MG Motor 100 Years Special Editions: మోరిస్ గ్యారేజ్ లేదా ఎంజీ మోటార్స్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే భారతీయ మార్కెట్లో ఈ కంపెనీకి అధిక ప్రజాదరణ కూడా ఉంది. ఎంజీ మోటార్స్ కంపెనీ లాంచ్ చేసిన కార్లు కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. కంపెనీ ఇప్పటి వరకు లాంచ్ చేసిన కార్ల జాబితాలో పెట్రోల్ కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. కాగా మళ్ళీ ఇప్పుడు నాలుగు స్పెషల్ మోడళ్లను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
స్పెషల్ మోడల్స్
ఎంజీ మోటార్ కంపెనీ తన 100 సంవత్సరాల ఉనికిని పురస్కరించుకుని భారతీయ మార్కెట్లో నాలుగు స్పెషల్ మోడల్స్ లాంచ్ చేసింది. ఇందులో ఎంజీ హెక్టర్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, ఎంజీ ఆస్టర్ మరియు ఎంజీ కామెట్ ఈవీ ఉన్నాయి. ఈ స్పెషల్ మోడల్స్ చూడటానికి స్టాండర్డ్ మోడల్స్ కంటే కొంత భిన్నంగా ఉన్నాయి. ఈ స్పెషల్ మోడల్స్ లిమిటెడ్ ఎడిషన్‌లుగా మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఎన్ని కార్లు అందుబాటులో ఉంటాయి.. అనేదానికి సంబంధించి ఖచ్చితమైన వివరాలు అందుబాటులో లేదు.
ధరలు
ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త స్పెషల్ ఎడిషన్స్ ధరల విషయానికి వస్తే.. ఎంజీ హెక్టర్ ప్రారంభ ధర రూ. 21.2 లక్షలు, ఎంజీ జెడ్ఎస్ ఈవీ ప్రారంభ ధర రూ. 24.18 లక్షలు, ఎంజీ ఆస్టర్ ప్రారంభ ధరలు రూ. 14.81 లక్షలు మరియు ఎంజీ కామెట్ ఈవీ ప్రారంభ ధర రూ. 9.4 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా).
ప్రత్యేకతలు ఇవే..
ఎంజీ మోటార్స్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఎడిషన్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కలర్. ఎంజీ మోటార్స్ యొక్క నాలుగు స్పెషల్ ఎడిషన్స్ ‘బ్రిటీష్ రేసింగ్ గ్రీన్’ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ దీనిని ‘ఎవర్‌గ్రీన్’ అని పిలిచింది. సాధారణ కార్లనుంచి వీటిని వేరు చేయడానికి వెనుకవైపు బ్యాడ్జ్‌లు ఉన్నాయి. ఇంటీరియర్ మొత్తం బ్లాక్ లుక్‌లో ఉన్నాయి. అక్కడక్కగా గ్రీన్ కలర్ హైలెట్స్ మరియు హెడ్‌రెస్ట్‌ల మీద ‘100 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్’ అనే స్టిచ్చింగ్ చూడవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కూడా గ్రీన్ కలర్ థీమ్ పొందుతుంది.
డిజైన్ మరియు ఫీచర్స్
కొత్త ఎంజీ మోటార్స్ స్పెషల్ ఎవర్‌గ్రీన్ ఎడిషన్స్ కొత్త కలర్ ఆప్షన్స్ పొందినప్పటికీ డిజైన్ దాదాపు స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. అయితే 100 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్ అనే బ్యాడ్జ్ చూడవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే.. లోపల గ్రీన్ కలర్ థీమ్ కాకుండా మిగిలిన దాదాపు అన్ని ఫీచర్స్ మునుపటి మోడల్లో ఉన్న మాదిరిగానే ఉన్నాయి. కాబట్టి డిజైన్ మరియు ఫీచర్స్ విషయంలో పెద్దగా మార్పులు లేదా అప్డేట్స్ లేదని తెలుస్తోంది.
ఇంజిన్ & బ్యాటరీ డీటైల్స్
ఎంజీ హెక్టర్ స్పెషల్ ఎడిషన్ అదే ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి పెట్రోల్ ఇంజిన్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది ఐదు, ఆరు, ఏడు సీట్ల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ అదే 50.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 461 కిమీ రేంజ్ అందిస్తుంది. కామెట్ ఈవీ 17.3 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక ఫుల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుంది.
ఎంజీ గ్లోస్టర్ లేదు..
దేశీయ విఫణిలో మంచి ఆదరణ పొందిన ఎంజీ గ్లోస్టర్ ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ రూపంలో అందుబాటులో లేదు. అయితే కంపెనీ దీనిని స్పెషల్ ఎడిషన్ రూపంలో ఎందుకు లాంచ్ చేయలేదు అనే విషయం స్పష్టంగా వెల్లడి కాలేదు. భవిష్యత్తులో లిమిటెడ్ ఎడిషన్ రూపంలో విడుదలవుతుందా? లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది.
Don’t Miss: టాటా రేసర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది..
ఎంజీ మోటార్స్ స్పెషల్ ఎడిషన్ లాంచ్‌పై మా అభిప్రాయం
మారుతున్న ప్రపంచంలో ఆధునిక ఉత్పత్తుల అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో ఎంజీ మోటార్ స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేయడం మంచి నిర్ణయం. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ తప్పకుండా కొత్త కార్లను కొనాలని ఎదురు చూసేవారికి ఓ మంచి ఎంపిక అనే చెప్పాలి.