Mercedes Benz GLA Facelift Launched In India: భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ తన ఉనికిని మరింత విస్తరించడంతో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లేదా అప్డేటెడ్ ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా మరో అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేసింది. ఈ కొత్త బెంజ్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మెర్సిడెస్ బెంజ్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త కారు 2024 GLA (2024 జీఎల్ఏ). ఇది చిన్న కాస్మెటిక్ ట్వీక్‌లతో మరియు కొంత అప్డేటెడ్ ఇంటీరియర్ పొందుతుంది. ఈ SUV ప్రారంభ ధర రూ. 50.50 లక్షలు (ఎక్స్ షో రూమ్ ఇండియా). ఇది మూడు ట్రిమ్‌లలో.. రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
వేరియంట్స్ & ధరలు
- GLA 200 – రూ. 50.50 లక్షలు
- GLA 220d 4Matic – రూ. 54.75 లక్షలు
- GLA 220d 4Matic AMG లైన్ – రూ. 56.90 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్ షోరూమ్, ఇండియా)
డిజైన్
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంది. అయితే ఇది అప్డేటెడ్ మోడల్ కాబట్టి చిన్న చిన్న సూక్షమైన మార్పులు గమనించవచ్చు. ఇందులో హెడ్‌ల్యాంప్‌లు, కనుబొమ్మల వంటి ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ వంటివి ఉంటాయి. అంతే కాకుండా రివైజ్డ్ బంపర్‌లోని ఆప్రాన్ మరియు వీల్ ఆర్చ్ క్లాడింగ్ బాడీ కలర్‌లో పూర్తి చేయబడ్డాయి. వెనుక వైపున ఉన్న టెయిల్ ల్యాంప్‌లు ఎల్ఈడీ ఎలిమెంట్స్ కలిగి ఉన్నాయి.
ఫీచర్స్
కొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ ఇప్పుడు స్పెక్ట్రల్ బ్లూ అనే కొత్త కలర్ ఆప్షన్ పొందుతుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక లోపలి భాగంలో చెప్పుకోదగ్గ పెద్ద అప్డేట్స్ లేదనే చెప్పాలి. కాబట్టి ఇందులో టచ్ బేస్డ్ కంట్రోల్‌లతో కొత్త AMG స్పెక్ స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్ ప్యాసింజర్ సైడ్ కార్బన్ ఫైబర్ లాంటి ఇన్సర్ట్‌ను పొందుతుంది. సెంటర్ కన్సోల్ రివైజ్ చేయబడిన స్విచ్ గేర్ మరియు మరింత స్టోరేజ్‌తో చక్కగా ఉంది.
ఈ అప్డేటెడ్ మోడల్ దాని మునుపటి కారులో రెండు 10.25 ఇంచెస్ కనెక్టెడ్ స్క్రీన్‌లు ఉంటాయి. ఈ స్క్రీన్‌లు అప్‌డేట్ చేయబడిన MBUX సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ట్విన్ పేన్ సన్‌రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, మెమరీతో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కొత్త డిజిటల్ కీ వంటివి ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికి ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఆటో హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.
ఇంజన్ & స్పెక్స్
2024 మెర్సిడెస్ బెంజ్ GLA కారు 163 హార్స్ పవర్ మరియు 270 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ యూనిట్ మరియు 190 హార్స్ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ యూనిట్ పొందుతుంది.
పెట్రోల్ యూనిట్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది, ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ మాత్రమే. డీజిల్ ఇంజిన్ 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Don’t Miss: Volkswagen: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం! ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావండోయ్..
ప్రత్యర్థులు
ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త బెంజ్ కారు ఇప్పటికే అమ్మకానికి ఉన్న బీఎండబ్ల్యూ ఎక్స్1, ఆడి క్యూ3 మరియు వోల్వో XC40 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.