Kia EV 6 Facelift Launched in India: ఇండియన్ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో ‘కియా’ కంపెనీకి చెందిన ‘ఈవీ6’ ఒకటి. అయితే సంస్థ ఇపుడు దీనిని ఫేస్‌లిఫ్ట్ రూపంలో దేశీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ డిజైన్, ఫీచర్స్ మరియు రేంజ్ వంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదివేయాల్సిందే.
ధర
2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ‘కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్’ (Kia EV6 Facelift).. మొత్తానికి అమ్మకానికి వచ్చేసింది. దీని ధర రూ. 65.9 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే దీనిని కంపెనీ ఇప్పుడు మరింత పెద్ద బ్యాటరీతో తీసుకొచ్చింది. ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎలక్ట్రిక్ కారు ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లో లాంచ్ కావడం ఇదే మొదటిసారి.
డిజైన్
రిఫ్రెష్ డిజైన్ కలిగిన కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ చిన్న చిన్న కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. డిజైన్ కూడా కొంత కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి ఇందులో త్రిభుజాకారంలో ఉన్న హెడ్‌లైట్స్, ఐబ్రో స్టైల్ డీఆర్ఎల్ (డేటైమ్ రన్నింగ్ లైట్స్), 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, ఎయిర్ ఇన్‌టేక్ వంటివి ఉన్నాయి. సిల్హౌట్ పెద్దగా మారలేదు. టెయిల్ ల్యాంప్ కొంత మారింది. రియర్ బంపర్ కూడా కొంత అప్డేట్ అయి ఉండటం చూడవచ్చు.
ఫీచర్స్
అప్డేటెడ్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. దదాపు స్టాండర్డ్ ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇందులో 12.3 ఇంచెస్ పనోరమిక్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటి వాటికి అనుసంధానించబడి ఉంటుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో గమనించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు అన్‌లాక్ చేయవచ్చు.
హెటెడ్ అండ్ వెంటిలేషన్ సీట్ల కోసం కంట్రోల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ సెంటర్ కన్సోల్ చివరలో చూడవచ్చు. టూ స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా అప్డేట్ చేయబడి ఉంది. ఈ కారులో ఏడీఏఎస్ 2.0 సిస్టం కూడా ఉంది. తద్వారా వినియోగదారులకు మంచి ప్రొటక్షన్ లభిస్తుంది.
Also Read: ఏప్రిల్ నుంచి అలాంటి వాహనాలకు పెట్రోల్ పోయడం ఆపేస్తున్నారు!.. ఎందుకంటే?
బ్యాటరీ & రేంజ్
2025 కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ కారులో ముఖ్యమైన అప్‌గ్రేడ్ ఏమిటంటే.. బ్యాటరీ. ఇది 84 కిలోవాట్ యూనిట్ (సాధారణ ఈవీ6 కారులో 77.4 కిలోవాట్ బ్యాటరీ ఉండేది). ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో 650 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. కాగా ఇది అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే దీనిని 350 కిలోవాట్ డీసీ ఛార్జర్ ద్వారా.. కేవలం 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది.
కొత్త కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ మొత్తం ఐదు రంగులలో లభిస్తుంది. అవి స్నో వైట్ పెర్ల్, యాచ్ బ్లూ మ్యాట్, రన్‌వే రెడ్, వోల్ఫ్ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కారు ఐదు రంగులలో లభించడం చేత వినియోగదారుడు తనకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.