Jawa 350 Legacy Edition launched: ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన బైకులు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో కొత్త బైకులు ఉన్నాయి, అప్డేటెడ్ బైకులు ఉన్నాయి. ఈ తరుణంలో జావా మోటార్‌సైకిల్ (Jawa Motorcycle) కంపెనీ సరికొత్త ‘జావా 350 లెగసీ ఎడిషన్’ (Jawa 350 Legacy Edition) లాంచ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
కొత్త ఎడిషన్
జావా 350 లెగసీ ఎడిషన్.. చూడటానికి దాని సాధారణ మోడల్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మొదటి 500 మంది కస్టమర్లకు ఇది రూ. 1.99 లక్షలకు అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ధర రూ. 16,000 పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని బైక్ కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి.
కొత్త జావా 350 లెగసీ ఎడిషన్ బైకులో టూరింగ్ వైజర్, పిలియన్ బ్యాక్‌రెస్ట్, క్రాష్ గార్డ్ వంటి సరికొత్త ఫీచర్స్ ఉన్నాయి. అంతే కాకుండా లెదర్ కీచైన్, జావా 350 యొక్క కలెక్టర్ ఎడిషన్ మినియేచర్ మోడల్‌ను కూడా కొనుగోలుదారులు పొందుతారు. కలర్ ఆప్షన్ మారింది. కానీ యాంత్రికంగా ఈ బైకులో ఎటువంటి మార్పు లేదు.
ఇంజిన్ డీటెయిల్స్
జావా 350 లెగసీ ఎడిషన్ స్టాండర్డ్ బైకులో ఉన్న అదే 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 7000 rpm వద్ద, 22.5 హార్స్ పవర్, 5000 rpm వద్ద 28.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు పరంగా ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు లేదు.
కంపెనీ కొత్త వేరియంట్స్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా సంస్థ స్పోక్ వీల్ బేస్ వేరియంట్ (రూ. 1.99 లక్షలు), అల్లాయ్ వీల్స్ వేరియంట్ (రూ. 2.08 లక్షలు) మరియు టాప్ ఎండ్ క్రోమ్ వేరియంట్స్ అయిన స్పోక్ వీల్ (రూ. 2.15 లక్షలు), అల్లాయ్ వీల్ వేరియంట్ (రూ. 2.23 లక్షలు, అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) లాంచ్ చేసింది.
ఇండియాలోని జావా బైకులు
భారతీయ మార్కెట్లో జావా బైకులు తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అవి జావా 42 బాబర్, జావా 42, జావా 42 ఎఫ్‌జే, జావా పెరాక్ మరియు జావా 350. ఇవన్నీ మార్కెట్లో ఒకప్పుడు మంచి అమ్మకాలు పొందినప్పటికీ.. ప్రస్తుతం ప్రత్యర్థులకు పోటీ ఇవ్వడంలో కొంత విఫలమైనట్లే తెలుస్తోంది. అయితే కస్టమర్లను ఆకర్శించడానికే.. ఇప్పుడు జావా 350 లెగసీ ఎడిషన్ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బైక్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందో.. తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.
ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో గొప్ప అమ్మకాలు పొందిన.. జావా బైకులు ఇప్పుడు సరైన అమమకాలు పొందకపోవడానికి కారణం, బహుశా వాటి డిజైన్ అనే అనిపిస్తోంది. ఎందుకంటే.. యువత ఇప్పుడు సరికొత్త డిజైన్స్ కోరుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు.. వారిని ఆకర్శించడానికే లేటెస్ట్ డిజైన్ బైకులను ప్రవేశపెడుతున్నాయి. అయితే ఈ విషయంలో జావా కంపెనీ ఇంకా వెనుకబడి ఉందనే చెప్పాలి.
Also Read: మార్కెట్లో ఉన్న అద్భుతమైన బైక్స్.. రెండు లక్షలుంటే చాలు కొనేయొచ్చు!
ప్రారంభం నుంచి.. జావా కంపెనీ లాంచ్ చేస్తున్న బైకులు దాదాపు ఒకే డిజైన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ముందు భాగంలో చొచ్చుకుని వచ్చిన లైట్, ఎత్తు వంటివి చూడటానికి అంత ఆకర్షణీయంగా లేదని అనిపిస్తోంది. దీని ప్రత్యర్థి రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రం అన్ని విభాగాల్లోనూ.. బైకులను లాంచ్ చేస్తోంది. ఇవి ఆధునిక డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. ఆకర్షనీయమైన పెయింటింగ్ స్కీమ్ కూడా పొందాయి.
లెగసీ ఎడిషన్
ప్రస్తుతం కంపెనీ లాంచ్ చేసిన జావా 350 లెగసీ ఎడిషన్.. డిజైన్ దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ, కలర్ ఆప్షన్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని అనిపిస్తోంది. కాబట్టి ఈ బైక్ తప్పకుండా మంచి అమాంకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఇలాంటి కొత్త నవీనీకరణలతో కంపెనీ మున్ముందు మరిన్ని కొత్త బైక్స్ లాంచ్ చేస్తే.. గొప్ప అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. అయితే కంపెనీ ఇకపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది. ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఎలాంటి బైకులను లాంచ్ చేయనుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది.