30.2 C
Hyderabad
Thursday, April 3, 2025

మొన్ననే ఇల్లమ్మేసింది.. ఇంతలోనే కోట్లు పెట్టి కొత్త కారు కొన్న బ్యూటీ

Kangana Ranaut Buys New Car After Selling Pali Hill Bungalow: రాజకీయ నాయకురాలు మరియు ప్రముఖ నటి ‘కంగనా రనౌత్’ (Kangana Ranaut) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు, గత ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసి బీజేపీ తరపున ఎన్నికల్లో మండి నియోజక వర్గం నుంచి గెలుపొందింది. కాగా ఇటీవల తన బంగ్లాను సుమారు రూ. 32 కోట్లకు విక్రయించింది. ఇప్పుడు రూ. 3 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ కారు ఏ బ్రాండ్? దీని విశేషాలు ఏమిటనే వివరాలు వివరంగా తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదివేయాల్సిందే.

ఏక్ నిరంజన్, చంద్రముఖి 2 వంటి తెలుగు సినిమాల్లో నటించిన కంగనా.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. ఈమె కొనుగోలు చేసిన కారు ‘రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ’ (Range Rover Autobiography LWB). దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 3 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. కొత్త కారు ఫోటోలను కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. కంగ్రచ్యులేషన్స్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అంటూ అభినందనలు తెలిపింది. ఇందులో కంగనా తన కొత్త కారుకు పూజలు చేయడం చూడవచ్చు.

కంగనా రనౌత్ కొనుగోలు చేసిన కారు తెల్లటి సల్వార్ కమీజ్‌లో ఉండటం చూడవచ్చు. కారుకు పూజ చేయడం, మేనల్లుడు అశ్వత్థామతో ఫోటోలకు పోజులివ్వడం వంటివి చూడవచ్చు. నటి కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ 5 సీటర్ కారు అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు కంగనాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ

ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ యొక్క ఆటోబయోగ్రఫీ కూడా ఒకటి. ఇది ఎల్ఈడీ లైట్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ ఫాగ్ లైట్స్, బ్రాండ్ లోగో వంటివి పొందుతుంది. రూఫ్ మౌంటెడ్ యాంటెన్నా, బాడీ కలర్ బంపర్స్, బ్లాక్ ఓఆర్‌వీఎం, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, డియర్ డీఫాగర్, రియర్ వైపర్ మొదలైనవన్నీ ఈ కారులో చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ కారు 13.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, జీపీఎస్ న్యావిగేషన్, వాయిస్ కమాండ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏసీ కంట్రోల్స్, 360 డిగ్రీ కెమెరా, క్యాబిన్ బూట్ స్పేస్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మొదలైన లేటెస్ట్ ఫీచర్స్ ఎన్నో పొందుతుంది.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ 2997 సీసీ 6 సిలిండర్ ఇన్‌లైన్‌ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4000 rpm వద్ద 346 బ్రేక్ హార్స్ పవర్, 1500 rpm వద్ద 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఆటోమాటిక్ గేర్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉండే ఈ లగ్జరీ కారు.. పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.

ఇప్పటికే ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీలు

ప్రస్తుతం ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారును కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో కంగనా రనౌత్ కాకుండా.. రణబీర్ కపూర్, అలియా భట్, నిమ్రత్ కౌర్, ఆదిత్యరాయ్ కపూర్, సోనమ్ కపూర్, మహేష్ బాబు, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, అనన్య పాండే మరియు అమితాబ్ బచ్చన్ మొదలైన ప్రముఖులు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే సెలబ్రిటీలకు రేంజ్ రోవర్ కార్లంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.

Don’t Miss: అర్జున్ కపూర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. రేటు తెలిస్తే మీరు కొనేస్తారు!

కంగనా రనౌత్ కార్ కలెక్షన్ (Kangana Ranaut కార్ Collection)

నటి కంగనా గ్యారేజిలో ఇప్పుడు తాజాగా చేరిన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ మాత్రమే కాకుండా.. మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్ 600, మేబ్యాచ్ ఎస్680, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350డీ, బీఎండబ్ల్యూ 7 సిరీస్ 730ఎల్‌డీ మరియు ఆడి క్యూ3 వంటి మరెన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు