Mahindra Thar Roxx Deliveries Start in India: బహు నిరీక్షణ తరువాత కొన్ని రోజులకు ముందు భారతీయ విఫణిలో ఆఫ్ రోడర్ కింగ్ మహీంద్రా థార్.. 5 డోర్స్ రూపంలో లాంచ్ అయింది. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో అమ్ముడవుతూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్న థార్ 3 డోర్ మోడల్, 5 డోర్ కారుగా అడుగుపెట్టడంతో వాహన ప్రియులంతా.. దీనిని కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. ఇప్పుడు కంపెనీ బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ చేయడం కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.
మహీంద్రా థార్ 5 డోర్ కారు రోక్స్ (Roxx) పేరుతో లాంచ్ అయిన విషయం అందరికి తెలిసిందే. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన తరువాత అక్టోబర్ 3 నుంచి రూ. 21000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. సంస్థ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన కేవలం ఒక గంటలోనే లక్ష కంటే ఎక్కువమంది బుక్ చేసుకున్నారు.
ఆరు వేరియంట్స్
5 డోర్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయిన కొత్త థార్ రోక్స్.. దాని స్టాండర్డ్ మోడల్ లేదా 3 డోర్ థార్ కంటే పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఇది ఎంఎక్స్1, ఎంఎక్స్3, ఏఎక్స్3ఎల్, ఎంఎక్స్5, ఏఎక్స్5ఎల్ మరియు ఏఎక్స్7ఎల్ అనే ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన మహీంద్రా థార్ రోక్స్ మొత్తం ఏడు రంగులలో లభిస్తుంది. అవి స్టీల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ, బాటిల్ షిప్ గ్రే మరియు బర్న్ట్ సియెన్నా కలర్స్. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో థార్ రోక్స్ లభిస్తున్న కారణంగా కొనుగోలుదారు తమకు నచ్చిన రంగు థార్ రోక్స్ కొనుగోలు చేయవచ్చు.
మహీంద్రా థార్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతాయి. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. ఇది 4×2 మరియు 4×4 వెర్షన్స్ రూపంలో అందుబాటులో ఉంది. కాబట్టి కొనుగోలుదారు తన అభిరుచికి తగిన విధంగా ఏ ఇంజిన్ ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు.
2024 థార్ లేదా థార్ రోక్స్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, మల్టి స్లాట్ గ్రిల్, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, టెయిల్ గేట్, మౌంటెడ్ స్పేర్ వీల్, సీ-పిల్లర్ మరియు మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్ వంటివి పొందుతుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే.. విశాలమైన క్యాబిన్ కలిగిన థార్ పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏడీఏఎస్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, 65 వాట్స్ యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి పొందుతుంది.
మొదటి యూనిట్ రూ.1.31 కోట్లు
ఇండియన్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క థార్ కారుకు అధిక డిమాండ్ ఉంది. ఇటీవల కంపెనీ లాంచ్ చేసిన థార్ రోక్స్ మొదటి యూనిట్ ఏకంగా రూ. 1.31 కోట్లకు అమ్ముడైంది. థార్ 3 డోర్ మోడల్ లాంచ్ అయినప్పుడు కూడా.. మొదటి యూనిట్ రూ. కోటి కంటే ఎక్కువ ధరకే అమ్ముడైంది.
సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు దాదాపు అందరికీ ఇష్టమైన ఆఫ్-రోడర్లలో థార్ చెప్పుకోదగ్గ మోడల్. ఇది మంచి డిజైన్, ఫీచర్స్, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కలిగి.. ఉత్తమ ఆఫ్-రోడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. 2010 నుంచి సుమారు 1,86,055 మంది థార్ కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు మొదలైనవారు ఉన్నారు.
Don’t Miss: బాలెనో రీగల్ ఎడిషన్ లాంచ్: ధర & వివరాలు చూశారా?
ఇప్పుడు మహీంద్రా కంపెనీ తన థార్ రోక్స్ డెలివరీలను ప్రారంభించింది. కాబట్టి త్వరలోనే బుక్ చేసుకున్న అందరికీ కూడా థార్ రోక్స్ అందించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి థార్ రోక్స్ బుక్ చేసుకున్న వారికి త్వరలోనే డెలివరీలు అందుతాయి. అయితే డెలివరీలు ముందుగా బుక్ చేసుకున్న వారికి ప్రారంభమవుతాయి. కాబట్టి కొంత ఆలస్యంగా బుక్ చేసుకున్న వారికి కొంత ఆలస్యంగానే డెలివరీలు జరిగే అవకాశం ఉంది.