లక్షల ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి – ఫోటోలు చూశారా?

Manisha Rani Gifts XUV 3XO to Father: సాధారణంగా ఎక్కడైనా తల్లిదండ్రులే తమ పిల్లలకు నచ్చిన వాటిని గిఫ్ట్ ఇస్తూ సంతోషపెడుతుంటారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. పిల్లలే తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో హిందీ బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొని ఎంతోమంది అభిమానులను సంపాదించిన ‘మనీషా రాణి’ (Manisha Rani) తన తండ్రికి లక్షల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చి నెటిజన్ల చేత శభాష్ అనిపించుకుంటోంది. ఇంతకీ ఈమె తన తండ్రికి ఏ కారును గిఫ్ట్ ఇచ్చింది. దాని ధర ఎంత? వివరాలు ఏంటి? అనే సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మనీషా రాణి బిగ్‌బాస్ ఓటీటీలో కూడా పాల్గొంది. అంతే కాకుండా ఈమె డ్యాష్ ఇండియా డ్యాన్స్ షోలో కూడా తన ప్రతిభను కనపరిచింది. ఇటీవల ‘ఝలక్ దిఖ్లా జా 11’ విజేతగా నిలిచింది. ఈమె ప్రముఖ డ్యాన్సర్ మాత్రమే కాదు.. ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా.

ఇక మనీషా రాణి ఇచ్చిన గిఫ్ట్ విషయానికి వస్తే.. ఇది మహీంద్రా కంపెనీకి చెందిన ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’ (Mahindra XUV 3XO) కారు. దీని ధర రూ. 7.49 లక్షల నుంచి రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. తన తండ్రికి గిఫ్ట్ ఇవ్వడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మనీషా తన తండ్రితో డీలర్షిప్ చేరుకుంటుంది. అప్పటికే తనకోసం సిద్ధం చేసిన కారును ఆవిష్కరిస్తుంది. ఆ తరువాత తన తండ్రితో కలిసి ఫోటోలకు పోజులిస్తుంది. కేక్ కట్ చేయడం, తండ్రి కూతురు కేక్ తినిపించుకోవడం వంటివన్నీ కూడా ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ

గత కొన్ని రోజులకు ముందు మార్కెట్లో లాంచ్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ.. మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతూ ముందుకు సాగుతోంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కావు రీడిజైన్ చేయబడిన గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్, అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్.. XUV 3XO అక్షరాలు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. అంతే కాకుండా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు సెంట్రల్ ఏసీ వెంట్స్, మెటాలిక్ పెడల్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ టీజీడీఐ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వంటివి ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 112 పీఎస్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 1.2 లీటర్ టీజీడీఐ ఇంజిన్ 130 పీఎస్ పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ మరియు డీజిల్ ఇంజిన్ 117 పీఎస్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. తద్వారా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా ఈ కారులో అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్ట్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఏడీఏఎస్ వంటి మరెన్నో ఫీహార్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

Don’t Miss: రూ. 95000లకే ‘బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ’ బైక్.. మైలేజ్ ఎంతో తెలుసా?

భారతీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు రాబోయే స్కోడా సబ్ 4మీటర్ ఎస్‌యూవీలకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. అయినప్పటికీ తన విభాగంలో మంచి అమ్మకాలను పొందుతోంది.