Mark Zuckerberg Porsche Mini Van For His Wife Priscilla Chan: ఇప్పటివరకు మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు కూడా వీ-క్లాస్ వంటి మినీ వ్యాన్స్ వంటివి విక్రయిస్తోంది. అయితే జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్స్చే మాత్రం ఎప్పుడూ మినీ వ్యాన్ తయారు చేయలేదు. అయితే ఫేస్‌బుక్ సీఈఓ ‘మార్క్ జుకర్‌బర్గ్’ (Mark Zuckerberg) కోసం ఓ మినీ వ్యాన్ రూపొందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
బిలియనీర్ అనుకోవాలేగానీ ఏదైనా చేసేస్తారు.. అని నిరూపించారు మార్క్ జుకర్‌బర్గ్. ఇప్పటివరకు కార్లను మాత్రమే తయారుచేసే పోర్స్చే కంపెనీ మినీ వ్యాన్ రూపొందించింది. ఇది కేవలం జుకర్‌బర్గ్ కోసం మాత్రమే. ఇది కూడా తన భార్య కోసం ప్రత్యేకంగా తయారు చేయించి గిఫ్ట్ ఇచ్చారు.
జుకర్‌బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్‌తో కలిసి ఫోర్స్చే కయెన్ మరియు 911 జీటీ3 ముందు నిలబడి ఉన్నారు. పోర్స్చే మినీ వ్యాన్ యొక్క ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది స్లైడింగ్ డోర్ కలిగి ఉండటం చూడవచ్చు. ఫోటోలను షేర్ చేస్తూ.. కొత్త వైపు అన్వేషణ, ప్రిసిల్లాకు ఒక మినీ వ్యాన్ కావాలి. కాబట్టి నేను ఖచ్చితంగా ఏదో ఒకటి డిజైన్ చేయాలని పోర్స్చే కయెన్ జీటీ మినీ వ్యాన్ ఇవ్వాలనుకున్నాను. నేను అనుకున్న విధంగా పోర్స్చే మినీ వ్యాన్ రూపొందించి ఇవ్వడానికి సహాయపడటానికి పోర్స్చే మరియు వెస్ట్‌కోస్ట్‌కస్టమ్స్‌కి థాంక్స్ అని ఫోటోలను షేర్ చేస్తూ పేర్కొన్నారు.
నిజానికి పోర్స్చే కంపెనీ ఎప్పుడూ మినీ వ్యాన్ తయారు చేయలేదు, తయారుచేయాల్సిన అవసరం రాలేదు. మొదటిసారి కంపెనీ మినీవ్యాన్ జుకర్‌బర్గ్ కోసం డిజైన్ చేసింది. దీనిని వెస్ట్ కోస్ట్ కస్టమ్స్ సహకారంతో రూపొందించడం జరిగింది. ఈ స్పెషల్ మినీ వ్యాన్ క్లాసీ షేడ్‌లో పూర్తిచేయబడి ఉంది. సాధారణగా డోర్స్ స్థానంలో కంపెనీ కస్టమ్ ఎలక్ట్రిక్ డోర్స్ అమర్చింది. ఇది స్టాండర్డ్ కయెన్ కారు కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే దీని వీల్‌బేస్ పొడిగించబడి ఉంది.
పోర్స్చే మినీ వ్యాన్ యొక్క మధ్యలోని సీట్లను కెప్టెన్ చైర్స్ మాదిరిగా డిజైన్ చేశారు. కాబట్టి ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మినీ వ్యానుకు సంబంధించి పవర్‌ట్రెయిన్ గణాంకాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 ఇంజిన్ ద్వారా 659 బీహెచ్‌పీ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
మార్క్ జుకర్‌బర్గ్ కార్ కలెక్షన్ (Mark Mark Zuckerberg Car Collection)
బిలియనీర్ మార్క్ జుకర్‌బర్గ్ సాధాసీదా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో కేవలం ఒకే సూపర్ కారు ఉన్నట్లు తెలుస్తోంది. హోండా ఫిట్, అకురా టీఎస్ఎక్స్, ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ ఎంకే6 జీటీఐ, ఇన్ఫినిటీ జీ సెడాన్ మరియు పగానీ హుయ్రా మొదలైనవి ఈయన గ్యారేజిలో ఉన్నాయి.
ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న జుకర్‌బర్గ్ నికర విలువ 207 బిలియన్ డాలర్లు. గతంలో ప్రపంచ ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఈయన.. ఇటీవలే రెండో స్థానానికి వచ్చారు. ప్రస్తుతం ఎలోన్ మస్క్ తరువాత స్థానంలో నిలిచారు. కాగా ఇప్పుడు పోర్స్చే మినీ వ్యాన్ కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలాంటి మినీ వ్యాన్ మరొక్కటి లేదనే తెలుస్తుంది.
పోర్స్చే కార్లకు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలామంది బిలియనీర్లు, సెలబ్రిటీలు కూడా ఈ కంపెనీ కార్లను కొనుగోలు చేశారు. హృతిక్ రోషన్, సోనూసూద్, ఫరూక్ అక్తర్, సచిన్ టెండూల్కర్, యుజ్వేంద్ర చాహల్ మరియు సురేష్ రైనా, కపిల్ దేవ్, అక్షయ్ కుమార్, బాబీ డియోల్, ఇమ్రాన్ ఖాన్, రామ్ కపూర్, నరైన్ కార్తికేయన్ మొదలైనవారు ఈ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే పోర్స్చే కార్లకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థమవుతుంది.
Don’t Miss: మహీంద్రా థార్ కొనుగోలుపై రూ.1.60 లక్షల డిస్కౌంట్స్: మళ్ళీ రాదు ఈ ఆఫర్
నిజానికి పోర్స్చే కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ ప్రజలు వీటిని కొనుగోలు చేయలేరు. కాబట్టి చాలా తక్కువమంది మాత్రమే ఈ కార్లను కలిగి ఉన్నారు. పోర్స్చే బ్రాండ్ కార్ల ధర రూ. 1 కోటి నుంచి రూ. 3.51 కోట్ల కంటే ఎక్కువ వరకు ఉన్నాయి. ధరలు కొనుగోలు చేసే నగరాన్ని బట్టి.. ఎంచుకునే కారును బట్టి ఉంటాయి.