Google Pixel 9a launch: టెక్ దిగ్గజం గూగుల్ (Google).. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త ‘పిక్సెల్ 9ఏ’ (Pixel 9e) స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో ఈ రోజు (మార్చి 19) లాంచ్ అవుతుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లో రేపు (మార్చి 20) అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కాబట్టి ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, డిజైన్, స్పెసిఫికేషన్ వంటి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
డిజైన్ & కలర్ ఆప్షన్స్
సరికొత్త గూగుల్ పిక్సెల్ 9ఏ మొబైల్.. క్లాసిక్ పిక్సెల్ ఏ-సిరీస్ లుక్ పొందుతుంది. వెనుక భాగంలో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ 6.3 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే పొందుతుంది. ఇది దాని పిక్సెల్ 8ఏ (6.1 ఇంచెస్ డిస్‌ప్లే) కంటే పెద్దది. ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ మరియు 2700 నైట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 3ను కలిగి ఉంటుంది.
చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన గూగుల్ సరికొత్త ఫోన్.. నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి పింగాణీ, అబ్సిడియన్, పియోనీ మరియు ఐరిస్ కలర్స్. ఇవన్నీ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
కెమెరా సెటప్
ఈ రోజుల్లో మొబైల్ కొనుగోలు చేసేవారిలో చాలామంది స్టోరేజ్ మాత్రమే కాకుండా.. అద్భుతమైన కెమెరా ఆప్షన్ ఉన్న ఫోన్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని.. గూగుల్ తన ‘పిక్సెల్ 9ఏ’లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందించింది. సెల్ఫీ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. ఇది సెల్ఫీ కోసం మాత్రమే కాకుండా వీడియో కాల్స్ మాట్లాడటానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
పర్ఫామెన్స్ మరియు బ్యాటరీ
కొత్త గూగుల్ పిక్సెల్ 9ఏ మొబైల్ 8జీబీ ర్యామ్‌తో జతచేయబడిన టెన్సర్ జీ4 చిప్‌తో ఒక మెయిన్ అప్‌గ్రేడ్ పొందుతుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. ఇందులో 5100 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ మొబైల్ 23 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 7.5 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి యూజర్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు.
Also Read: భారత్‌లో అడుగెట్టడానికి సిద్దమవుతున్న అమెరికన్ కంపెనీ ఇదే..
ధర
గూగుల్ లాంచ్ చేయనున్న కొత్త పిక్సెల్ 9ఏ మొబైల్ ప్రారంభ ధర ప్రపంచ మార్కెట్లో రూ. 42,000 వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ ఫోన్ ధర భారతదేశంలో రూ. 50,000 కంటే ఎక్కువే ఉంటుందని సమాచారం. ధరలను కంపెనీ అధికారికంగా త్వరలోనే వెల్లడిస్తుంది. కాగా ఈ ఫోన్ సేల్స్ మార్చి 26 నుంచి ప్రారంభమవుతాయని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయిన తరువాత ఎలాంటి అమ్మకాలు పొందుతుందో తెలియాల్సి ఉంది. అత్యుత్తమ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఇది తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.