MG Windsor EV Launched in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ (MG Motors) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన ‘విండ్సర్ ఈవీ’ (Windsor EV) కారును అధికారికంగా లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందుతున్న ఎంజీ మోటార్ ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందినట్లు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర
భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ యొక్క ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో జేఎస్‌డబ్ల్యూ (JSW) కంపెనీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్న తరువాత దేశీయ విఫణిలో లాంచ్ చేసిన మొదటి ఉత్పత్తి లేదా మొదటి ఎలక్ట్రిక్ కారు విండ్సర్ కావడం గమనార్హం.
బుకింగ్స్ మరియు డెలివరీలు
ఎంజీ మోటార్స్ లాంచ్ చేసిన కొత్త విండ్సర్ ఈవీ బుకింగ్స్ 2024 అక్టోబర్ 3 నుంచి అధికారికంగా ప్రారంభమవుతాయి. డెలివరీలు అదే నెలలో (అక్టోబర్ 13) ప్రారంభమవుతాయని సమాచారం. ఎంజీ విండ్సర్ ఈవీ అనేది కంపెనీ యొక్క మూడో ఎలక్ట్రిక్ కారు కావడం గమనించదగ్గ విషయం. ఇప్పటికే జెడ్ఎస్ ఈవీ మరియు కామెట్ ఈవీ రెండూ కూడా ఉత్తమ అమ్మకాలను పొందగలిగాయి. కాబట్టి విండ్సర్ ఈవీ కూడా తప్పకుండా మంచి సేల్స్ పొందుతుందని భావిస్తున్నాము. అయితే టెస్ట్ డ్రైవ్స్ ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతాయి.
వేరియంట్స్ మరియు కలర్ ఆప్షన్స్
ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎసెన్స్ అనే మూడు వేరియంట్లలో లభించే ఎంజీ విండ్సర్ ఈవీ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి స్టార్‌బర్స్డ్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్ మరియు టర్కోయిస్ గ్రీన్ కలర్స్. ఇవన్నీ కూడా చూడచక్కగా.. చూడగానే ఆకర్శించబడే విధంగా ఉంటాయి.
డిజైన్
దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త కొత్త ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు విలాసవంతమైన డిజైన్ పొందుతుంది. చూడటానికి ఇది పెద్ద హ్యాచ్‌బ్యాక్ మాదిరిగా ఉంటుంది. రెండు వరుసల సీటింగ్ పొజిషన్ కలిగిన ఈ కారులో ఐదుమంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.
ఈ కొత్త విండ్సర్ ఈవీ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ముందు భాగంలో వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ లైట్ బార్ ఉన్నాయి. బంపర్ మీద అమర్చబడిన హెడ్‌ల్యాంప్స్ స్టెప్డ్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ పొందుతాయి. రియర్ ప్రొఫైల్ కూడా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. వెనుక కూడా వెడల్పు అంతటా లైట్ బార్ విస్తరించి ఉంటుంది. బ్రాండ్ లోగో మరియు విండ్సర్ అనే అక్షరాలను ఇక్కడ చూడవచ్చు.
ఫీచర్స్
డిజైన్ మాదిరిగానే విండ్సర్ ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉన్నాయి. క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. డ్యాష్‌బోర్డులో పెద్ద 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం చూడవచ్చు. ఇందులో ప్లోటింగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూడవచ్చు. సీటింగ్ పొజిషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సెంట్రల్ స్క్రీన్ కింద హీటింగ్, వెంటిలేషన్ మరియు ఏసీ కంట్రోల్స్ వంటివి ఉన్నాయి.
పవర్డ్ టెయిల్‌గేట్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆరు స్పీకర్లతో ఆడియో సిస్టం మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పనోరమిక్ గ్లాస్ రూప్ వంటివి ఇందులో ఉన్నాయి. మొత్తం మీద వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ ఎంజీ విండ్సర్ ఈవీలో చూడవచ్చు.
బ్యాటరీ & రేంజ్
ఎంజీ విండ్సర్ ఈవీ 38 కిలోవాట్ లిథియం ఐరన్ పాస్పేట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో ఏకంగా 331 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 136 హార్స్ పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో ఎకో, ఎకో ప్లస్, నార్మల్ మరియు స్పోర్ట్స్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి.
Don’t Miss: వాహన ప్రియులకు శుభవార్త.. సరికొత్త హీరో బైక్ వచ్చేసింది: రూ.10000 తక్కువ
కొత్త విండ్సర్ ఈవీ కొనుగోలు చేసేవారికి కంపెనీ బ్యాటరీ మీద లైఫ్‌టైమ్ వారంటీ అందిస్తుంది. అంతే కాకుండా కంపెనీ మొదటి ఏడాది ఫ్రీ పబ్లిక్ ఛార్జింగ్ కూడా అందిస్తుంది.కాబట్టి ఈ కారు కొనుగోలుదారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉండటమే కాకుండా.. కంపెనీ అందించే కొన్ని ఆఫర్స్ కూడా పొందవచ్చు.