Mumbai To Dubai In Only Two Hours High Speed Train Project: భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతూనే ఉంది. చాలామంది అమెరికా, ఆస్ట్రేలియా మరియు దుబాయ్ వంటి దేశాలకు పయనమవుతుంటారు. అంటే ఇండియా నుంచి దుబాయ్ వెళ్లి వస్తున్నవారు కూడా ఎక్కువే ఉన్నారని తెలుస్తుంది. భారత్ (ముంబై) నుంచి దుబాయ్ ఎలా వెళ్లాలి? అని ఎవరినైనా అడిగితే.. ఇంకెలా వెళ్ళాలి విమానంలోనే వెళ్ళాలి అని చెబుతారు. ఎంతసేపు ప్రయాణించాలని అడిగితే.. సుమారు నాలుగు గంటలు ఉంటుందని చెబుతారు. ఇవన్నీ నిజమే.. కానీ ఇండియా నుంచి దుబాయ్ చేరుకోవడానికి కేవలం రెండు గంటల సమయం మాత్రమే పడుతుందంటే.. నమ్ముతారా? వినడానికి ఇది కొంత కొత్తగా అనిపించినా.. ఇది నిజమే. దీని గురించి వివరంగా ఈ కథనంలో చూసేద్దామా..
అండర్ వాటర్ జర్నీ
ముంబై నుంచి దుబాయ్ వెళ్లాలంటే సుమారు 2000 కిమీ ప్రయాణించాలి. అంత దూరం ప్రయాణాన్ని కేవలం రెండు గంటల్లో సాధ్యం చేయడానికి కావలసిన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది విమానంలో మాత్రం కాదు. అండర్ వాటర్ జర్నీ. ఈ ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే వేగవంతం అయ్యాయి.
సమయాన్ని ఆదాయ చేయడానికి.. అద్భుతనమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి హై స్పీడ్ ట్రైన్ ఒకటి సిద్దమవుతోంద్. యూఏఈ నేషనల్ అడ్వైజర్ బ్యూరో ప్రకారం.. ఈ ట్రైన్ ప్రయాణానికి కావలసిన నీటి అడుగున రైలు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది పూర్తయితే రెండు గంటల్లో ముంబై నుంచి దుబాయ్ చేరుకోవచ్చు.
గంటకు 600 కిమీ – 1000 కిమీ స్పీడ్
ముంబై నుంచి దుబాయ్ చేరుకోవడానికి సిద్దమవుతున్న రైలు మార్గం అరేబియా సముద్రం లోపల నిర్మితమవుతుంది. అంటే ప్రయాణికులు సముద్ర గర్భంలో ప్రయాణించాల్సి ఉంది. 2000 కిమీ దూరాన్ని చేరుకోవడానికి సిద్దమవుతున్న.. ఈ హై స్పీడ్ ట్రైన్ టాప్ స్పీడ్ గంటకు 600 కిమీ నుంచి 1000 కిమీ కావడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఈ ట్రైన్ ఎంత వేగంగా ప్రయాణిస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
నిజానికి ముంబై టూ దుబాయ్ అండర్ వాటర్ ప్రాజెక్టు చాల రోజుల కిందటే మొదలైంది. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఆమోదాల్లో ఆలస్యం జరిగింది. దీనికోసం ప్రస్తుతం భారత్ మరియు దుబాయ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే 2030 నాటికి ఈ హై స్పీడ్ రైలులో రెండు గంటల్లో దుబాయ్ చేరుకోవచ్చు.
Also Read: ఉక్రెయిన్‌లో మోదీ 20 గంటలు ప్రయాణించిన ట్రైన్ ఇదే.. విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
దీని వల్ల ఉపయోగాలు ఏమిటంటే?
➤ఇండియా టూ దుబాయ్ చేరుకోవడానికి విమానం మార్గమే సులభం. కాబట్టి అందరూ ఈ మార్గాన్నే ఎంచుకోవడం వల్ల విమాన ప్రయాణం రద్దీ అవుతుంది. అండర్ వాటర్ ట్రైన్ ప్రారంభమైతే.. ఈ రద్దీ తగ్గుతుంది.
➤కేవలం ప్రజల రవాణాకు మాత్రమే కాకుండా.. ఎగుమతులు, దిగుమతులకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
➤ప్రత్యేకించి దుబాయ్ చేరుకునే ప్రజలకు మాత్రమే కాకుండా.. అండర్ వాటర్ ప్రయాణ అనుభూతిని పొందాలనుకే వారు కూడా దీనిని ఎంచుకునే అవకాశం ఉంది. అంటే పర్యాటకంగా కూడా ఇది ఉపయోగపడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.