New Honda Dio 125 Launched in India: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్.. ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన బైకులు, స్కూటర్లను లాంచ్ చేసి అత్యంత ప్రజాదరణ పొందుతుంది. బ్రాండ్ యొక్క అధిక అమ్మకాలు పొందిన స్కూటర్ డియో.. ఇప్పుడు ఆధునిక హంగులతో దేశీయ విఫణిలో లాంచ్ అయింది. ఈ అప్డేటెడ్ హోండా డియోలోని లేటెస్ట్ ఫీచర్స్ ఏమిటి?, ధర ఎంత అనే మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.
సరికొత్త హోండా డియో
కంపెనీ ఇప్పుడు హోండా డియో 125ను ఓబీడీ2బీ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేసింది. ఇందులో 4.2 ఇంచెస్ TFT డిస్‌ప్లే ఉంది. ఇది బ్రాండ్ యొక్క ఇతర కమ్యూటర్ మోడళ్ల మాదిరిగానే అప్డేట్స్ పొందుతుంది. ఈ స్కూటర్ యాక్టివా 125 మాదిరిగానే అదే ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది.
డియో 125 అప్డేటెడ్ స్కూటర్.. దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే.. అదే 124 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.3 హార్స్ పవర్ మరియు 10.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అంతే కాకుండా.. ఈ స్కూటర్ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నాలజీని కూడా పొందుతుంది. ఈ టెక్నాలజీ కొంత ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. అయితే ఇది ఆధునిక ఉద్గార నిబంధనలను అనుగుణంగా అప్డేట్ అయింది.
కలర్ ఆషన్స్ మరియు ధరలు
కొత్త హోండా డియో 125 స్కూటర్ మొత్తం ఐదు రంగులలో లభిస్తుంది. అవి మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ స్పోర్ట్స్ ఎల్లో, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ మరియు ఇంపీరియర్ రెడ్. ఈ స్కూటర్ బేస్ వేరియంట్ ధర రూ. 96,749 మరియు హెచ్ స్మార్ట్ వేరియంట్ ధర రూ. 1.02 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్ షోరూమ్). ఈ ధరలు స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా వరుసగా రూ. 8798 మరియు రూ. 7294 ఎక్కువ.
డియో 125 అప్డేటెడ్ మోడల్ యొక్క TFT.. బైక్ గురించి చాలా సమాచారం అందిస్తుంది. ఇది రోడ్‌సింక్ డియో యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు జతచేయడానికి అనుమతిస్తుంది. న్యావిగేషన్ అలర్ట్స్, కాల్స్ మరియు మెసేజ్ నోటిఫికేషన్స్ వంటివి స్మార్ట్‌ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. టాప్ వేరియంట్ కీలెస్ ఇగ్నిషన్ పొందుతుంది. USB-C ఛార్జర్ అనేది రెండు వేరియంట్లలోనూ లభిస్తుంది.
Also Read: సరికొత్త 2025 స్కోడా కొడియాక్ ఇదే: ఈ కారు రేటెంతో తెలుసా?
హోండా డియో సేల్స్
భారతదేశంలో హోండా డియో లాంచ్ అయినప్పటి నుంచి ఏకంగా 30 లక్షల కంటే ఎక్కువ సేల్స్ పొందినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ఇండియన్ మార్కెట్లో ఈ బండికి అధిక డిమాండ్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మంచి డిజైన్, వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల దీని అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ఈ స్కూటర్ లేటెస్ట్ అప్డేట్స్ పొందటం వల్ల ఇది మరింత మంచి అమ్మకాలు పొందుతుందని కంపెనీ భావిస్తోంది. అయితే ఎలాంటి అమ్మకాలు పొందుతుందనే విషయం తెలుసుకోవాలంటే.. ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.