Porsche Cars Volleyball Game: సాధారణంగా ఎక్కడైనా మనుషులే ఫుట్‌బాల్, వాలీబాల్ మొదలైన ఆటలు ఆడుతారు. కార్లు ఎప్పుడైనా వాలీబాల్ ఆడటం చూసారా? ఇది వినటానికి కొంత వింతగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూస్తే నమ్మకుండా ఉండలేరు. ఇంతకీ కార్ల వాలీబాల్ గేమ్ ఏంటి? గతంలో ఇలాంటి సంఘటనాలు ఏమైనా జరిగాయా అనే విషయాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
పోర్స్చే కార్స్ వాలీబాల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో పోర్స్చే కంపెనీకి చెందిన కార్లు ఒక ఇండోర్ స్టేషయంలో వాలీబాల్ ఆడటం చూడవచ్చు. ఇందులో బ్రాండ్ యొక్క 911 జీటీ మోడల్ మరియు పనామెరా కార్లు ఉన్నాయి. నెట్‌కు అటువైపు రెండు కార్లు, ఇటువైపు రెండు కార్లు ఉన్నాయి. మొత్తం మీద నాలుగు కార్లు వాలీబాల్ గేమ్ ఆడుతున్నాయి.
ఇక్కడ కనిపించే నాలుగు కార్లు నాలుగు కలర్ ఆప్షన్‌లలో ఉండటం చూడవచ్చు. కార్లు స్టార్ట్ అయ్యే ఉన్నాయి. ఒక కారు బాల్‌ను టచ్ చేసి.. ఇటువైపు కోర్లులోకి పంపిస్తే.. ఇటువైపు ఉన్న కార్లు కూడా అదే విధంగా అటువైపుకు బాల్ పంపిస్తున్నాయి. ఈ వీడియో చూడటానికి చాలా కొత్తగా.. ఆసక్తికరంగా ఉంది. కేవలం కొన్ని సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఎందుకంటే గతంలో మునుపెన్నడూ.. కార్లు వాలీబాల్ ఆడిన సన్నివేశాలు చాలా అరుదు, లేదా.. అలంటి ఘటన వెలుగులోకి రాలేదనే చెప్పాలి.
ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో చూసి వాహన ప్రేమికులు ఫిదా అవుతున్నారు. కార్లు వాలీబాల్ ఆడుతుంటే.. తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ వ్యూయ్స్ మరియు లైక్స్ పొందిన ఈ వీడియో ఎంతోమంది వీక్షకుల మనసు దోచింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాము.
పోర్స్చే కార్లు
నిజానికి భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో పోర్స్చే కార్లకు మంచి డిమాండ్, గిరాకీ ఉంది.ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ పోర్స్చే కార్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. వీటి ధరలు కొంత ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య ప్రజలు కొనటానికి వెనుకడుగు వేసినప్పటికీ.. ఆటోమొబైల్ ఔత్సాహికులు, డబ్బున్న ధనవంతులు మాత్రమే అస్సలు వెనుకడుగు వేయడం లేదు.
పోర్స్చే కంపెనీ లాంచ్ చేసిన కార్లలో 911 జీటీ మరియు పనామెరా వంటి మోడల్స్ ఎక్కువ అమ్మకాలు పొందినట్లు సమాచారం. పోర్స్చే పనామెరా ధర రూ. 1.68 కోట్లు అని తెలుస్తోంది. ఇక పోర్స్చే 911 జీటీ ధర ఏకంగా రెండు కోట్ల రూపాయల కంటే ఎక్కువే అని సమాచారం. ధరలు భారీగా ఉన్నప్పటికీ.. ధరలకు తగ్గ డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ మరియు అత్యద్భుతమైన పర్ఫామెన్స్ అందించడం వల్ల వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
కార్లతో వాలీబాల్ సురక్షితమేనా?
ఇక వీడియోలో కనిపించిన సంఘటన చూడటానికి బాగానే ఉన్నప్పటికీ.. కార్లతో వాలీబాల్ ఆటడం సులభం కాదు, ఓ రకంగా చెప్పాలంటే ప్రమాదం కూడా. ఎందుకంటే వాలీబాల్ కోర్టుకు అటువైపు నుంచి బాల్‌ను ఇటువైపు పంపినప్పుడు.. అటువైపు ఉన్న కార్లు దాన్ని మళ్ళీ ఇటువైపు పంపించడానికి.. ముందుకు లేదా వెనక్కు కదలాల్సి ఉంటుంది. ఆ సమయంలో పక్కన ఉన్న కార్లను లేదా ఎదురుగా ఉన్న కార్లను ఢీ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి కార్లతో వాలీబాల్ గేమ్ సురక్షితం కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే రికార్డ్ చేసినట్లు అనిపిస్తోంది. అంతే కాకుండా ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు.
Don’t Miss: 30 లక్షల మంది ఈ కారును కొనేశారు!.. దీనికే ఎందుకింత డిమాండ్ అంటే..
ఇండియన్ మార్కెట్లో పోర్స్చే
భారతీయ విఫణిలో పోర్స్చే కంపెనీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. కస్టమర్ల అభిరుచికి తగిన విధంగా పోర్స్చే కార్లను రూపొందించి లాంచ్ చేస్తోంది. మార్కెట్లో తన ఉనికిని తెలియజేసుకోవడానికి మాత్రమే కాకుండా.. కంపెనీ దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి కూడా సర్వత్రా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే కొత్త పోర్స్చే కార్లు మార్కెట్లో అడుగుపెడుతున్నాయి, వాహన ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి.