Mahindra BE 6e And XEV 9e Launched: దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా తన హవా నిరూపించుకోవడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ రోజు ‘బీఈ 6ఈ’ (BE 6e) కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 18.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
బీఈ 6ఈ డెలివరీలు ఎప్పుడంటే..
మహీంద్రా లాంచ్ చేసిన బీఈ 6ఈ ప్రొడక్షన్ మోడల్.. ఇది ఈ మోడల్ యొక్క మొదటి కారు. కంపెనీ త్వరలోనే దీని ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. డెలివరీలు 2025 మార్చి నాటికి ప్రారంభమవుతాయి. అయితే.. ఈ కారు చూడటానికి ఇప్పటికి మార్కెట్లో ఉన్న ఇతర మహీంద్రా కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది.
కొత్త డిజైన్..
బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు జే-షేప్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లాంప్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ మరియు ఫ్రంట్ ఫాసియాపైన హెడ్‌ల్యాంప్‌ల మధ్య ఫ్లోటింగ్ ఏరోడైనమిక్ ప్యానెల్ వంటివి పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు చూడవచ్చు. యాంగ్యులర్ రేక్డ్ రియర్ విండ్‌స్క్రీన్ వెనుక భాగంలో ఉన్నాయి. అంతే కాకుండా వెనుకవైపు సీ-షేప్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, స్ప్లిట్ రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి. ఇంకా బ్రాండ్ లోగో, బీఈ 6ఈ బ్యాడ్జ్ వంటివి కూడా ఇక్కడ చూడవచ్చు.
ఫీచర్స్ & ఇంటీరియర్ డిజైన్
ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఓ కొత్త అనుభూతిని పొందవచ్చు. ఎయిర్‌క్రాప్ట్ కాక్‌పిట్ క్యాబిన్‌కు మంచి ఆకర్షణను అందిస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ మరియు పనోరమిక్ డిస్‌ప్లే వంటివి కూడా ఇందులో చూడవచ్చు. టూ స్పోక్ స్టీరింగ్ వీల్ మీద ప్రకాశవంతమైన బీఈ లోగోను కూడా చూడవచ్చు. రియర్ వ్యూ మిర్రర్ సమీపంలో ఓవర్‌హెడ్ స్విచ్‌లు ఉన్నాయి.
ఫీచర్స్ గురించి మాట్లాడితే.. హెడ్ ఆఫ్ డిస్‌ప్లే, పనోరమిక్ గ్లాస్ రూఫ్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీ, డాల్ఫీ అట్మోస్‌తో కూడిన 16 స్పీకర్ హర్మాన్ కార్టాన్ ఆడియో సిస్టం మరియు లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS)వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్
మహీంద్రా బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి 59 కిలోవాట్ బ్యాటరీ, మరొకటి 79 కిలోవాట్ బ్యాటరీ. 59 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 228 హార్స్ పవర్ మరియు 380 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 450 కిమీ నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుంది.
79 కిలోవాట్ బ్యాటరీ విషయానికి వస్తే.. ఇది 281 హార్స్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జీతో 682 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ రెండు వేరియంట్లు మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతాయి. అవి రేస్, రేంజ్ మరియు ఎవ్రిడే. కాబట్టి ఇవి అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ (Mahindra XEV 9e)
కంపెనీ లాంచ్ చేసిన మరో ఎలక్ట్రిక్ కారు ‘ఎక్స్ఈవీ 9ఈ’ (XEV 9e). కంపెనీ ఈ కారును ఐఎన్జీఎల్ఓ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించింది. దీని ప్రారంభ ధర రూ. 21.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారును కంపెనీ 2025 మార్చిలోనే డెలివరీ చేసే అవకాశం ఉంది.
చూడటానికి కొత్తగా కనిపించే ఈ మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ.. ట్రై యాంగిల్ హెడ్‌ల్యాంప్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, విశాలంగా కనిపించే బోనెట్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్ వంటివి పొందుతుంది. వెనుక భాగంలో రూఫ్‌లైన్ క్రమంగా తగ్గడం చూడవచ్చు. ఇది విండ్‌షీల్డ్‌తో ముగుస్తుంది. టెయిల్ లాంప్ ముందు భాగంలోని డీఆర్ఎల్ మాదిరిగానే ఉంది.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ పరిమాణం విషయానికి వస్తే.. ఇది 4789 మీమీ పొడవు, 1907 మిమీ వెడల్పు, 1694 మిమీ ఎత్తు మరియు 2775 మిమీ వీల్‌బేస్ పొందుతుంది. మొత్తం మీద ఇది బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారుకు సమానంగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 207 మిమీ వద్ద బీఈ 6ఈ మాదిరిగానే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బూట్ స్పేస్ 663 లీటర్లు.
ఎక్స్ఈవీ 9ఈ ఫీచర్స్
ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ ఈ కొత్త మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ కారులో ఉన్నాయి. వన్ టచ్ పార్కింగ్, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ వంటి వాటితో పాటు.. మూడు స్క్రీన్‌లతో కూడిన వైడ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా ఎంట్రీ ప్యాక్ వన్ డ్రైవ్ మోడ్స్, వన్ పెడల్ డ్రైవింగ్ ఫంక్షన్, సెమీ యాక్టివ్ సస్పెన్షన్, క్రూయిజ్ కంట్రోల్, డిస్క్ బ్రేక్స్ మరియు యాపిల్ కార్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, వైపర్స్, రియర్ ఏసీ వెంట్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు మల్టి స్టెప్ రిక్లైన్ రియర్ సీట్ బ్యాక్‌రెస్ట్ మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఈ కారులో పొందవచ్చు.
బ్యాటరీ ఆప్షన్స్, రేంజ్ మరియు ఛార్జింగ్
ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు కూడా రెండు బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుంది. అవి 59 కిలోవాట్ మరియు 79 కిలోవాట్ బ్యాటరీ. వీటి రేంజ్ కొడాఆ బీఈ 6ఈ మాదిరిగా ఉంటుంది. చిన్న బ్యాటరీ ఒక ఛార్జీతో 542 కిమీ రేంజ్ అందిస్తే.. పెద్ద బ్యాటరీ ప్యాక్ 656 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు 11 కేడబ్ల్యు ఏసీ ఛార్జర్, 7.2 కేడబ్ల్యు ఏసీ ఛార్జర్ మరియు 175 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 7.2 kW ఏసీ ఛార్జర్ ద్వారా 59 కిలోవాట్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 8.7 గంటలు అయితే.. 140 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 20 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. 11 kW ఛార్జర్ ద్వారా చార్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది.
Also Read: పుష్ప 2 విడుదలే కాలేదు.. అప్పుడే లగ్జరీ కారు కొనేసింది: దీని రేటెంతో తెలుసా?
79 కిలోవాట్ బ్యాటరీని 11 kW ఛార్జర్ ద్వారా 8 గంటల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో 7.2 Kw ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి పట్టే సమయం 11.7 గంటలు మాత్రమే. దీనిని 175 Kw డీసీ ఛార్జర్ ఉపయోగించి 20 నిమిషాల్లోనే 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తం మీద మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన రెండు ఎలక్ట్రిక్ కార్లు.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ మరియు అత్యుత్తమ పనితీరును అందిస్తాయని స్పష్టంగా తెలుస్తోంది.