Naga Chaitanya and Sobhita Enjoy A Thrilling Track Day: తండేల్ సినిమా కంటే ముందు నుంచి అక్కినేని నాగ చైతన్య ఏదో ఒక వార్తలో వినిపిస్తూనే ఉన్నారు. శోభిత ధూళిపాళతో వివాహనమైన తరువాత వీరిరువురి పేర్లు మరింత జోరుగా వినిపించసాగాయి. ఇప్పుడు తాజాగా ఈ జంట మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ అని పిలువబడుతున్న ‘మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‘ (MMRT)లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే.. శోభిత కూడా రేసింగ్ కారు డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది.
నాగ చైతన్యకు స్పోర్ట్స్ కార్లు అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఇతని వద్ద అన్యదేశ్య సూపర్ కార్లు ఉన్నాయి. నాగ చైతన్య తన పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్ కారులో కూర్చుకుని ఉండగా.. శోభిత ఆ కారుకు దగ్గరగా నిలబడి పోజులివ్వడం చూడవచ్చు. మరో ఫోటోలో శోభిత స్టీరింగ్ పట్టుకుని ఉండటం చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సమంతకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
శోభిత ధూళిపాళను.. నాగ చైతన్య డిసెంబర్ 2024లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు కొంతమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా పెళ్లి తరువాత నాగ చైతన్య తండేల్ సినిమా గొప్ప సక్సెస్ సాధించింది. ఈ సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటేసింది.
నాగ చైతన్య పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్
నిజానికి నటుడు నాగ చైతన్య ఈ పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్ కారును మే 2024లో కొనుగోలు చేసాడు. దీని ధర రూ. 3.5 కోట్లు (ఎక్స్ షోరూమ్) అని తెలుస్తోంది. ఎక్కువమంది రేసింగ్ చేయడానికి ఇష్టపడేవారు ఇలాంటి కార్లను కొనుగోలు చేస్తారు. ఇలాంటి కారు బహుశా హైదరాబాద్ నగరంలో నాగ చైతన్య దగ్గర తప్పా వేరే ఎవరిదగ్గరా లేదని తెలుస్తోంది.
చూడటానికి అద్భుతంగా ఉన్న పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్ కారు ఫోర్ లీటర్, సిక్స్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 518 Bhp పవర్, 468 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 296 కిమీ కావడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. ఈ కారు ఎంత వేగంగా వెలగలదో తెలుస్తుంది.
Also Read: మొన్న నాగార్జున.. నేడు శ్రద్దా కపూర్: సెలబ్రిటీల మనసు దోచేస్తున్న కారు
ఈ కారును కొనుగోలు చేసిన తరువాత.. అక్కినేని నాగ చైతన్య పోర్స్చే సెంటర్ చెన్నై నుంచి డెలివరీ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ కారు ఎంతోమంది వాహన ప్రేమికులను మాత్రమే కాకుండా.. నాగ చైతన్య అభిమానులను కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు నాగ చైతన్య దంపతులు ఈ కారుతో కనిపించడంతో అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
నాగ చైతన్య గ్యారేజిలో కార్లు
అక్కినేని నాగ చైతన్యకు కార్లన్నా.. బైకులన్నా.. చాలా ఇష్టం. ఈ కారణంగానే అతని గ్యారేజిలో ఖరీదైన వాహనాలు ఉన్నాయి. జాబితాలో మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ, పోర్స్చే 911, రేంజ్ రోవర్ వోగ్, ఫెరారీ 488 జీటీబీ మరియు పోర్స్చే జీటీ3 ఆర్ఎస్ కూడా ఉన్నాయి. ఎంవీ అగస్టా ఎఫ్4, బీఎండబ్ల్యూ ఆర్ నైన్‌టీ, ట్రయంఫ్ థ్రక్స్‌టన్ ఆర్ వంటి ఖరీదైన బైకులు ఉన్నాయి.
View this post on Instagram