Mahindra Thar vs Thar Roxx Comparison: చూస్తుండగానే.. 2025వ సంవత్సరంలో కూడా మూడు నెలలు గడిచిపోయాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచే లెక్కకు మించిన వాహనాలు మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ జాబితాలో దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కూడా ఉంది. ఈ కంపెనీ 2024 – 25 ఆర్ధిక సంవత్సరంలో ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, థార్ రాక్స్, బీఈ 6 మరియు ఎక్స్ఈవీ 9ఈ అనే నాలుగు కార్లను లాంచ్ చేసింది. ఇందులో ప్రధానంగా థార్ రోక్స్ గురించి చెప్పుకోవాల్సిందే..
మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన కార్లు అన్నీ కూడా అధిక ప్రజాదరణ పొంది, మంచి అమ్మకాలను పొందుతున్నాయి. అయితే మరింతమందిని ఎక్కువగా ఆకర్షించిన మోడల్ ‘థార్ రోక్స్’ (Thar Roxx). ఇది మూడు డోర్స్ థార్ కంటే కూడా మెరుగ్గా పనిచేస్తుందా?.. 2025లో థార్ కొనుగోలు చేయాలా? థార్ రాక్స్ కొనుగోలు చేయాలా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఇక్కడ ఆ సందేహాలకు సమాధానాలను చూసేద్దాం.
థార్ రోక్స్ కారును కంపెనీ 2024 ఆగష్టులో లాంచ్ చేసింది. అయితే సంస్థ ఈ కారు కోసం.. బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 60 నిమిషాల్లో (ఒక గంట సమయంలో) 1,76,218 బుకింగ్స్ పొందింది. మహీంద్రా యొక్క నాసిక్ ప్లాంట్‌లోనే థార్ రాక్స్ మరియు థార్ రెండూ తయారవుతున్నాయి.
గత ఆర్ధిక సంవత్సరంలో థార్ రోక్స్ (ఐదు డోర్స్ థార్) మొత్తం 38590 యూనిట్ల అమ్మకాలను నమోదు చేస్తే.. థార్ (మూడు డోర్స్ థార్) అమ్మకాలు మొత్తం 46,244 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే థార్ సేల్స్ మొత్తం 84,834 యూనిట్లు అని సంస్థ నివేదికల ద్వారా తెలుస్తోంది.
ధరలు
మహీంద్రా థార్ ధరలు రూ. 11.49 లక్షల నుంచి రూ. 17.60 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి. థార్ రోక్స్ ధరలు రూ. 12.99 లక్షల నుంచి రూ. 23.08 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ధరలలో కొంత వ్యత్యాసం కనిపిస్తుందని సంకోచం అవసరం లేదు. ఎందుకంటే ధరకు తగిన విధంగా కారు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇంజిన్ ఆప్షన్స్
మహీంద్రా థార్ 1.5 లీటర్ డీజిల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ టార్క్ కన్వర్టర్ పొందుతాయి. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన థార్ మోడల్స్ రియర్ వీల్ డ్రైవ్ (RWD) మరియు ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందుతాయి. అయితే 1.5 లీటర్ డీజిల్ యూనిట్ కేవలం రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది.
థార్ రోక్స్ విషయానికి వస్తే.. ఇది 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలను పొందుతాయి. పెట్రోల్ యూనిట్ 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలను కలిగి ఉంటాయి. డీజిల్ ఇంజిన్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్స్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది. థార్ రాక్స్ పెట్రోల్ మోడల్ రియర్ వీల్ డ్రైవ్, డీజిల్ మోడల్ రియర్ వీల్ డ్రైవ్ మరియు ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్ పొందుతాయి.
Also Read: 2025లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లు ఇవే!.. రూ.10 లక్షల కంటే తక్కువే
ఏది ఎంచుకోవాలంటే?
నిజానికి థార్ మరియు థార్ రోక్స్ రెండూ కూడా మంచి డిజైన్, ఫీచర్స్ మరియు పర్ఫామెన్స్ అందిస్తాయి. ఈ రెండింటిలో ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే థార్ రాక్స్ అనేది ఐదు డోర్స్ కలిగి ఉంటే.. సాధారణ థార్ మూడు డోర్స్ కలిగి ఉంటుంది. కాబట్టి ధరలు, ఇంజిన్ పనితీరు మరియు ఇతర వినియోగాన్ని బట్టి.. ఏ కారు కొనుగోలు చేయాలో వినియోగదారుడే నిర్దారించుకోవాలి.