ఒబెన్ రోర్ మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఇదే.. ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Oben Rorr EZ launched in India: ఓ బైక్ కొనాలంటే కనీసం రూ. లక్ష కంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిందే. ఇలాంటి సమయంలో ఒబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) మార్కెట్లో రూ. 89,999 ఎక్స్-షోరూమ్ ధర వద్ద తన రెండవ ఎలక్ట్రిక్ బైకును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కొత్త బైక్ పేరు ‘రోర్ ఈజెడ్’ (Rorr EZ). దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

బ్యాటరీ ఆప్షన్స్

మార్కెట్లో ఒబెన్ ఎలక్ట్రిక్ యొక్క రోర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ మూడు బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. అవి 2.6 కిలోవాట్, 3.4 కిలోవాట్ మరియు 4.4 కిలోవాట్. ధర అనేది ఎంచుకునే బ్యాటరీ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. రేంజ్ అనేది కూడా బ్యాటరీ ఆప్షన్ మీదనే ఆధారపడి ఉంటుంది.

ఎలక్ట్రిక్ బైక్ రేంజ్

ఒబెన్ రోర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న స్టాండర్డ్ రోర్ బైకు మాదిరిగానే ఉంటుంది. అదే రైడింగ్ మోడ్స్ (ఎకో, సిటీ, హవోక్) కొత్త బైకులో కూడా ఉంటాయి. సిటీ మోడ్ ఎంచుకున్నప్పుడు ఒబెన్ రోర్ ఈజెడ్ యొక్క 2.6 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ 80 కిమీ రేంజ్, సిటీ మోడ్‌లో 60 కిమీ రేంజ్, హవోక్ మోడ్‌లో 50 కిమీ రేంజ్ అందిస్తుంది.

3.4 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఒబెన్ రోర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ ఎకో మోడ్‌లో 110 కిమీ రేంజ్, సిటీ మోడ్‌లో 90 కిమీ రేంజ్, హవోక్ మోడ్‌లో 70 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక చివరగా 4.4 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ ఎకో మోడ్‌లో 140 కిమీ రేంజ్, సిటీ మోడ్‌లో 110 కిమీ రేంజ్, హవోక్ మోడ్‌లో 90 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఛార్జింగ్ టైమ్

కొత్త ఒబెన్ రోర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు ధరతోనే స్టాండర్డ్ ఛార్జర్ లేదా ఆప్షనల్ ఫాస్ట్ ఛార్జర్ పొందే అవకాశం ఉంది. ఛార్జింగ్ విషయానికి వస్తే.. నార్మల్ ఛార్జర్ లేదా స్టాండర్డ్ ఛార్జర్ 2.4 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ ఛార్జ్ కావడానికి 4 గంటలు, 3.5 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ ఛార్జ్ కావడానికి 5 గంటలు మరియు 4.4 కిలోవాట్ బ్యాటరీ ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది.

ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 2.4 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ 45 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. 3.4 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ ఛార్జ్ కావడానికి 1:30 గంటల సమయం పడుతుంది. 4.4 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ 2 గంటల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది.

కర్బ్ వెయిట్ ఎంతంటే?

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. మూడు వేరియంట్లు 7.5 కేడబ్ల్యు మోటారు ద్వారా 52 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మోటార్‌సైకిల 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 95 కిమీ/గం. ఒబెన్ రోర్ ఈజెడ్ కర్బ్ వెయిట్ బ్యాటరీ ప్యాక్‌లను బట్టి మారుతూ ఉంటుంది. 2.6 కిలోవాట్ వేరియంట్ బరువు 138 కేజీలు కాగా.. 3.4 కిలోవాట్ వేరియంట్ బరువు 143 కేజీలు, 4.4 కిలోవాట్ బ్యాటరీ బరువు 148 కేజీల వరకు ఉంటుంది.

ధరలు

ఒబెన్ రోర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ ధరల విషయానికి వస్తే.. 2.6 కిలోవాట్ వేరియంట్ లేదా బేస్ వేరియంట్ ధర రూ. 89,999, మిడ్ స్పెక్ వేరియంట్ లేదా 3.4 కిలోవాట్ వేరియంట్ ధర రూ. 99,999 మరియు టాప్ స్పెక్ వేరియంట్ లేదా 4.4 కిలోవాట్ వేరియంట్ ధర రూ. 1.10 లక్షల మధ్య ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).

Don’t Miss: రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఇవే.. మైండ్ బ్లోయింగ్ చేస్తున్న ఫోటోలు

మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరాలైన.. బైకుల ధరలైన కొంత ఎక్కువే ఉన్నాయి. అయితే ఒబెన్ రోర్ ఈజెడ్ అనేది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. మంచి రేంజ్ కూడా అందిస్తోంది. కాబట్టి ఇది తప్పకుండా మార్కెట్లో మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే ఎలాంటి అమ్మకాలు పొందుతుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.