Mega DSC Notification Soon in AP: మెగా డిఎస్సీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు.. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ‘నారా లోకేష్‘ (Nara Lokesh) శుభవార్త చెప్పారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో.. ఎంఎల్ఏల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. 16,347 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే.. ఇప్పటికే పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థులు మరింత గట్టిగా ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. ఎందుకంటే పోటీ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.
మార్చి నెలలో డిఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి.. ప్రభుత్వం సర్వత్రా సిద్దమవుతున్నట్లు సమాచారం. మొత్తం 16,347 పోస్టులలో.. 6371 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 7725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1781 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు, 52 ప్రిన్సిపాల్ పోస్టులు మరియు 132 పీఈటీ పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులకు భర్తీ చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే.. మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. చెప్పినట్లుగానే.. నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. కానీ నోటిఫికేషన్ జారీకి సంబంధించిన తేదీ వంటివి ప్రకటించలేదు. బహుశా ఈ నెలలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే.. డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు పండుగే అని చెప్పాలి.
మెగా డిఎస్సీని ప్రకటించి.. వచ్చే ఏడాది నాటికి పోస్టింగ్ వంటివి కూడా ఇవ్వనున్నట్లు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పలుమార్లు వెల్లడించారు. ఇప్పుడు నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి వ్యాఖ్యానించారు.
ఇతర కార్యక్రమాలు
డిఎస్సీ నోటిఫికేషన్ గురించి మాత్రమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మాణానికి రూ. 3,000 కోట్లు అవసమని మంత్రి లోకేష్ తెలిపారు. ‘మన బడి – మన భవిష్యత్’ కార్యక్రమంలో భాగంగా.. దశలవారీగా నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో సమయంలో.. స్టార్ రేటింగ్‌ల ఆధారంగా పాఠశాల సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రణాళికలను చేపట్టనున్నారు. పాఠశాలల్లో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడానికి సంకల్పించారు.
Also Read: మహా కుంభమేళా మళ్ళీ ఎప్పుడో తెలుసా?.. అంతకంటే ముందు ఏం జరుగుతుందంటే..
రాష్ట్రంలో మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కోవడానికి.. ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభించింది. దీనికి ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అని పేరుపెట్టారు. ఈ చొరవతో భాగంగా విద్యార్థులు మరకద్రవ్యాలకు (డ్రగ్స్) దూరంగా ఉండటానికి.. ప్రతి పాఠశాలలోనూ ఈగల్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు.
ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయడానికి.. మరోవైపు పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మెగా డిఎస్సీతో పాటు.. ఇతర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా జారీచేసే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు.. ఏ నోటిఫికేషన్ జారీ చేస్తుందనే విషయం మాత్రం వెల్లడి కావాల్సి ఉంది. ఏది ఏమైనా.. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినా పరీక్ష రాయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. కాబట్టి యుద్దానికి సిద్దమైన సైనికుడిగా అభ్యర్థి సిద్ధమవ్వాలి.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీగోడల నిర్మాణం, నాడు-నేడు అక్రమాలు, డ్రగ్స్ నివారణపై సభ్యులు అడిగిన ప్రశ్నకు శాసనసభలో సమాధానం ఇచ్చాను. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి ప్రహరీగోడల నిర్మాణానికి రూ.3వేల కోట్లు అవసరం. ఉపాధి హామీ, మన బడి- మన భవిష్యత్తు నిధుల కన్వర్జెన్స్ తో… pic.twitter.com/LVs7zuT2O6
— Lokesh Nara (@naralokesh) March 3, 2025