New Launches For 2024: విడుదలకు సిద్దమవుతున్న కొత్త కార్లు – ఇవే!

New Launches in 2024 Skoda To Volkswagen: 2023 మరి కొన్ని రోజుల్లో ముగుస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లెక్కకు మించిన వాహనాలను మార్కెట్లో లాంచ్ చేసిన కంపెనీలు ఇప్పుడు వచ్చే ఏడాదిలో కొత్త కార్లను విడుదల చేయడానికి ఉవ్విల్లూరుతున్నాయి. ఈ కథనంలో 2024లో విడుదలకానున్న కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

స్కోడా సూపర్బ్ (Skoda Superb)

బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా నిలిచిపోయిన స్కోడా సూపర్బ్ 2024ప్రారంభంలో దేశీయ మార్కెట్లో మళ్ళీ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఇందులో అప్డేటెడ్ 2.0 లీటర్ టీఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పరిచయం చేయనుంది. ఈ కారు భారతదేశంలో స్థానికంగా అసెంబుల్ చేయబడే అవకాశం లేదు. కాబట్టి సిబియూ మార్గం ద్వారా దిగుమతి అయ్యే అవకాశం ఉంటుంది.

లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్,360 డిగ్రీ కెమెరా, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడాప్టివ్ ఛాసిస్ కంట్రోల్ టెక్, యాక్టివ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి ADAS వంటి కొత్త ఫీచర్‌లతో రానున్న ఈ కారు ధర సుమారు రూ. 50 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం.

స్కోడా ఎన్యాక్ ఐవీ (Skoda Enyaq iV)

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న మరో స్కోడా కారు ‘ఎన్యాక్ ఐవీ’. ఇది వచ్చే ఏడాది మధ్య నాటికి భారతీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 55 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఎన్యాక్ ఐవీ అనేది భారతదేశంలో స్కోడా యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఆఫర్ అవుతుంది. ఇది కూడా CBU మార్గం ద్వారా దేశంలోకి దిగుమతి అయ్యే అవకాశం ఉంది.

స్కోడా ఎన్యాక్ ఐవీ 77 కిలోవాట్ బ్యాటరీ కలిగి..కేవలం 6.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి.

కొత్త స్కోడా కొడియాక్ (New Skoda Kodiaq)

2024 చివరి నాటికి రూ. 50 లక్షల ధర వద్ద విడుదలకానున్న కొత్త స్కోడా కొడియాక్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా, పరిమాణంగా కొంత పెద్దదిగా ఉంటుంది. డైజిన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉందనున్న ఈ కారు ఎక్కువ బూట్ స్పేస్ పొందుతుందని సమాచారం.

 

కొత్త స్కోడా కోడియాక్ 2.0 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మరియు మైల్డ్-హైబ్రిడ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌లను కలిగి ఉంది. డీజిల్ ఆటోమేటిక్ పూర్తిగా 4×4 సిస్టమ్ ఎంపికను పొందుతుంది. అయితే ఇది ఏ పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్‌ను పొందుతుందనే దానిపై ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇది CKD ద్వారా దిగుమతయ్యే అవకాశం ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.4 (Volkswagen iD.4)

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కార్ల జాబితాలో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన ‘ఐడీ’ ఉంది. ఇది 2024 మధ్యలో ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 55 లక్షల వరకు ఉండవచ్చు. ఐడీ.4 అనేది భారతదేశం కోసం ఫోక్స్‌వ్యాగన్ లాంచ్ చేయనున్న మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ మోడల్. ఇది కూడా భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి చేయబడే అవకాశం లేదు.కాబట్టి దీనిని కూడా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.4 కారులో ముందు యాక్సిల్‌లో ఒక ఎలక్ట్రిక్ మోటారు మరియు వెనుకవైపు ఒక ఎలక్ట్రిక్ మోటారును ఉంటుంది. ఈ రెండు కలిపి 299 హార్స్ పవర్ మరియు 460 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ చార్జితో ఏకంగా 480 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉందని సమాచారం.

Don’t Miss: దేశంలో అతి తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు – రూ.1.40 లక్షల డిస్కౌంట్ కూడా..

కంపెనీ గత రెండేళ్లుగా భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతూనే ఉంది. మొత్తానికి సంస్థ వచ్చే ఏడాది నాటికి దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఫోక్స్‌వ్యాగన్ యొక్క ఇండియా 3.0 ప్లాన్‌తో తీసుకురాబడుతుందని సమాచారం.