25 సంవత్సరాలుగా తిరుగులేని మోడల్: 32 లక్షల మంది కొన్న ఏకైక కారు ఇదే

Maruti Wagon R 25 Years Completed in India: ఎక్కువమందికి సుపరిచయమైన వెహికల్ బ్రాండ్ మారుతి సుజుకి (Maruti Suzuki). ఈ కంపెనీ ఇప్పటికే లెక్కకు మించిన మోడల్స్ మార్కెట్లో లాంచ్ చేసి, అధిక ప్రజాదరణ పొందుతోంది. ఇందులో ఒకటి ‘మారుతి వ్యాగన్ ఆర్’ (Maruti Wagon R). ఈ కారు భారతదేశంలో ఏకంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్, హోండా సిటీ వంటి వాటితో పాటు మార్కెట్లో ఎక్కువ సంవత్సరాలుగా అమ్ముడవుతున్న కారుగా వ్యాగన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

1999లో తొలిసారి

డిసెంబర్ 18, 1999లో మొదటిసారి ‘వ్యాగన్ ఆర్’ భారతీయ విపణిలో అరంగేట్రం చేసింది. కాగా అప్పటి నుంచి, ఇప్పటి వరకు ఎంతోమందిని ఆకర్షిస్తూ.. మంచి అమ్మకాలను పొందుతూ పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. 2022, 2023 మరియు 2024 ఆర్ధిక సంవత్సరాల్లో కూడా ఈ కారు అధిక అమ్మకాలను పొందగలిగింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాగన్ ఆర్.. మూడవ తరం మోడల్. ఇప్పటి వరకు (25 సంవత్సరాల్లో) 32 లక్షల మంది ఈ వ్యాగన్ ఆర్ కార్లను కొనుగోలు చేశారు.

మొత్తం 25 సంవత్సరాల్లో మారుతి వ్యాగన్ ఆర్ రెండు సార్లు అప్డేట్స్ పొందింది. ఈ కారణంగానే ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతున్న కారు 1.0 లీటర్ మరియు 1.2 లీటర్ ఇంజిన్ ఆప్షన్స్ కలిగి ఉంది. మారుతి వ్యాగన్ ఆర్ టాల్‌బాయ్ డిజైన్, అప్డేటెడ్ ఇంటీరియర్ కలిగి ఉంది.

వ్యాగన్ ఆర్ మొదటి తరం

మారుతి సుజుకి వ్యాగన్ 1999లో లాంచ్ అయినప్పుడు.. హ్యుందాయ్ కంపెనీ యొక్క శాంత్రోకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండేది. పొడుగ్గా ఉండే ప్రజలు ప్రయాణించడానికి వ్యాగన్ ఆర్ అనుకూలంగా ఉండటం చేత.. ఇది అప్పట్లోనే గణనీయమైన అమ్మకాలను పొందగలిగింది. మొదటితరం వ్యాగన్ ఆర్ 2003లోనే చిన్న కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. ఆ తరువాత 2006లో మరోసారి మరింత ఎక్కువ అప్డేట్స్ పొందింది. ఆ సమయంలో LPG వేరియంట్ పరిచయమైంది.

వ్యాగన్ ఆర్ గొప్ప పర్ఫామెన్స్ అందించడం వల్ల.. ఇది గణనీయమైన అమ్మకాలను పొందగలిగింది. ఈ కారులో 50:50 స్ప్లిట్ రియర్ సీటు కూడా ఉంది. మొదటితరం మోడల్ 4 సీటర్ కారుగా మాత్రమే పరిచయమైంది. ఆ తరువాత కాలంలో ఇది అప్డేట్ పొందింది.

రెండో తరం మారుతి వ్యాగన్ ఆర్

మారుతి వ్యాగన్ ఆర్ రెండో తరం మోడల్ 2010 నుంచి 2018 మధ్యలో అందుబాటులో ఉండేది. ఇది జపాన్‌లోని నాలువగా తరం వ్యాగన్ ఆర్ ఆధారంగా నిర్మితమైంది. ఇది దాని మునుపటి తరం కరుకంటే కూడా కొంత పెద్దదిగా ఉండేది. ఇది ఏబీఎస్ మరియు ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. ఈ కారు 1.0 లీటర్ త్రి సిలిండర్ కే10బీ ఇంజిన్ పొందింది. ఇది 68 హార్స్ పవర్ అందించింది. ఇందులో CNG మోడల్ కూడా ఈ రెండోతరంలోనే పరిచయమైంది.

2013లో వ్యాగన్ ఆర్ మరింత ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందటం మాత్రమే కాకుండా.. ఇంటీరియర్‌లో కూడా ఎక్కువ అప్డేట్స్ పొందింది. 2014లో మారుతి సుజుకి ఒక కొత్త వేరియంట్ పరిచయం చేసింది. ఇది దాని సాధారణ మోడల్ కంటే కూడా ప్రీమియంగా ఉండేది. ఈ కారులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. ఇదే వ్యాగన్ ఆర్ టాప్ వేరియంట్‌గా మార్కెట్లో విక్రయించబడింది.

Also Read: 2025లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. కొత్త కారు కొనాలనుకునే వారికి పండగే!

మూడోతరం వ్యాగన్ ఆర్

వ్యాగన్ ఆర్ మూడవ తరం కారు 2019లో ప్రారంభమైంది. అదే ఇప్పటికి కూడా అమ్మకానికి ఉంది. మూడోతరం వ్యాగన్ ఆర్ కారు హార్ట్‌టెక్ట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడింది. ఈ కారుకు జపాన్‌లో అమ్ముడవుతున్న కారుకు పెద్దగా సంబంధమే లేదు. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందింది. కాగా CNG ఇంజిన్ 1.0 లీటర్ ఇంజన్‌తో మాత్రమే అమ్మకానికి ఉంది.

ఇకపోతే 2022లో కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఒకసారి అప్డేట్స్ పొందింది. ఆ సమయంలోనే రెండు ఇంజన్‌లు డ్యూయెల్ జెట్ టెక్నాలజీ మరియు ఐడెల్ స్టార్ట్ / స్టాప్ సిస్టం వంటి వాటితోపాటు కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. కాగా ఈ ఏడాది జూన్ నెలలోనే కంపెనీ తన మూడోతరం వ్యాగన్ ఆర్‌తో 10 లక్షల అమ్మకాలను పొందగలిగింది. అంతే కాకుండా భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందిన CNG మోడల్ కూడా వ్యాగన్ ఆర్ కావడం గమనార్హం. ఇప్పటికి మార్కెట్లో 6.6 లక్షల CNG కార్లు అమ్ముడైనట్లు సమాచారం.

Leave a Comment