జాన్వీ కపూర్ లెక్సస్ కారులోని వెనుక సీట్లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇందులో రెండు కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఇవి లగ్జరీ అనుభూతిని అందిస్తాయి.

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారులో ఫోల్డ్ అవుట్ టేబుల్స్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు మరియు ఒట్టోమన్‌లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఫ్రిజ్ వంటివన్నీ ఉన్నాయి. వీటితో పాటు.. వెనుక గ్లోవ్ బాక్స్‌లు, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్, అంబ్రెల్లా హోల్డర్, 48 ఇంచెస్ టీవీ, 23 స్పీకర్ సిస్టం మొదలైనవి ఉన్నాయి.

కొత్త లెక్సస్ ఎల్ఎమ్ 350 హెచ్ 2.5 లీటర్ 4 సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 250 పీఎస్ పవర్, 239 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

Also Read: పొలిటికల్ లీడర్స్ ఫేవరెట్ కారు.. ఇప్పుడు సరికొత్త హంగులతో! – దీని రేటెంతో తెలుసా?

నిజానికి లెక్సస్ ఎల్ఎమ్ 350 హెచ్ కారు.. జాన్వీ కపూర్ దగ్గర మాత్రమే కాకుండా, చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో కూడా ఉంది. ఈ జాబితాలో రణ్‌బీర్ కపూర్, రాధికా మర్చంట్ అంబానీ, హార్దిక్ పాండ్యా మరియు షారుక్ ఖాన్ మొదలైనవారు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే.. కారు ఖరీదైనదే అయినప్పటికీ, దీనిని కొనుగోలు చేస్తున్న ప్రముఖులు మాత్రం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Comment