Neeraj Chopra Car and Bike Collection: 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల ‘జావెలిన్ త్రో’ పోటీల్లో గోల్డ్ మెడల్ అందుకున్న ‘నీరజ్ చోప్రా’ (Neeraj Chopra) 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో కూడా అత్యుత్తమ ప్రతిభను కనపరిచాడు. క్రీడా రంగంలో తనదైన రీతిలో ముంచుకు సాగుతున్న నీరజ్ విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తారు.
నీరజ్ చోప్రా ఉపయోగించే వాహనాలు
మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700)
నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ అందుకున్న తరువాత.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేకమైన ఎక్స్‌యూవీ700 కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ కారు ఇతర ఎక్స్‌యూవీ700 కార్ల కంటే కూడా కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. లోపల గోల్డ్ కలర్ స్టిచ్చింగ్, జావెలిన్ త్రో చిత్రం వంటివి ఇందులో ఉన్నాయి. ఇది నీరజ్ చోప్రా కోసం ప్రత్యేకంగా తయారుచేయబడింది. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా మిగిలిన డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటివి స్టాండర్డ్ మోడల్‌లో ఉన్న మాదిరిగానే ఉన్నాయి. కాబట్టి ఈ కారు ధరలు రూ. 15.85 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య వరకు ఉన్నాయి.
రేంజ్ రోవర్ వేలార్ (Range Rover Velar)
నీరజ్ చోప్రా రేంజ్ రోవర్ కంపెనీకి చెందిన వేలార్ కారును కలిగి ఉన్నారు. దీని ధర రూ. 90 లక్షలు (ఎక్స్ షోరూమ్) . ఈ కారును చోప్రా హర్యానాలోని ల్యాండ్ రోవర్ షోరూమ్ నుంచి కొనుగోలు చేశారు. ఎక్కువమంది సినీతారలు, ప్రముఖ సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే ఈ కారును నీరజ్ చోప్రా కూడా కొనుగోలు చేశారు.
రేంజ్ రోవర్ వేలార్ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ (2.0 లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్) 247 Bhp, 365 Nm టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ (2.0 లీటర్ డీజిల్) 201 Bhp మరియు 365 Nm టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్స్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతాయి.
ఫోర్డ్ మస్టాంగ్ జీటీ (Ford Mustang GT)
నీరజ్ చోప్రా వద్ద ఉన్న కార్లలో చెప్పుకోదగ్గ కారు ఫోర్డ్ కంపెనీకి చెందిన మస్టాంగ్ జీటీ. ప్రస్తుతం ఫోర్డ్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయినప్పటికీ చాలామంది వాహన ప్రేమికులు ఈ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు. మస్టాంగ్ జీటీ ధర రూ. 70 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది 5.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 396 Bhp పవర్ మరియు 515 Nm టార్క్ అందిస్తుంది.
టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner)
రోజువారీ వినియోగానికి ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే టయోటా కంపెనీ యొక్క ఫార్చ్యూనర్ కూడా నీరజ్ చోప్రా గ్యారేజిలో ఉంది. ఫార్చ్యూనర్ కారును డ్రైవ్ చేస్తూ చోప్రా పలు సందర్భాల్లో కనిపించారు దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వున్నాయి. చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే దీనిని చాలామంది ఇష్టపడి కొనుగోలు చేస్తారు. ఈ కారు ధర మార్కెట్లో రూ. 33 లక్షల నుంచి రూ. 51 లక్షల మధ్య ఉంది.
మహీంద్రా థార్ (Mahindra Thar)
భారతదేశంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఇష్టమైన కారు ఏదైనా ఉంది అంటే అది తప్పకుండా మహీంద్రా యొక్క థార్ అనే చెప్పాలి. ఈ కారు నీరజ్ చోప్రా వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు యొక్క డిజైన్ ఎంతోమంది వాహన ప్రేమికులను ఒక్క చూపుతోనే కట్టిపడేస్తుంది. ఇది రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడింగ్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మహీంద్రా థార్ ధరలు ఇండియన్ మార్కెట్లో రూ. 14.32 లక్షల నుంచి రూ. 21.90 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. థార్ త్వరలోనే 5 డోర్ రూపంలో కూడా లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది.
Don’t Miss: గేమ్ చేంజర్ నటి ‘కియారా అద్వానీ’ ఉపయోగించే కార్లు ఇవే.. మీకు తెలుసా?
ఈ కార్లు మాత్రమే కాకుండా.. నీరజ్ చోప్రా వద్ద రేంజ్ రోవర్ స్పోర్ట్ కారు, ఖరీదైన ‘హార్లే డేవిడ్‌సన్ 1200 రోడ్‌స్టర్’ బైక్, బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆటలంటే ఇష్టపడే నీరజ్ చోప్రా ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా అని స్పష్టంగా అర్థమైపోతోంది.