మారుతి ప్రియులకు గుడ్ న్యూస్.. మొదలైన కొత్త ‘స్విఫ్ట్’ బుకింగ్స్

Maruti Swift Bookings Open: గత కొన్ని రోజుల నుంచి ‘మారుతి సుజుకి’ తన కొత్త ‘స్విఫ్ట్’ కారును లాంచ్ చేస్తుందని అని తెలుసుకుంటూనే ఉన్నాము. అయితే కంపెనీ ఈ కారును లాంచ్ చేయడానికి ముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మారుతి స్విఫ్ట్ బుక్ చేసుకోవడానికి టోకెన్ మొత్తం ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బుకింగ్ ప్రైస్ & లాంచ్ డేట్

చాలా రోజుల నుంచి భారతీయ మార్కెట్లో టెస్టింగ్ దశలోనే ఉన్న మారుతి స్విఫ్ట్.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. మే 9న అధికారికంగా లాంచ్ కానున్న ‘మారుతి స్విఫ్ట్’ (Maruti Swift) కోసం కస్టమర్లు రూ. 11000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. కొత్త స్విఫ్ట్ కారును బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా డీలర్‌షిప్‌ వద్ద బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు లాంచ్ తరువాత ప్రారంభమవుతాయి.

త్వరలో లాంచ్ కానున్న కొత్త మారుతి స్విఫ్ట్, దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న నాల్గవ జనరేషన్ మోడల్ అని తెలుస్తోంది. నిజానికి కంపెనీ భారతీయ విఫణిలో స్విఫ్ట్ కారును లాంచ్ చేసినప్పటి నుంచి.. ఇప్పటి వరకు గొప్ప అమ్మకాలను పొందుతోంది. కాగా త్వరలోనే ఆధునిక హంగులతో కొత్త తరం కారును లాంచ్ చేయనుంది. ఇది కూడా తప్పకుండా మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉందని సమాచారం.

డిజైన్

విడుదలకు సిద్దమవుతున్న కొత్త తరం మారుతి స్విఫ్ట్ అప్డేటెడ్ డిజైన్ చూపరులను తప్పకుండా ఆకర్షిస్తుంది. కొత్త బంపర్, లేటెస్ట్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉంటాయి. అంతే కాకుండా ఈ కారు దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంచెం పొడవుగా ఉంటుంది. హెడ్‌లైట్స్‌ మధ్యలో బ్రాండ్ లోగో ఉండటం ఇక్కడ గమనించవచ్చు. రియర్ ప్రొఫైల్ కూడా కొన్ని అప్డేట్స్ పొంది ఉంటుందని సమాచారం.

ఫీచర్స్

కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ఇంటీరియర్ డిజైన్ కొత్తగా ఉంటుంది. ఇది కొంత మారుతి బాలెనొ మరియు ఫ్రాంక్స్‌ వంటివాటిని తలపిస్తుందని సమాచారం. కొత్త డ్యాష్‌బోర్డ్ ప్యానెల్, 9.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా టోగుల్ స్విచ్‌లతో HVAC కంట్రోల్స్, స్టీరింగ్ వేల మరియు డోర్స్ వంటి వాటి మీద కొన్ని కంట్రోల్ బటన్స్ ఉన్నాయి.

ఇంజిన్

2024 మారుతి సుజుకి స్విఫ్ట్ సరికొత్త 1.2 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 90 హార్స్ పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తాయని సమాచారం. ఖచ్చితమైన గణాంకాలు తెలియాల్సి ఉంది. ఈ కొత్త వెర్షన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్ వంటి వాటిని పొందుతుందని తెలుస్తోంది. అయితే ఆటోమాటిక్ కూడా కొనసాగుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్‌కి గేర్‌బాక్స్‌ను జత చేస్తుందా.. అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇది తప్పకుండా మంచి పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

సేఫ్టీ ఫీచర్స్

భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు ఉన్న మారుతి స్విఫ్ట్.. సేఫ్టీ పరంగా అంత ఆశాజనకంగా లేదు. కానీ రాబోయే కొత్త జనరేషన్ స్విఫ్ట్ మాత్రం తప్పకుండా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఈ మోడల్ క్రాష్ టెస్టులో మంచి స్కోరింగ్ సాధించింది. కాబట్టి ఇండియన్ మార్కెట్లో కూడా ఈ కారు తప్పకుండా మంచి స్కోర్ చేస్తుందని భావిస్తున్నాము. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ ఎన్నో లభించనున్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

Don’t Miss: మహీంద్రా లాంచ్ చేసిన కొత్త కారు ఇదే.. ధర వివరాలు ఇక్కడ చూడండి

అంచనా ధర

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి స్విఫ్ట్ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ దీని ధర రూ. 6.24 లక్షల నుంచి రూ. 8.83 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని సమాచారం. బహుశా ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఖరీదైనదిగా ఉంటుందని భావిస్తున్నాము. ఈ కొత్త కారు దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగో మరియు సిట్రోయెన్ సీ3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుందని సమాచారం.