Tamannaah Bhatia Spotted In Range Rover Velar In Mumbai: మిల్కీ బ్యూటీ ‘తమన్నా భాటియా’ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ అమ్మడు.. ఓదెల-2 సినిమాలో నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 17న తెరమీదకు రానుంది. అంతకంటే ముందు ఈమె ఓ ఖరీదైన కారులో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈమె కనిపించిన కారు ఏది?, దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
తమన్నా కొత్త కారు.. ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ‘రేంజ్ రోవర్ వెలార్’ (Land Rover Range Rover Velar) అని తెలుస్తోంది. దీని ధర రూ. 87.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే అనేక ఖరీదైన కార్లను కలిగి ఉన్న తమన్నా గ్యారేజిలో ఇప్పుడు ఈ ఖరీదైన కారు చేరింది. 35 ఏళ్ల ఈ నటి మొత్తం ఆస్తి సుమారు రూ. 120 కోట్ల కంటే ఎక్కువే అని సమాచారం.
ఓడెల 2 సినిమా మూవీ ట్రైలర్ లాంచ్ కావడానికి ముందే కొత్త కారులో ముంబైలోని శ్రీ బాబుల్‌నాథ్ మందిర్ అనే ఆలయానికి వెళ్లి, ప్రార్థనలు చేసింది. ఈ కారు హీరోయోస్ గ్రే కలర్‌లో 20 ఇంచెస్ వీల్స్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్
భారతదేశంలో ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్ బ్రాండ్లలో ల్యాండ్ రోవర్ కూడా ఒకటి. కంపెనీ సెప్టెంబర్ 2023లో ఇండియన్ మార్కెట్లో తన 2024 రేంజ్ రోవర్ వెలార్ కారును లాంచ్ చేసింది. ఇది ట్రిమ్‌లో.. రెండు వేరియంట్లలో (డీ200 మరియు పీ250) అందుబాటులో ఉంది. డీ200 వేరియంట్ డీజిల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. పీ250 మోడల్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. తమన్నా పెట్రోల్ వేరియంట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
2024 రేంజ్ రోవర్ వెలార్ కారు.. అప్డేటెడ్ గ్రిల్, సొగసైన టెయిల్ ల్యాంప్, పెద్ద రియర్ ఓవర్‌హ్యాంగ్, కొత్త పిక్సెల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటివి పొందుతుంది. ఐదు రంగులలో లభించే ఈ కారు.. అద్భుతమైన క్యాబిన్ పొందుతుంది. ఇందులో 11.4 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటితో పాటు.. ప్రీమియం లెదర్ అపోల్స్ట్రే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, మసాజ్, హీటింగ్ మరియు కూలింగ్‌తో కూడిన 20 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డైవర్ మెమొరీ సెట్టింగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ మొదలైనవి ఉన్నాయి.
Also Read: సంచలన విషయాలు బయటపెట్టిన పూజా హెగ్డే: లక్షలు ఖర్చు పెట్టి తిట్టించారు
రేంజ్ రోవర్ వెలార్ కారులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ 201 Bhp పవర్, 430 Nm టార్క్ అందిస్తుంది. ఇది 8.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇక 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 296 Bhp పవర్ మరియు 400 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం 7.5 సెకన్లు మాత్రమే. రెండు ఇంజిన్లు 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తాయి.
తమన్నా భాటియా కార్ కలెక్షన్
నటి తమన్నా భాటియా గ్యారేజిలో అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇందులో ఆడి క్యూ7, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, బీఎండబ్ల్యూ 320ఐ, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ మరియు పజెరో స్పోర్ట్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వెలార్ కారు కూడా చేరింది.