11వ బిడ్డకు తండ్రైన ఎలోన్ మస్క్.. ఈయన గ్యారేజిలోని ప్రత్యేకమైన కార్లు చూశారా?

Lets Know About Elon Musk Special Cars: ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్ వంటి కంపెనీల బాస్ ‘ఎలోన్ మస్క్’ (Elon Musk) తాజాగా 12వ బిడ్డకు తండ్రయ్యారు. ఇప్పటికే 10మంది పిల్లలకు తండ్రైన మస్క్ ఇప్పుడు 11వ బిడ్డకు న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ ‘శివోన్ జిలిస్’ ద్వారా తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని జిలిస్ కూడా స్పందించలేదు. అయితే పలు దిగ్గజ వార్త సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టాయి.

వ్యాపార, సాంకేతిక రంగాల్లో దూసుకెల్తూ.. ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచిన మస్క్ తన మొదటి భార్య జస్టిస్ మస్క్ ద్వారా ఐదు మంది, రెండో భార్య గ్రిమ్స్ ద్వారా ముగ్గురు, మూడో భార్య జిలిస్ ద్వారా ముగ్గురు పిల్లలను కన్నారు. దీంతో ఎలోన్ మస్క్ పిల్లల సంఖ్య 11కి చేరింది. ఇకపోతే వ్యాపార రంగంలో అగ్రగామిగా ఉన్న మస్క్ అత్యంత ఖరీదైన మరియు ప్రత్యేకమైన కార్లను తన గ్యారేజిలో కలిగి ఉన్నారు. ఈ కథనంలో మస్క్ కార్ల ప్రపంచం గురించి వివరంగా తెలుసుకుందాం.

1957 జాగ్వార్ ఈ-టైప్ రోడ్‌స్టర్

బిలినీయర్ ఎలోన్ మస్క్ గ్యారేజిలోని ప్రత్యేకమైన కారు ఈ 1957 జాగ్వార్ ఈ-టైప్ రోడ్‌స్టర్. ఈ కారును ప్రపంచంలోనే అందమైన అభివర్ణిస్తారు. దీనిని ఎంజో ఫెరారీ కంపెనీ తయారు చేసింది. మస్క్ చిన్నప్పటి నుంచి ఈ కారును కొనాలని కలలు కనేవారని, చివరకు ఈ కారును సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు 4.2 లీటర్ 6 సిలిండర్ ఇంజిన్ ద్వారా పని చేస్తుంది. ఇది 256 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కంపెనీ రూపొందించిన ఈ అరుదైన కారు చాలా తక్కువమంది ధనవంతుల దగ్గర మాత్రమే ఉంది. అందులో మస్క్ ఒకరు కావడం గమనార్హం.

1997 మెక్‌లారెన్ ఎఫ్1

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసిన మెక్‌లారెన్ ఎఫ్1 ఎలోన్ మస్క్ గ్యారేజిలో ఉంది. ఈ కారును గోర్డాన్ ముర్రే డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు రెండు డోర్స్ మాత్రమే పొందింది. అయితే మస్క్ వద్ద ఉన్న ఈ కారు ఒకానొక సందర్భంలో క్రాష్ అయినట్లు, దానిని రిపేర్ చేయడానికే చాలా డబ్బు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా దీనిని చివరకు విక్రయించినట్లు సమాచారం.

1976 లోటస్ ఎస్ప్రిట్

నిజానికి ఎలోన్ మస్క్ గ్యారేజిలోని అత్యంత ఖరీదైన మరియు చెప్పుకోదగ్గ కారు 1976 లోటస్ ఎస్ప్రిట్. ఇది చూడటానికి కారు మాదిరిగా ఉన్నప్పటికీ.. నీటిలోపల కూడా ప్రయాణించగలదు. దీనిని జేమ్స్ బాండ్ సినిమాలో బహుశా కొంతమంది చూసి ఉండవచ్చు. అయితే ఈ సినిమాలో నీటిలో ప్రయాణించే వాహనంగా మాత్రమే ఉపయోగించారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది భూమిపైన కూడా ప్రయాణించగలదు. దీనిని మస్క్ 2013లో జరిగిన ఒక వేలంలో సొంతం చేసుకున్నారు. ఈ కారుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో చూడవచ్చు.

బీఎండబ్ల్యూ ఎం5

ఎలోన్ మస్క్ గ్యారేజిలో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎం5 కారు కూడా ఉంది. ఈ కారును ప్రత్యేకంగా హమాన్ మోటార్‌స్పోర్ట్‌లోని బీఎండబ్ల్యూ నిపుణులు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా అధునాతన ఫీచర్స్ పొందుతుంది. నాలుగు డోర్స్ కలిగిన ఈ కారు 660 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ 322 కిమీ / గం అని తెలుస్తోంది. దీన్ని బట్టి ఇది ఎంత వేగంగా ప్రయాణించగలదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన కారు కూడా ఎలోన్ మస్క్ గ్యారేజిలో ఉంది.

టెస్లా రోడ్‌స్టర్

ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా కంపెనీకి చెందిన ‘రోడ్‌స్టర్’ కారు కూడా మస్క్ గ్యారేజిలో ఉంది. ఇది టెస్లా యొక్క మొదటి కారు అని సమాచారం. ఈ రోజు కూడా ఈ మోడల్ కారును చాలామంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా పొందినట్లు తెలుస్తోంది. ఈ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

Don’t Miss: ప్రియుడితో సోనాక్షి సిన్హా పెళ్లి.. ఈ హీరోయిన్ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?

ఇండియాకు టెస్లా?

భారతదేశంలో టెస్లా సంస్థ తన కార్యకలాపాలను ప్రారభించడాని గత కొన్ని సంవత్సరాలుగా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన దేశప్రధాని ‘నరేంద్ర మోదీ’తో కూడా చర్చలు జరిపారు. ఆ తరువాత టెస్లా భారతదేశంలోని గుజరాత్ సమీపంలో తన తయారీ కర్మాగారం ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైనట్లు కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇండియన్ మార్కెట్లో టెస్లా కంపెనీ అడుగుపెడుతుంది కేంద్రమంత్రి ‘హెచ్డీ కుమారస్వామి’ కూడా స్పష్టం చేశారు. అయితే ఈ సంస్థ ఎప్పుడు భారతీయ విఫణిలో అడుగుపెడుతుందనే విషయం అధికారికంగా వెల్లడి కాలేదు.