ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ఎంజీ మోటార్: కారంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు

MG Cyberster Launch Confirmed India: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత పాపులర్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అవతరించిన ‘ఎంజీ మోటార్’ (MG Motor) మార్కెట్లో ఫ్యూయెల్ కార్లను మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఇప్పుడు మరో కొత్త మోడల్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని 2025 జనవరిలో లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఆ కారు ఏది? దాని వివరాలు ఏమిటి అనే ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మొట్ట మొదటి స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారు

ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త కారు పేరు ‘సైబర్‌స్టర్’ (MG Cyberster). ఈ ఏడాది మార్చిలో ఆవిష్కరించబడిన ఈ కారు.. కంపెనీ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు. దీనిని సంస్థ ప్రీమియం ఎంజీ సెలక్ట్ రిటైల్స్ ద్వారా విక్రయించనుంది. అంతే కాకుండా జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా ప్రారంభంలో దేశవ్యాప్తంగా.. 12 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను కలిగి ఉండనుంది. ఆ తరువాత వీటి సంఖ్యను పెంచనున్నట్లు సమాచారం.

నిజానికి సైబర్‌స్టర్ 2023 గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో ప్రారంభించబడింది. అంతకంటే ముందు ఇది 2021లో ఒక కాన్సెప్ట్ రూపంలో దర్శనమిచ్చింది. త్వరలో లాంచ్ కానున్న ఈ ఎలక్ట్రిక్ కారు 4533 మిమీ పొడవు, 1912 మిమీ వెడల్పు, 1328 మిమీ ఎత్తు మరియు 2689 మిమీ వీల్‌బేస్ పొందుతుంది.

ప్రస్తుతం ఎంజీ సైబర్‌స్టర్ కారు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయానికి ఉన్నట్లు సమాచారం. ఇది రెండు బ్యాటరీ ఫ్యాక్స్, రెండు మోటార్స్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ లెవెల్ మోడల్ ఒకే రియర్ యాక్సిల్ మౌంటెడ్ 308 హార్స్ పవర్ అందించే మోటారును పొందుతుంది. ఇందులోని 64 కిలోవాట్ బ్యాటరీ 520 కిమీ రేంజ్ అందిస్తుంది.

సైబర్‌స్టర్ రేంజ్

టాప్ రేంజ్ మోడల్ సైబర్‌స్టర్ కారు రెండు మోటార్లను కలిగి ఉంటుంది. ఇవి రెండూ 544 హార్స్ పవర్, 725 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారులోని 77 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్.. ఒక సింగిల్ ఛార్జీతో 580 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఎంజీ మోటార్ కంపెనీ ఈ కారును భారతదేశంలో తయారు చేయదు. కాబట్టి దీనిని భారతదేశానికి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉంటుంది. అంతే కాకుండా ఈ కారులో జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా ఏ బ్యాటరీని పొందు పరుస్తుంది, అది ఎంత రేంజ్ అందిస్తుంది.. అనే విషయాలు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే ఈ వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం.

సైబర్‌స్టర్ రేంజ్ మాత్రమే కాకుండా.. ధరలు కూడా వెల్లడి కాలేదు. కానీ దీని ధర రూ. 75 లక్షల నుంచి రూ. 80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము. చూడటానికి చాలా కొత్తగా ఉన్న ఈ కారు.. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న బ్రాండ్ యొక్క ఇతర కార్ల కంటే కూడా భిన్నంగా ఉంది. అయితే ఇది ఒక్క చూపుతోనే ఆకర్శించే గుణాన్ని కలిగి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ఫీచర్లకు సంబంధించిన వివరాలను కూడా అధికారికంగా పంచుకోలేదు.

Also Read: ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేసిన మహీంద్రా: సరికొత్త డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్

ఎంజీ సైబర్‌స్టర్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఎందుకంటే ఈ కారుకు దేశీయ విఫణిలో ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. కానీ ధర పరంగా.. బీవైడీ సీల్, హ్యుందాయ్ ఐయోనిక్ 5 మరియు కియా ఈవీ6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది.

మార్కెట్లోని ఎంజీ మోటార్స్ కార్లు

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎంజీ మోటార్ కంపెనీ జెడ్ ఎస్ ఈవీ (ZS EV), కామెట్ ఈవీ (Comet EV) వంటి ఎలక్ట్రిక్ కార్లను.. హెక్టర్, హెక్టర్ ప్లస్, ఆస్టర్ మరియు గ్లోస్టర్ వంటి ఫ్యూయెల్ కార్లను విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ ఎలక్ట్రిక్ స్పోర్ట్ కారును (సైబర్‌స్టర్) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది కూడా తప్పకుండా ఉత్తమ అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

Leave a Comment