ఈ కారు కావాలంటే 3 నెలలు వేచి ఉండాల్సిందే!.. ఎందుకో ఇప్పుడే తెలుసుకోండి

Mahindra Thar Waiting Period Reduced: మహీంద్రా థార్.. ఇది కేవలం ఓ కారు పేరు అనుకుంటే పొరపాటే. ఆఫ్ రోడింగ్ ప్రియుల ఎమోషన్. వాహన ప్రేమికుల డ్రీమ్ కారు. ఇది దేశీయ మార్కెట్లో లాంచ్ అయినప్పటినుంచి.. ఇప్పటి వరకు విపరీతమైన అమ్మకాలు పొందుతూ.. భారతీయ విఫణిలో తిరుగులేని ఆఫ్-రోడ్ ఎస్‌యూవీగా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇటీవల రోక్స్ పేరుతో 5 డోర్స్ థార్ లాంచ్ అయినప్పటికీ.. 3 డోర్స్ థార్ కారుకున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ కారు బుక్ చేసుకుంటే.. డెలివరీ కోసం కొన్ని రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.

భారీ డిమాండ్

2020లో లాంచ్ అయిన మహీంద్రా థార్ డెలివరీ కోసం గతంలో ఒక సంవత్సరం రోజులు వేచి ఉండాల్సి వచ్చిన సందర్భం కూడా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ కూడా కస్టమర్లకు త్వరితగతిన డెలివరీ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఉత్పత్తిని కూడా వేగవంతం చేసింది. దీంతో వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా తగ్గింది.

వెయిటింగ్ పీరియడ్

ప్రస్తుతం మహీంద్రా థార్ 4×4 వేరియంట్ కోసం 3 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు తెలుస్తోంది. 4×2 వేరియంట్ కోసం కూడా రెండు నెలల కంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు సమాచారం. డీజిల్ మరియు పెట్రోల్ వేరియంట్లకు దాదాపు మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

మహీంద్రా థార్ 4×4 వెయిటింగ్ పీరియడ్

థార్ యొక్క 4×4 వేరియంట్లలో.. హార్డ్ టాప్ పెట్రోల్ మరియు కన్వర్టిబుల్ వేరియంట్స్ కోసం మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. హార్డ్ టాప్ డీజిల్ వేరియంట్ల కోసం 2 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉందని సమాచారం. థార్ 4×4 పెట్రోల్ మోడల్ ధరలు రూ. 14.30 లక్షల నుంచి రూ. 17 లక్షల మధ్య ఉన్నాయి. డీజిల్ వేరియంట్ ధరలు రూ. 14.85 లక్షల నుంచి రూ. 17.60 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి.

మహీంద్రా థార్ 4×4 వెర్షన్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి 152 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 132 హార్స్ పవర్ అందించే 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఈ రెండూ కూడా 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమాటిక్ ఎంపికలను పొందుతాయి.

థార్ 4×2 వెయిటింగ్ పీరియర్

ఇక మహీంద్రా థార్ 4×2 మోడల్ వెయిటింగ్ పీరియడ్ విషయానికి వస్తే.. డీజిల్ మరియు పెట్రోల్ వెర్షన్ కోసం రెండు నెలలు వేచి ఉండాల్సి ఉంది. ఈ మోడల్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 118 హార్స్ పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. దీని ధరలు రూ. 11.35 లక్షల నుంచి రూ. 14.10 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి.

థార్ రోక్స్

మహీంద్రా థార్ 5 డోర్ ఇప్పుడు రోక్స్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం మంచి బుకింగ్స్ పొందింది. అంతే కాకుండా డెలివెరీలు కూడా ప్రారంభమయ్యాయి. మహీంద్రా థార్ రోక్స్ కారును డెలివెరీ చేసుకోసుకోవడానికి కూడా ఇంకా కొన్ని నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఆరు వేరియంట్లలో లభిస్తున్న మహీంద్రా థార్ రోక్స్ మొత్తం ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

Don’t Miss: ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా.. ఈ బ్రాండ్ కారు ఉండాల్సిందే!

థార్ రోక్స్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్స్ పొందుతుంది. ఇవి రెండూ.. 6 స్పీడ్ ఆటోమాటిక్ మరియు మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. ఈ కారు 4×4 మరియు 4×2 వెర్షన్లలో లభిస్తుంది. ఇవి రెండూ మంచి పనితీరుని అందిస్తాయి. పరిమాణంలో సాధారణ థార్ కంటే పెద్దదిగా ఉన్న రోక్స్ మంచి ఆఫ్ రోడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ కారణంగానే చాలామంది థార్ రోక్స్ లేదా థార్ 5 డోర్ వెర్షన్ ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.