Ola Electric: కేవలం రూ. 69999లకే ఎలక్ట్రిక్ స్కూటర్.. డోంట్ మిస్

Ola S1 X Price Starting At Rs.69999: భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ప్రారంభం ఉంచి మంచి ప్రజాదరణ పొందుతూ.. ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో దూసుకెళ్తున్న ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) ఇప్పుడు అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ అందించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.

గత కొంత కాలంగా చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుకుంటూ పోతూ ఉంటే.. ఓలా ఎలక్ట్రిక్ మాత్రం వినియోగదారులకు అందుబాటులో ఉండాలనే నెపంతో తన ‘ఎస్1 ఎక్స్’ (S1 X) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం 69,999 రూపాయల ప్రారంభ ధర వద్ద అందించడం మొదలుపెట్టింది. బుక్ చేసుకున్న వారికి కంపెనీ డెలివరీలు త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

ధరలు

నిజానికి ఓలా ఎస్1 ఎక్స్ 2kWh వేరియంట్ ధర రూ. 79999. ఇప్పుడు కంపెనీ దీనిని రూ. 69999లకు అందిస్తోంది. అంటే ఈ వేరియంట్ కొనుగోలు మీద కస్టమర్ రూ. 10000 ఆదా చేసుకోవచ్చు. అదే విధంగా ఎస్1 ఎక్స్ 3kWh వేరియంట్ ధర 89,999 రూపాయలు. దీనిని కంపెనీ రూ. 84999లకు అందించడం మొదలు పెట్టింది. ఈ స్కూటర్ కొనుగోలు మీద రూ. 5000 తగ్గించింది.

కంపెనీ టాప్ మోడల్ ఎస్1 ఎక్స్ 4kWh వేరియంట్ ధర రూ. 1.10 లక్షలు. ఇప్పుడు కంపెనీ దీనిని రూ. 99,999లకు అందించడం ప్రారంభించింది. ఈ ధరలు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయో స్పష్టంగా తెలియదు. కానీ బుక్ చేసుకున్న కస్టమర్లకు మాత్రం డెలివరీలు వచ్చే వారంలో జరుగుతాయని కంపెనీ స్పష్టం చేసింది.

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ లేదా మీకు సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ యొక్క డిజైన్ మరియు ఫీచర్లలో ఎటువంటి మార్పులు జరగలేదు. ఈ విషయాన్ని కస్టమర్లు గమనించాలి. ధర తగ్గించడం వల్ల ఏదైనా ఫీచర్స్ కోల్పోయి ఉంటాయనే అనుమానం అవసరం లేదు.

ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 ఇంచెస్ స్క్రీన్ పొందుతుంది. ఇందులో స్కూటర్ గురించి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. ఇందులో 34 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. హెడ్‌ల్యాంప్ మరియు గ్రాబ్ రైల్ మరియు టెయిల్ లైట్స్ వంటివి కూడా ఇందులో లభిస్తాయి. ఇవన్నీ స్కూటర్ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

రేంజ్

ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క 4 kWh మోడల్ ఒక ఫుల్ ఛార్జ్ మీద 190 కిమీ రేంజ్ అందిస్తుందని ధృవీకరించబడింది. అయితే ఎస్1 ఎక్స్ 2 kWh మోడల్ 95 కిమీ రేంజ్ అందిస్తుంది. చివరగా 3 kWh మోడల్ ఒక సింగిల్ చార్జితో ఏకంగా 143 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రేంజ్ కూడా అద్భుతంగానే ఉందని తెలుస్తోంది.

ఇతర వేరియంట్స్ ధరలు

ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ విక్రయిస్తున్న ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో మరియు ఎస్1 ఎక్స్ ప్లస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. వీటి ధరలు రూ. 84999 (ఎస్1 ఎక్స్ ప్లస్), రూ. 1.05 లక్షలు (ఎస్1 ఎయిర్) మరియు రూ. 1.30 లక్షలు (ఎస్1 ప్రో). అయితే ఈ స్కూటర్ల కొనుగోలుపైన కస్టమర్ 8 సంవత్సరాల వారంటీని పొందవచ్చని తెలుస్తోంది.

Don’t Miss: దేశీయ మార్కెట్లో Yamaha Aerox కొత్త వెర్షన్ లాంచ్.. ఇది చాలా స్మార్ట్ గురూ!!

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అందులో కూడా ఎక్కువ రేంజ్ అందించే వాహనాలను లేదా తక్కువ ధర వద్ద లభించే వాహనాలను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కేవలం 69999 రూపాయల వద్ద ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లభించడంతో.. తప్పకుండా ఈ స్కూటర్ మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.

తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఓలా అందిస్తున్న ఈ ఆఫర్ పండగలాంటిదే అవుతుంది. కాబట్టి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారు ఓలా యొక్క ఎస్1 ఎక్స్ స్కూటర్ కూడా పరిశీలించవచ్చు. అయితే కొనుగోలు చేయడం అనేది మొత్తం మీ ఇష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది.