కియా గ్రావిటీ ఎడిషన్స్.. ముచ్చటగా మూడు కార్లు: పూర్తి వివరాలు

Kia Gravity Editions: ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో ఎంతోమంది వాహన ప్రియులను ఆకర్శించి, ప్రత్యర్థులకు సైత గట్టి పోటీ ఇచ్చిన ‘కియా మోటార్స్’ (Kia Motors).. ఎట్టకేలకు సోనెట్, సెల్టోస్ మరియు కారెన్స్ యొక్క గ్రావిటీ ఎడిషన్స్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..

కియా సోనెట్ గ్రావిటీ ఎడిషన్ (Kia Sonet Gravity Edition)

దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త కియా సోనెట్ గ్రావిటీ ఎడిషన్ ధరలు రూ. 16.63 లక్షల నుంచి రూ. 18.21 లక్షల మధ్య ఉన్నాయి. ఇది మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 డీజిల్ ఇంజిన్. డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. అదే విధంగా న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది.

సోనెట్ గ్రావిటీ ఎడిషన్ పెర్ల్ వైట్, అరోరా బ్లాక్ మరియు మ్యాట్ గ్రాఫైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది వైర్‌లెస్ ఛార్జర్, రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లతో కూడిన స్పిల్ట్ ఫోల్డింగ్ రియర్ సీట్లు వంటి ఫీచర్స్ పొందుతుంది. కాస్మొటిక్ అప్డేట్స్ పొందిన ఈ కారు వైట్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్, రియర్ స్పాయిలర్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది.

కిడా సోనెట్ గ్రావిటీ ఎడిషన్ ధరలు

1.2 లీటర్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్: రూ. 10.50 లక్షలు
1.0 లీటర్ పెట్రోల్ ఐఎంటీ: రూ. 11.20 లక్షలు
1.5 లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్: రూ. 12.00 లక్షలు

కియా సెల్టోస్ గ్రావిటీ ఎడిషన్ (Kia Seltos Gravity Edition)

కంపెనీ లాంచ్ చేసిన మరో గ్రావిటీ ఎడిషన్ కియా సెల్టోస్. ఈ మోడల్ ధరలు రూ. 16.63 లక్షల నుంచి రూ. 18.21 లక్షల మధ్య ఉన్నాయి. ఇది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ లేదా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. డిజైన్ పరంగా చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు.

ధరలు

1.5 లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్: రూ. 16.63 లక్షలు
1.5 లీటర్ సీవీటీ: రూ. 18.06 లక్షలు
1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్: రూ. 18.21 లక్షలు

కొత్త కియా సెల్టోస్ గ్రావిటీ ఎడిషన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉన్నాయి. ఈ కారు 17 ఇంచెస్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ ఫినిష్డ్ రియర్ స్పాయిలర్ వంటివి కూడా పొందుతుంది. ఇది గ్లేసియల్ వైట్, అరోరా బ్లాక్ మరియు డార్క్ గణ్ మెటల్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

కియా కారెన్స్ గ్రావిటీ ఎడిషన్ (Kia Carens Gravity Edition)

ఇక చివరగా మూడో ఎడిషన్.. కియా కారెన్స్ గ్రావిటీ ఎడిషన్. ఇది స్టాండర్డ్ మోడల్ యొక్క ప్రీమియం (ఓ) వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. దీని ధరలు రూ. 12.10 లక్షల నుంచి రూ. 14.00 లక్షల మధ్య ఉన్నాయి. ఇది మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్స్. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు డీజిల్ ఇంజిన్స్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతాయి. టర్బో పెట్రోల్ మోడల్ 6 స్పీడ్ ఐఎంటీ గేర్‌బాక్స్ పొందుతాయి.

ధరలు

1.5 లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్: 12.10 లక్షలు
1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఐఎంటీ: రూ. 13.50 లక్షలు
1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్: రూ. 14.00 లక్షలు

Don’t Mind: క్రెటా నైట్ ఎడిషన్: మతిపోగోట్టే కలర్ ఆప్షన్.. అంతకు మించిన ఫీచర్స్

కియా కారెన్స్ గ్రావిటీ ఎడిషన్ చూడటానికి సాధారణ కారెన్స్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో సింగిల్ పేన్ సన్‌రూఫ్, బ్లాక్ లెదర్ సీట్లు, లెథెరెట్ డోర్ సెంటర్ ట్రిమ్స్ మరియు ఆర్మ్‌రెస్ట్ వంటి మరెన్నో చూడవచ్చు.